ఏదో కాస్త అలా ఇండియా వెళ్ళొద్దామని, వెళ్తూ వెళ్తూ నాయనలారా నేను తిరిగొచ్చే టైముకి ఈ హెల్తుకేరు బిల్లుని, ఊరకే కారుకారు మని కాకిగోల చెయ్యకుండా, కేరుఫుల్గా పాస్ చెయ్యండ్రా బాబూ అని చిలక్కి చెప్పినట్టు చెప్పి పోతే, తిరిగొచ్చే సమయానికి ఎక్కడి గొంగళీ అక్కడే ఉన్నట్టుంది పరిస్థితి. చివరి నిమిషందాకా లాగి పీకి, చివరికి మంచుతుపానులో సెనేటు భవనాన్ని వదిలి పోయే దోవ లేకుండా దార్లు మూసుకుపోతే అప్పుడు ముక్కి మూల్గి మొత్తానికి నిన్న అర్ధరాత్రి మొదటి వోటు వేశారు. పూర్తిగా పార్టీ చీలిక ప్రకారం నడిచిన ఈ వోటులో ప్రభుత్వ ప్రతిపాదనవేపుగా 60 వోట్లు పడ్డాయి. క్రిస్మసుకి ముందే పూర్తి బిల్లు ఆమోదించబడే అవకాశం ఉండంటున్నారు విశ్లేషకులు.
అంతర్జాతీయ వేదిక మీద, క్యోటో తరవాత మళ్ళి అంత పెద్ద జాతర కోపెన్‌హేగెను లో జరుగుతోంది. మాటల హడావుడే తప్ప చేతల పనితనం సున్న అంటున్నారు పరిశీలకులు. అమెరికానించి చైనా దాకా, ఎవరికీ ఈ "డీల్" అత్యవసరంగా కనబట్టల్లేదు. చివరికి "నో డీల్" యే మిగిలేలా ఉంది. చర్చల్లో బిగుసుకుపోయి కూరుకుపోయున్న డెలిగేత్లకంటే బయట గడ్డకట్టే చలిలో సంగీతంతో ఆట పాటల్తో నిరసన చూపుతున్న ప్రొటెస్టర్లే ఎక్కువగా ఈ తమాషాని ఎంజాయ్ చేస్తున్నారల్లే ఉంది.
ఒబామహాశయుడు నోబెలు స్వీకరణతో సహా ఇంకో మూడు స్పీచిలు దంచికొట్టి వక్తృత్వ నిరూపణ చేసుకుంటున్నాడు గానీ, పరిపాలనా పటుత్వ నిరూపణ ఎక్కడ కనబట్టల్లేదు. నెలపైగా నాన్చినాన్చి మొత్తానికి ముప్ఫై వేల సైన్యాన్ని మంజూరు చేశాడు ఆఫ్ఘనిస్తానుకి. మళ్ళీ వార్తా ఛానళ్ళన్నిటిలోనూ ఆఫ్ఘనిస్తానూ పాకిస్తానూ ప్రముఖంగా వినిపిస్తున్నాయి. 70-80లలో సోవియట్ ఆక్రమణ నాటి దృశ్యాలన్నీ పునరావృత్తమవడమే గాక ఈ సారి పశ్చిమ పాకిస్తానులోకి బలంగా చొచ్చుకుని వచ్చే సూచనలున్నాయి.
ఈ వార్తా ఛానెళ్ల వీక్షణంలో ఒక పెద్దాయన పాకిస్తాను ప్రభుత్వపు కార్యాచరణ గురించి మాత్లాడుతూ, ఆఫ్ఘనిస్తానులో భారద్దేశం 1.2 బిలియన్ల డాలర్ల వరకూ పెట్టుబడి చేసింది అని ఒక మాటన్నాడు. నాకు షాకయింది. ఎక్కడ, ఏ రూపంలో, ఎలా ఈ పెట్టుబడి జరిగింది? మీలో ఎవరికన్నా ఈ కబురు తెలుసునా? తెలిస్తే కాస్త విశదీకరించి పుణ్యం కట్టుకోండి. నాకెక్కడా సమాచారం దొరకలా.
వస్తూ వస్తూనే నాకు థెర్మల్ షాకు .. బయటి ఉష్ణోగ్రత సున్నా దిగువకి జారిపోతుండగా, కొండల్లో మంచు వానల్లో కారు ప్రయాణం జర్రుబుర్రున జారుకుంటూ, ఇష్టం లేని స్కేటింగులు చేసుకుంటూ. ఎట్లా ఇల్లు చేరానో ఆ భగవంతుడికే తెలియాలి. ఇండియా విషయాలు కబుర్లు విశేషాలు ఇంకా చాలానే చెప్పాలి. అవెలాగూ ఒక్క టపాలో ముగిసేవీ కావు కాబట్టి మెల్లగా వీలెంబడి చెబుతాను. కానీ ఒక్క మాట .. ఏంటో అందరూ ఆహా ఓహో అంటే ఎమిరేట్స్ వారి విమానంలో ప్రయాణించాము. అంత దౌర్భాగ్యపు సర్వీసు నేను ఎక్కడా చూళ్ళేదు. పైగా దుబాయి విమానాశ్రయం, షాపింగుకి గొప్పేమో కానీ, వసతులకి మాత్రం దుర్భరం.
హైదరాబాదు పుస్తక ప్రదర్శన రంజు రంజుగా సాగుతోందిగా. రాష్ట్ర విభజన ప్రహసనం ఏ స్థాయిలో ఉందో, తెలుగు పేపర్లు చూసే సాహసం చెయ్యట్లేదు. తెలుగు పేపరంటే గుర్తొచ్చింది. ఇవ్వాళ్ళ ఆంధ్రజ్యోతి వివిధలో పలువురు అమెరికా తెలుగు రచయితలు ఈ సమస్యపై వారివారి అభిప్రాయాలు వెలిబుచ్చారు. పనిలోపనిగా నేనుకూడా ఒక అభిప్రాయం వెలువరించేశా. ఇక్కడ చదవొచ్చు.
ఈ పిల్లోడెవరో, పిట్ట కొంచెం కూతఘనం అన్న లెవెల్లో బ్రహ్మాండంగా బొమ్మలేస్తున్నాడు. పనిలో పని మంచి సెన్సాఫ్ హ్యూమరు కూడా .. మీరూ ఓ లుక్కెయ్యండి. అన్వర్ జాగ్రత్త పడటం మంచిది!

Comments
కల్పన
ఒబామా, నోబుల్ ఉపన్యాసానికి అష్టావంకరల రాజకీయ విన్యాసం చేసినా, మొదటి సారిగా కొంతైనా ఉన్నదున్నట్టు నిజం చెబుతున్నాడనిపించింది :-)
ఆఫ్గనిస్తాన్లో చాలా రోడ్లు, భవనాలు మొదలైనవి భారతీయ ఇంజనీర్లు పునర్నిర్మిస్తున్నారు. వాళ్ళ పార్లమెంటు భవనాన్ని మనవాళ్ళే కడుతున్నట్టు ఎక్కడో చదివాను. అక్కడ పనిచేస్తున్న భారతీయులపై ఎక్కుపెట్టి మరీ దాడులు చాలానే జరిగాయి. ఆఫ్గనిస్తాన్‌తో సంబంధాలు పటిష్టం చేసుకోవటం, అఫ్ఘనిస్తాన్ సరిహద్దుకు ఉత్తరాన తజకిస్తాన్లో, భారత సైనిక స్థావరం ఉండటం పాకిస్తాన్‌కు కొరుకుడుపడట్లేదు.
ఎప్పుడో నాలుగేళ్ళకి గానీ బెనిఫిట్లు మొదలవ్వని బిల్లుకు అర్ధరాత్రి దోపిడీదొంగల్లాగా, అసలేవుందో అందులో ప్రజలకు చెప్పకుండానే, ఏదో కొంపమునిగిపోయినట్టు ఓటు తతంగం జరిపించడం ఎందుకో అర్ధం కాలేదు?
@ శరత్ .. ఈ సారి కారు జారుతానని బెదిరించింది కానీ జారలేదు దాని పుణ్యమాని. సుమారు పదేళ్ళ కిందట ఒకసారి జారింది. నాకదొక్కటే జారుడు అనుభవం :)
@ రవి .. ధన్యవాదాలు. ఆఫ్ఘనిస్తానులో భారతీయుల కార్యకలాపాల గురించి ఏవన్నా వార్తా కథనాలు ఉన్నయ్యా?
మీ భారతదేశానుభవాలు సావకాశంగా, గుర్తు తెచ్చుకుని మరీ చెప్పండి.
నా కారు చాలా సార్లే జారింది, మామూలుగా కాదు, రెండు సార్లు, గుండె గొంతులో కొచ్చే లా. మొన్న నా కాలు జారింది :-), నడ్డి విరిగినంత నొప్పి. ఏంటో పెయిన్ లేకుండా ప్లెజర్ ఉండదు అంటారు కాని, నాకు ప్లెజర్ ఏం రాలా, కాలు జారినందుకు :-)
మీ పుస్తకావిష్కరణ ఫోటోస్ చూసాను. పుస్తకం కొనాలంటే తెలుగు నాడు కి పోవాల్సిందేనా?
పోతే మీ నిబద్దతకి జోహార్లు పాళీ గారు, ప్రవాస రచయితల అభిప్రాయాలు చదివాను. వాకింగ్ ద టాక్. నేను తెలంగాణ ఏర్పాటు కి వ్యతిరేకమైనా సెల్యుట్స్ టు యు.
రవి వైజా సత్య గారు,
నాకు మీరు నచ్చుతారు. ఎక్కువగా కనపడక పోయినా అప్ టు డేట్ ఉంటారు. నేనా వార్త అంతకుముందు చదివాను.
మీ తో ఏకీభవిస్తున్నాను,ఒక్క హెల్త్ కేర్ బిల్ విషయం లో తప్పితే.
పాకిస్తాను సంగతి తెలీదుగానీండి ఆఫ్ఘన్లో మనకాంట్రాక్టర్లు అక్కడి అభివృద్ధిలో అద్భుతంగా పాలుపంచుకుంటున్నారు అందులోనూ తెలుగెంపీల భాగం బానేఉంది.