బ్లాగులూ బ్లాగరులూ

బ్లాగడం మొదలెట్టినప్పుడు ఎందుకు బ్లాగుతున్నామో, ఏమిరాయాలో అర్ధం కాని అయోమయంలో ఉంటాము చాలా మందిమి. ఎవరో ఒక్కొక్కరు మాత్రం ఉంటారు, ఏమి రాయాలో ఎందుకు రాయాలో అని కృతనిశ్చయులైన వాళ్ళు.

కొన్నాళ్ళ పాటు ఏకధాటిగా బ్లాగిన తరవాత, ఓ ఆర్నెల్లో ఏడాదో గడిచిపోయింతర్వాత, సాటి బ్లాగరుల్లో మన పేరుకో బుల్లి గుర్తింపూ, మన టపాల్ని క్రమంతప్పకూండా చదివే కొద్దిపాటి ఆడియెన్సూ ఏర్పణ్ణాక .. హమ్మయ్య, పర్లేదు అనిపిస్తుంది. ఆ తృప్తి వెనకనే ఒక చిన్న సందేహం కూడా బుర్రని తొలచడం మొదలు పెడుతుంది. ఇంతేనా బ్లాగడమంటే .. ఏదో బుద్ధి పుట్టినప్పుడు నాలుగు లైన్లు గిలకడం. ఆ గిలికినప్పుడు ఓ నాలుగు పూటలు ఓ పది మంది వచ్చి చూస్తారు. నచ్చితే మెచ్చుతారు, నచ్చకుంటే నాలుగక్షింతలేస్తారు. మళ్ళి ఒక వారంరోజుల్లో నా బ్లాగు ఎవరికీ గుర్తుండదు. అసల్నేను పని గట్టుకుని ఒక నెల్రోలపాటు కొత్త టపా ఏదీ రాయకుండా ఉండిపోతే వీళ్ళెవరన్నా నన్ను మిస్సవుతారా? .. ఇలాంటి తిక్క తిక్క ఆలోచన పురుగులు బుర్రలో లుకలుక మంటుంటాయి.

2007 లో తెలుగు బ్లాగులు ఒక్క పెట్టున విస్తరించాయి. అనేక ప్రముఖ పేపర్లలో, కొన్ని చోట్ల టీవీలోనూ తెలుగు బ్లాగుల పేరు మారుమోగింది. అప్పటిదాకా పదుల్లో ఉన్న బ్లాగర్ల సంఖ్య ఒక్కసారిగా వందల్లో కెళ్ళింది. కానీ ఇప్పటికీ బ్లాగులకి పాఠకులు సాటి బ్లాగరులే. అప్పటికీ ఇప్పటికీ ఈ పరిస్థితి పెద్దగా మారలేదు. బ్లాగులకి పాఠకులు గణనీయమైన సంఖ్యలో పెరగలేదు.

బ్లాగుల పరిధి ఇప్పుడున్న దానికంటే ఒక వందరెట్లయినా విస్తరించాలి. దైనిక ప్రాతిపదికన జాల విహరణ (browsing the net on a daily basis) చేసే తెలుగు వారి సంఖ్యలో కనీసం 10 శాతం బ్లాగు పాఠకులు కావాలని నా కోరిక.

ఎలా?

Comments

chavakiran said…
బెల్లం ఉంటే ఈగలు అవే వస్తాయి :)

వ్రాతలు చక్కంగుంటే యియ్యాల కాకున్నా రేపన్నా చదివేటోల్లు వత్తారు.
Anonymous said…
నాకు కనిపించిన ప్రతీ వాడికీ ఈ బ్లాగుల గురించి చెప్తున్నాను. నా ఉద్దేశ్యం లో దేశానికి బయట ఉన్నవాళ్ళకే ఉత్సాహం ఎక్కువ అనిపించింది.అదేమిటో ఎవరితో ఈ సంగతి ఎత్తినా, నన్నో వింత ప్రాణి లా చూస్తున్నారు. అయినా పట్టువదలని విక్రమార్కుడి లాగ నేనూ వాళ్ళని వదలడం లేదు !!
శ్రీ said…
నేను కూడా టపా రాస్తే కనీసం ఒక 20 మందికి పంపుతాను చదవండి అని. ఒక 5,6 మంది నేనేమి రాసానా అని నా బ్లాగుని చూస్తూ ఉంటారు కూడా. రెండు సంవత్సరాల ముందు 100 మందిమి ఉండేవాళ్ళం, ఇపుడు ఒక వెయ్యి అయి ఉండచ్చని నా అంచనా. కొంచెం నెమ్మదిగా ప్రగతి సాగిస్తున్నాము,పబ్లిసిటీ ఇంకొంచెం పెంచితే బాగుంటుందేమో?
భావన said…
మంచి టాపిక్....
"ఎలా..." అని మళ్ళీ మా మెదడుకు మేతా? చెప్పొచ్చుగా మాస్టారు ఎలానో కూడా....
@ హరెఫల: నేను ఇండియా లోనే బ్లాగ్ లు చూసే వాళ్ళు రాసే వాళ్ళు ఎక్కువ అనుకున్నానే.. కాదా?
నెమ్మది ప్రగతి సరిపోదు, నోటి మాట వ్యాప్తి కూడ సరిపోదు - అవి కూడా పని చేస్తున్నాయి, కానీ సరిపోవు. ఒక టిప్పింగ్ పాయింట్ చేరాలి.
భావన, నాకు తెలిసుంటే ఈ పాటికి అమలు చేసేసి ఉండే వాణ్ణి!
నాక్కూడా మీలాంటి సందేహాలే వస్తుంటాయి. అందుకే చేయడానికి వేరే ఏమీ కుదరనప్పుడే కాలాన్ని హరించడం కోసం బ్లాగుతుంటా. ఆఫీసులో రోజుకి సరాసరిన అయిదే నిమిషాల పని. ఏమీ తోచక అప్పుడప్పుడు వ్రాస్తుంటాను - అప్పుడప్పుడు తీరిక వున్నా వ్రాయాలనిపించదు.

ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు నాకు బ్లాగుల సంగతీ, నాకో బ్లాగు వున్న సంగతీ నాకే గుర్తుండదు - ఇంకా వారికేమి గుర్తుకుచేస్తాను!

గుర్తింపు కోసం ఉద్యమాలు చేస్తే పోలా. అంటే జగన్ వెళ్ళాలనుకుంటున్నట్లు ప్రజల్లోకి వెళ్ళడం లాంటిది. రేపు ఇది వివరిస్తాను. ఇప్పుడు రైలు టైం అవుతోంది.
Kottapali gaaru,
the best way in current crisis is write a proxy spam and route it to your blog. May be tweak it a lil bit to write comments too :-)
తృష్ణ said…
అలాటి తిక్క ఆలోచనలే ప్రస్తుతం నాకు కలుగుతున్నాయి మాష్టారు..మహా మహా బ్లాగుల ముందు నేనేంత,నన్నెవరు మిస్సవుతారులే అనుకున్నా...నేను నెల రొజులు బ్లాగకుండా ఉండలేను..ఓ వారం రొజులు ప్రయత్నించాలని.. :)
బహుశా ఇంకా ఈ నెల చివరికి నాలుగు నెలలు అవుతుంది కాబట్టేమో....
కొన్ని టపాలకి వ్యాఖ్యలు రాలేదని బాధపడినా;
చదవని, చదవకపోనిమ్మని..నా సోది నే రాసుకుపోతూనే ఉన్నా..
ఇది ఆత్మా రాముడ్ణి శాంతింపచేయటం కోసం..
మన:తృప్తి కోసం..
ప్రతి మనిషికీ ఇలాటి ఔట్లెట్ ఒకటి చాలా అవసరం అని నా అభిప్రాయమండి..!!
Purnima said…
From my experience and understandings, here're my two cents.

People - unless and until are avid readers and can appreciate literature in at least few of its forms - can't really be serious about blog reading. If its required that blog readers should be increased many a times as soon as possible, then the best way is to have good number of blogs which can provide high quality lunch time entertainment. People (at least the set I get to interact) need very simple and entertaining way to reading. Remember, majority of this generation people decide to read a page depending on the length of it's scroll bar.

But, why is there a need to have more readers? Agreed, that we have only handful of people devoted to our blogs, but ain't that enough? Even if by hook or crook we pull in more crowd, we shouldn't be expecting many sticking to the highly intellectual or literary blogs.

That said, knowing and reading blogs helps one grow into a better person and I'm one such an example! Looking forward for more people. :)

Regards,
Purnima
తెలుగులో బ్లాగరులు, బ్లాగు చదువరులు ఎందుకు పెరగడంలేదు? నాకు కొన్ని కారణాలు తోస్తున్నాయి..

1. జాలంలో తిరుగుతూ ఉండేవాళ్ళలో తెలుగు చదవడం రాయడం రానివాళ్ళు చాలామందే ఉన్నారు. వాళ్ళకు సంబంధించినంతవరకు కంప్యూటర్లో కనబడేది తెలుగైనా పెట్టెలైనా ఒకటే!

2. తెలుగు చక్కగా చదివి, రాయగలిగేవాళ్ళకు కంప్యూటరు, జాలమూ అందుబాటులో లేవు. ఉన్నా, ఇక్కడ బ్లాగు లోకం ఒకటుందని తెలీదు.

3. తెలుగువాడికున్న సహజమైన పఠనవిముఖత. మామూలుగానే మనం పుస్తకాలు చదవం. ఒకవేళ చదివినా సినిమాలు, సినిమావాళ్ళ పోసుకోలు కబుర్లూ ఎక్కువగా చదూతాం. ఐడిలు బ్రెయిన్లు మనవి. (నేను మన సాధారణ ధోరణి గురించి చెబుతున్నాను గానీ, ప్రతీ తెలుగువాడూ అలాటివాడని అనుకోవద్దండి. ఎవరెలాంటివాళ్ళైనా, ఈ జాబు, ఈ వ్యాఖ్యా చదివేవాళ్ళు మాత్రం అలాంటివాళ్ళు కారని తేల్చి చెప్పేస్తున్నాను :) )

4. చావా కిరణ్ చెప్పిన బెల్లం ఉంటేనే వచ్చే ఈగలు. నిజానికి ఇక్కడ బెల్లం బాగానే ఉంది. కానీ కొందరు మేతవులకు ఇది బెల్లం లాగా కనబడదు. అంచేత రారు. వీళ్ళ సంఖ్య తక్కువే కాబట్టి పర్లేదు.
Anonymous said…
విడిగా బ్లాగులని ప్రచారం చేసుకోవడం కుదరదు కాని, కూడలి, హారం, జల్లెడ లాంటి వాళ్ళు తెలుగువాళ్ళ మెయిల్ ఐ డి లు సంపాదించి అందరికి తెలియపరిస్తే కొంత ఉపయోగం ఉండచ్చు. మీడియా మిత్రులు వాళ్ళ వాళ్ళ మీడియా ద్వారా మంచి టపాల గురించి ప్రజలకి చెప్పవచ్చు.
kiranmayi said…
నేను చెప్పనా, నేను చెప్పనా?
లాస్ట్ ఇయర్ హైదరాబాద్ లో బుక్ ఎగ్జిబిషన్ లో మన బ్లాగర్లందరూ కలుసుకున్నారట కదా? అలాగే ఇక్కడ కూడా ఎ బుక్ ఫెస్టివల్ లాంటిదాంట్లో మన స్టాల్ లాంటిది పెడితే? కాకపోతే అందరం ఒక సిటీ లో లేం కాబట్టి కష్టమేమో? నేను అవిడియా వదిలా కదా మీరందరూ ఇక్కడి నుంచి అల్లుకుపొండి. కాని ఇది ఇక్కడ US లో ఉన్న బ్లాగర్ లకి మాత్రమే పరిమితమవుతుందేమో? ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ బ్లాగ్గింగ్ గురించి తెలుసు కదా. ఇండియా లో ఉన్న మహామహుల (బ్లాగార్ల) సంగతేటి? ఏమిటి, చెత్త ఐడియా ఇచ్చానా? అలా అయితే sorry. భోనగిరి ఐడియా కూడా బాగుంది.
శరత్,
మీరేంటి బాబు? మరీ ఐదు నిమిషాల పనా? నేను మిమ్మల్ని చూసి చాలా కుళ్ళుకుంటున్నాను.
@kiranmayi - been there, done that - unfortunately, it did not produce a result in proportion to the effort.
kiranmayi said…
You mean you had actually participated in a book festival or something similar?
@ kiranmayi - yes. See the following, for example:
http://kottapali.blogspot.com/2008/09/blog-post_23.html
నేను ప్రస్తుతము మీరన్న తిక్క స్టేజ్ లోనే వున్నానండి ! ఏమిరాయలో తోచక ఏవేవో రాసేస్తూ , ఎవరైనా చూస్తున్నారా ? లేదా ? అని పది సార్లు చూసుకుంటూ ,ఏదో ఈ కాలక్షేప బఠాణి బాగానేవుంది.
హెడ్ మాస్టర్ గారు , తెలుగు సరిగ్గా రాసానా అండీ ?
కొద్దిగా రాయటము నేర్చుకున్నాక మీకు థాంక్స్ చెబుదామని ఎన్ని సార్లు చూసినా మీ బ్లాగ్ నాకు కూడలి లో కనిపించలేదు.ఇప్పుడు ఎదో చూస్తుంటే అనుకోకుండా కనిపించింది.
లేఖిని ని పరిచయము చేసి నాకు వ్రాయటము సులభము చేసినందుకు చాలా థాంక్స్ అండి.
కిరణ్మయి గారి అభిప్రాయమే నాదీనూ.

అయితే నా అభిప్రాయం బుక్ ఫెస్టివల్ లాంటి వాటిల్లోనే కాదు - ఎక్కడ (చదువుకున్న) మనుషులు అనబడే ప్రాణులు బాగా వుంటే అక్కడ. అంటే బస్సుస్టాండ్ ముందు, రైల్వే స్టేషన్ల ముందు, తిరునాళ్ళ దగ్గర అలా అలా ఎక్కడ మానవ సమూహాలు వుండొచ్చో అక్కడ బ్లాగు స్టాల్ పెట్టాలి. ఏముంది ఓ టెంటు వేసి కరపత్రాలు పంచుతూ, ఆసక్తి కనపరచిన వారికి వివరిస్తూ వుంటే పోలా. ఓ దీనికి ఓ పది మంది అవసరం లేదు. ఇద్దరున్నా చాలు.

అయితే ఇది ఎక్కువగా ఇండియా లోనే వీలు అవుతుంది. విదేశాలలో తెలుగు వారు కలుసుకునే సందర్బాలే తక్కువ - స్పెషల్ గా కలుసుకున్న సందర్భాల్లో ఇలాంటి ఏర్పాటు చేయాలంటే ఖర్చు అవుతుందేమో. ఖర్చు కాని పద్ధతి ఏమయినా తోచితే షికాగోలో నేను ప్రయత్నిస్తా. ఇప్పుడిప్పుడే కొన్ని ఆలోచనలు వస్తున్నాయి. చూడాలి.

@కిరణ్మయి
:) నేను నా (పని) గురించి చెప్పింది అతిశయోక్తి కాదు. ఇప్పుడిది వ్రాస్తుందీ పని దగ్గరే.
kiranmayi said…
నాకు ఇంకొక చాలా గొప్ప ఐడియా వచ్చింది. మెమోరియల్ డే కి Washington DC వెళ్ళినప్పుడు మా తోటికోడలు నన్ను Gem Show కి తీసుకెళ్ళింది. శరత్ గారు అన్నట్టు అక్కడైతే తిరునాళ్ళలాగే ఉన్నారు జనం . beach sand (ఇసుక) వేస్తే రాలనట్టుగా. ఆ షో సంవత్సరం పొడుగునా ఎక్కడో ఒక చోట అవుతూనే ఉంటుంది. అక్కడ ట్రై చేస్తే. ఇంక నన్ను అయిడియాలు చెప్పడం ఆపెయ్యమంటారా?
రవి said…
ఎలా?

పట్టని వాళ్ళకు ఎలానూ పట్టదు.

కాబట్టిన వాళ్ళు ఎలాగూ బ్లాగుతారు, బ్లాగులు చదువుతారు. వీరిద్దరూ కాక మధ్యతరగతి వర్గం ఉందే - అదుగో వారే మన టాపిక్కు. వారిని ప్రోత్సహించాలంటే -
అసలు బ్లాగులు ఎందుకు చదవాలి? ఎవరో రాశారు కాబట్టి చదవాలి అంటే కుదరదు. ఏదైనా పనికొచ్చే మాటర్ కావాలి. నేనో అబ్లాగర్ని. నాకు కథలంటే ఇష్టం అనుకుందాం. బ్లాగుల్లో కథకులున్నారు, మంచి మంచి కథలు రాస్తారు అని తెలియాలి కదా. ఇప్పుడున్న కూడలి, జల్లెడ, సంకలినులు గా ఉపయోగపడుతున్నాయి. అయితే కథల బ్లాగర్లెవరు, వారి బ్లాగుల కథ కమామీషు ఏమిటి? అన్న ఆ నమూనా ప్రశ్నకు సమాధానం ఖచ్చితంగా దొరకట్లేదు.

సో, టాపిక్ వైజ్ ఉన్న బ్లాగుల విషయం తెలియాలి, అవి పాపులర్ అవాలి.

వీటికి నాకు తోస్తున్న సమాధానం.

౧. బ్లాగులతో పాటు (చందమామ గుంపు లాగ) తెలుగు గుంపులు మరిన్ని అధికం కావాలి. వాటి గురించి కూడా కూడలి, జల్లెడ, తెలుగురత్న వీటిలో సమాచారం లభించాలి.

౨. కూడలి వంటి మరిన్ని సమాహారాలు వైవిధ్యభరితమైనవి రావాలి. (కొన్నేళ్ళ క్రితం తేనెగూడు ఒకటి ఉండేది, కూడలికి సమానంగా. ఉన్నట్టుండి చెదిరిపోయిందది.)

౩. ప్రతి వారం/నెల పాపులర్ బ్లాగుల గురించి ఎక్కడైనా రావాలి. రాసే వాళ్ళకు అదో మంచి ఉత్ప్రేరకంగా పనికొస్తుంది.

౪. బ్లాగుల మీద, బ్లాగర్ల మధ్య ఇదివరకు చర్చలు జరిగేవి, చాటింగ్ వంటివి నడిచేవి. అవి మళ్ళీ పునరుద్ధరింపబడాలి.

..........
..........

(ఇక్కడ సలహాలు మాత్రమే చెప్పబడును. :-))
@kiranmayi

"ఇంక నన్ను అయిడియాలు చెప్పడం ఆపెయ్యమంటారా?"

మీ మాటలు చూసి బాగా నవ్వొచ్చిందండీ.

పర్లేదు. కానివ్వండి. కానివ్వండి.
@ kiranmayi .. keep those creative ideas bubbling up :)

@ రవి .. మీ సూచనలన్నీ బాగున్నాయి. నెలనెలా మంచి టపాల జాబితా ఈ మధ్య వరకూ పొద్దులో ప్రకటించేవారు. ఈ మధ్యనే మానేశారు. అదలా ఉండగా, పొద్దు సైటుకే సందర్శకులు పెద్ద సంఖ్యలో ఉన్నారని నేననుకోను.
బ్లాగర్ల మధ్య బహిరంగ చర్చ పెట్టాలి అంటే పెట్టుకోవచ్చు. నాకు తెలిసి, కూడలిలోనూ, పొద్దులోనూ అటువంటి సదుపాయం ఉంది. రెండు మూణ్ణెల్లకోసారి అలాంటి చర్చ పెట్టుకుంటే బానే ఉంటుంది.
బేసిగ్గా నేననేదీ అదే. పైన చదువరిగారన్నట్టు, బ్లాగుల్లో బెల్లం బాగానే ఉంది, కానీ అదక్కడ ఉన్నదని ఈగలకి తెలిసేదెలా?

@ శరత్ .. :)
కొత్తపాళీ గారూ మీ కోరిక తీరుతున్నట్టేనా అండీ...
Kottapali said…
జ్యోతిర్మయిగారు, నా కోరిక తీరుతున్నదని ఎలా అనుకున్నారు?
Disp Name said…
కొట్టమూ ఉంది.

పాళీ ఉంది.

చదువరులు లేరంటారా ?

చదివిన వారు అందరు కామెంటు రాయాలని అనుకోరేమో !

పూర్వ కాలం లో మా ఆంద్ర పత్రికలో ఓ పేజీ 'ఉత్తరాలు' పడేవి అంతకు ముంపు వారం గురించి. ఆ పేజీ ఒక నమూనా మాత్రమె అన్న మాట ! ఇక పత్రిక సర్కులేషన్ మొ న వి ఆ యా పత్రిక ఆదరణ బట్టి.

కాని ఇక్కడ ఐదు నిముషాల కో సారి కొట్టం నించి టపాలు వెలువడు తుంటాయి సంకలిని ల లో సో దానికి తగ్గట్టు ఆదరణ కూడా ఓ ఐదు గంటలు వుంటాయేమో!

ఇక చదువరి అంటారా, పై న చెప్పినట్టు బెల్లం వున్న చోట ఈగలు ఖచ్చితం !

చీర్స్
జిలేబి. (ఇక్కడ పాకం ఉందా?)
కొత్త పాళీ గారూ..2009 నాటికి నేటికి బ్లాగుల సంఖ్య పెరిగింది. బ్లాగు పాఠకుల సంఖ్య కూడా పెరిగి౦దనే చెప్పొచ్చేమో..సాటి బ్లాగరులే కాకుండా పాఠక వర్గం వేరే ఉందని మొన్న డల్లాస్ వెళ్ళినపుడు తెలిసింది. కాకపోతే కామెంట్స్ విషయానికి వస్తే సాటి బ్లాగర్లే మనకు ఎక్కువగా కనిపిస్తారు.

"ఒక నెల్రోలపాటు కొత్త టపా ఏదీ రాయకుండా ఉండిపోతే వీళ్ళెవరన్నా నన్ను మిస్సవుతారా?"

తప్పకుండా అవుతారండీ..నాకందరిగురించీ ఇంకా పూర్తిగా తెలియక పోయినా వాళ్ళింకా వ్రాయలేదామా అని చూస్తుంటాను..బ్లాగు ప్రపంచంచమ౦తా ఓ ఊరు లాగానూ మనమందరమూ సన్నిహితులుగానూ అనిపిస్తూ ఉంటుంది. మా ఇంట్లో మీ అందరూ చిరపరిచితులే...
Kottapali said…
Zilebi, నెనర్లు.

జ్యోతిర్మయి .. అవును పెరుగుతున్నారు. కానీ నేను పైన టపాలో చెప్పిన పాయింటు మీరు మిస్సయ్యారు. ఒకట్లుగా పదులుగా పెరిగేది సరిపోదు. గుణశ్రేఢిలో (geometric progression) పెరగాలి.
Unknown said…
edo oka incentive kavalandi(ivvali) prathi blagu chadavadaniki :) Time ekkada veetannititho keep up cheyyadaniki. FB, email, web magazines too many..
Unknown said…
సారీ ఇందాక పూర్తి చెయ్యలేదు చెప్పదలుచు కున్నది. చాలా చాలా publicity కావాలండి. బ్లాగ్స్ అంటే బ్లొగ్గెర్స్ తమ స్వంత సుత్తి ఉంటుందని చాలా మంది అభిప్రాయం. పర్సనల్ గ తెలిసిన వాళ్ళవి నేను ఫేస్బుక్ లో లింక్స్ చూస్తే చదువుతా. అయితే మీరు అనుకున్నంతగా పెరుగుతుందని నేను అనుకోను - ఎందుకంటే చాలా చాలా ఉన్నాయి మనకి. అన్నిటికి న్యాయం చెయ్యడం కష్టం.