మనం చాలా సమర్ధులం.
అబ్బో, మనలో బోలెడు సామర్ధ్యం ఉంది.
ఎంత సామర్ధ్యం ఉన్నదంటే, ఎంత ఉన్నదో మనకే తెలీక, వ్యక్తిత్వ వికాస పుస్తస్కాల రచయితలూ, కోర్సుల నిర్వాహకులూ, ఆఖరికీ సినీ రచయితలు కూడా ఈ విషయాన్ని మనకి పదేపదే ఎప్పటికప్పుడు బోధిస్తుంటారు. మనలో ఎంత సామర్ధ్యం ఉన్నదో ఎప్పటికీ మనం మర్చి పోకుండా, ఏ క్షణమూ మనం సమర్ధులమనే విషయం మనకి మరపు రాకుండా.
మా అమ్మా నాన్నల తరం సంగతి, కనీసం ఈ విషయంలో, నాకు అంత బాగా తెలీదు కానీ, నా తరంలో .. మనసు పెడితే సాధించలేనిదేదీ లేదు, మనకి అసాధ్యం ఏదీ కాదు, మనం సకల సమర్ధులం అన్న ఆత్మ విశ్వాసంతోనే పెరిగాం మేమంతా. అలాగే సగం జీవితాన్ని గడిపేశాం కూడా. ఎప్పుడన్నా యాభైల్లో అరవైల్లో రాసిన కథలూ నవల్లూ చదువుతున్నప్పుడు, ఆ నిరుద్యోగ సమస్యలూ, ఆ దిగువ మధ్య తరగతి దిగుళ్ళూ, ఆ బేలబేల ప్రేలాపనలూ, ఆ దీనాలాపాలూ చదివి అప్పుడప్పుడూ వొళ్ళు మండేది కూడాను. ఆ ఆ బేల దీన ఏడుపుగొట్టు హీరో వెధవాయిని పట్టుకుని ఆ చెంపా ఈ చెంపా వాయించి ఒక నాలుగు పుంజీల వ్యక్తిత్వ వికాసం వాడి నోట్లో కుక్కి, ఒక నాలుగౌన్సుల ఆత్మవిశ్వాసపు హార్మోను ఇంజెక్షనిచ్చి, సిక్స్ ట్రాక్ స్టీరియోఫోనిక్ సిస్టంలో కుడిచెవిలో ఎప్పుడూ ఒప్పుకోవొద్దురా వోటమీ అంటూనూ, ఎడమ చెవిలో సాహసం శ్వాసగా సాగిపో సోదరా అంటూనూ మారు మోగించేసెయ్యాలనిపించేది.
మరింత సామర్ధ్యం ఉంది గదా మనలో! అదొక మధుమదోన్మత్త కాల్పనిక జాగ్రదావస్థ!!
ఉన్నట్టుండి మెలకువొస్తుంది.
అప్పటిదాకా తనువులు వేరైనా మనసులు ఒకటే అనుకున్న స్నేహితుడు ఉన్నట్టుండి బద్ధశత్రువైపోతేనో, అప్పటిదాకా మనకి కొండంత అండగా నిలిచిన అమ్మ అనారోగ్యం పాలయ్యి మన కళ్ళముందే జీవఛ్ఛవంలా ప్రాణమున్న అస్తిపంజరంలా తయారవుతుంటేనో, అప్పటిదాకా ప్రాణప్రదంగా ప్రేమించిన భర్తో భార్యో ఇక నీతో జీవితం చాలు అని దాంపత్యానికి చరమగీతం పాడుతుంటేనో, మన జీవన దీపం అని అప్పటిదాకా అల్లారుముద్దుగా పెంచుకుంటున్న మన బిడ్డ తెలిసితెలిసీ తప్పు దారి పట్టి మనకి దూరమై పోతుంటేనో ...
అప్పుడు అనిపిస్తుంది, బహుశా మనం అంత సమర్ధులం కాదేమోనని!
ఒక్క క్షణం పాటు.
ఒక ఆత్మవిశ్వాసపు ఇంజక్షను మనకి మనమే చేసుకుని సాగిపోతాం, సాహసం శ్వాసగా.
సర్వ సమర్ధులం కదా మరి!

Comments
మనిషిపై మోపిన ఈ అబద్ధపు గ్రాండియర్‌ని విదిలించుకోవటానికి ఈ తరం చాలా మథన పడాల్సి వస్తోంది. మాకు తొడిగిన ఉక్కు కవచాల్లో మేమే ఊపిరాడక ఉక్కిపోతూ, వాటిని పెగల్చుకు బయటపడ్డానికి మాతో మేమే యుద్ధం చేసుకోవాల్సివస్తోంది. అందుకే బహుశా: బలహీనతలూ, అసమర్థతలూ కూడా మనిషితనంలో భాగమేనని అంగీకరించిన గతకాలం పట్ల ఆపేక్షా భావన. ఈ వ్యక్తిత్వవికాస సిద్ధాంతాల గోల ఇలాగే పెరుగుతూపోతే కొన్నాళ్ళకి "నేను స్థితప్రజ్ఞుణ్ణీ, నేను సింహబలుణ్ణీ, నేను పుడింగినీ" ఇలాంటి సెల్ఫ్‌హెల్ఫ్ సజెషన్ల స్థానే— మనశ్శాంతికీ, భూమ్మీద కాలు నిలబడ్డానికీ— "నేను చీమని, నేను దోమనీ, అబ్బే నాకంత లేదు" లాంటి "పాజిటివ్" సజెషన్లు ఇచ్చుకోవాలేమో.
harephala .. everything is fine
murali .. there's got to be a middle ground
meher .. exactly
ఏంటబ్బా ఈ మధ్య టపాలేం వ్రాయటం లేదు అనుకుంటున్నాను! ఇదన్నమాట సంగతి!! (కూడలి నుండి నడక బయటకి).
టెంప్లెట్ మార్పులు బాగున్నాయి.
ఈ పుస్తకాలు నువ్వు గెలవ గలవు అని చెప్తాయే కానీ, ఓడిపోతే చచ్చిపో అని చెప్పవు కదా, ఏ రచయిత అయినా పరిమితులకి లోబడి ఉన్న సామర్ధ్యం గురించే చెప్తారు కానీ నువ్వు ఇంద్రుడివి చంద్రుడివి నీకు తిరుగులేదు అని చెప్పరు కదా. వీళ్ళ ముఖ్య ఉద్దేశ్యం ఒక్క ఓటమి తోనే నిరాశ చెందే వారిని పోరాటానికి సిద్దం చేయడం కాదంటారా..
సిసిము .. సత్యం గ్రహించారు కదా, అంచాత చందాదారులు కండి :)
జ్యోతి .. సమస్యలు ఎదురవడం, ఎదురైనప్పుడు డీలా పడ్డం సహజమనే నేను చెప్ప ప్రయత్నించింది.
వేణుశ్రీకాంత్ .. ఆయా రచయితల ఉద్దేశమేవిటో నేనేం చెప్పగలను? కానీ చుట్టూ జరుగుతున్నదీ, మనుషులు అనుభవిస్తున్నదీ మాత్రం చూసి చెబుతున్నా. మనిషికి ఉత్సాహం ఎంత అవసరమో, తన పరిమితులు తెలిసి ఉండడం కూడా అంతే అవసరం. ఆ బేలెన్సు ఎవరికి వారు స్వానుభవంగా నిర్ణయించుకోవాలి. బయణ్ణించి వచ్చే వత్తిడితోనే ప్రమాదమంతా. ఈనాటి మనిషి అప్పుడప్పుడూ "ఇది నావల్ల కాదు" అనగలగడం నేర్చుకోవాలి.
అన్నీ కల్సి రావడం వల్ల కలిగే పరిణామాలను కూడా మన సామర్ధ్యమే అనుకుంటూ ఉంటాం. మీరు చెప్పిన స్నేహితుడి ఉదాహరణే తీసుకుందాం. అప్పటి దాకా ముఖ పరిచయంలేని మనిషిని అత్మీయ స్నేహంగా అంగీకరించామన్న సంగతి మనకు స్ఫురించగానే, ఆ బంధం మన సామర్ధ్యం వల్ల ఏర్పడిందని మురిసిపోతాం. దానికి ఇంకా చాలా contributions (ఏమనాలి తెలుగులో?) ఉండచ్చు.. కానీ మనకి ఆనందం కలిగేది కాబట్టి మనమే కారణం అన్న భ్రమలో ఉంటే, ఆ కూరిమి విరసంబైన వేళ అంతా మన తప్పే అనిపించచ్చు.
నా పాయింట్ ఏంటంటే: మన సమర్థాతాసమర్థల పై పూర్తి అవగాహన ఉండడం ఒక సమర్థత. మనకి జరుగుతున్న మంచి లేక చెడు పరిణామాల్లో మన సమర్థతాసమార్థలెలా ఉన్నాయన్నది తెల్సుకోవడం ఒక సమర్థత!
ఇప్పుడే ఒక స్నేహితురాలు అంటూ ఉండింది: You should know to let few things go off. I guess, that's important.
నాకెందుకో ఈ పోస్టు చాలా చాలా నచ్చేసింది! :)
అందువల్ల ఏదైనా ఒక విషయంలో అసమర్ధత ఉంటే దాన్ని అలాగే చూపించటానికి ఎవరూ ఇష్టపడట్లేదు. ఎప్పుడైతే తప్పనిసరి పరిస్తితుల్లో ఆ అసమర్ధత బయటపడుతుందో అప్పుడు ఆత్మహత్యలు శరణ్యంగా భావిస్తున్నారనిపిస్తుంది.
మీటపా ఆలోచింపజేసేదిగా ఉంది. చాలా నచ్చింది.
సమర్ధత అసమర్ధతలమధ్య గీత గీయడం కష్టమే కానీ తన కంట్రోల్ లో లేని, తాను ప్రభావితం చేయలేని విషయాలని వదిలి వేసినా, తను చేయగలిగిన పని లో నా సామర్ధ్యం ఇంతే, ఇంతకన్నా చేయలేను అని కూచుంటే అభివృద్ది జరగదు కదా... జీవితం లో వృద్ది చెందాలంటే సగటు సామర్ధ్యాన్ని మించి సవరించిన లక్ష్యాలు (stretched goals) చాలా అవసరం. అంతెందుకు రైట్ సోదరులు "ఎగరడమా.. అబ్బో అది మన వల్ల యాడవుద్ది లేబ్బా..." అని కూర్చుంటే ప్రపంచం ఇంత చిన్నదయ్యేదా.
ఏదేమైనా మీరు చెప్పిన "మనిషికి ఉత్సాహం ఎంత అవసరమో, తన పరిమితులు తెలిసి ఉండడం కూడా అంతే అవసరం." అన్నది నిర్వివాదాంశం కానీ ఉత్సాహం ఎంత వరకు ఉండవచ్చో, మన పరిమితులు ఏమిటో తెలియచెప్పేది ఎవరు ? అనేదే నా ప్రశ్న. వ్యక్తిత్వ వికాస పుస్తకాలు, కోర్సులు దీనికి కొంత వరకయినా తోడ్పడుతున్నాయి అని నా ఉద్దేశ్యం.
One clarification though .. I was not talking only about extreme cases that lead to suicides or attacks. People sometimes suffer immense damage to their internal selves without manifesting external violence.
కానీ, ఇప్పుడు అందరూ ఓటమి అంటే ఒప్పుకోవడం లేదు! ఓడిపోయామంటే సామర్ధ్యం లేదు అనే కోణంలో ఆలోచిస్తున్నారే తప్ప తమ సామర్ధ్యం తక్కువైంది, ఇంకొంచెం సానపెట్టుకోవాలి అని ఏ మాత్రం అనుకోవడం లేదు..
కర్మ సిద్ధాంతం అని చెప్పి ఇంకొకటి చెప్పాడు. నమ్మడం కోసం నమ్మవచ్చుఁ.
-
అనుకున్నవన్నీ అయిపోతాయి అనుకుంటే పనిచేయడం తేలిక, కానీ అది నిజం కాదు, ప్రపంచంలోని యాదృచ్ఛికతను ఎప్పుడోకప్పుడు ఒప్పుకోక తప్పదు. అపోహల నుండి బయటకు రావడం నొప్పితో కూడుకున్న పనే.