ఇప్పటిదాకా చలికాలమని చెప్పి హాయిగా వెచ్చగా ముడుచుకుని బజ్జున్న నా మూడు బ్లాగులకీ మేలుకొలుపు పాడుతున్నా.
విన్నవీ కన్నవీ
నా ముఖ్య అభిరుచులైన సంగీతం సాహిత్యం చలనచిత్రాల గురించి నాకు తోచిన ముచ్చట్లు చెప్పుకోడానికి పెట్టుకున్న బ్లాగిది. సినిమాల మీది రచనలన్నీ నవతరంగానికీ, సాహిత్యమ్మీద రచనలన్నీ పుస్తకానికీ పోగా ఇక దీనికి మిగిలేది సంగీతమొక్కటేనేమో! ఐనా వారానికి కనీసం ఒక కొత్త టపాతో మీకు కనుల విందు, వీలైతే వీనుల విందు చేస్తుందిది. సందర్భోచితంగా, కర్నాటక సంగీతంలోని మేలుకొలుపు రాగాల ప్రస్తావనతో తిరిగి మేల్కొందివ్వాళ్ళ.
సాంప్రదాయ తెలుగు పద్య సాహిత్యం
సాంప్రదాయ తెలుగు పద్య సాహిత్యం తెలుగు వారికి పూర్వికులిచ్చి పోయిన తరగని ఆస్తి అని నా నమ్మకం. దురదృష్ట వశాత్తూ, ప్రపంచంలోని ఏ జాతి ప్రజలూ చెయ్యని రీతిలో మనం ఈ ఆస్తిని నిర్లక్ష్యం చేసి దుర్వినియోగం చేసుకుంటున్నాము. పద్యమంటే భయం, ఆ పద్యాల్లోని భాష అంటే భయం, హబ్బే మాకు తెలుగు రాదు అని కంగారు పడే ఆర్కుట్ తరానికి, ఆంగ్లానువాదంతో కొన్ని తెలుగు పద్యకావ్యాల్లోని ఆణిముత్యాల్ని పరిచయం చెయ్యాలని ఈ బ్లాగు ప్రారంభించాను. ఆంధ్రభోజుడు, సాహితీసమరాంగణ సార్వభౌముడు, శ్రీకృష్ణదేవరాయ భూపాలుడు రచించిన ఆముక్తమాల్యద ప్రబంధము నుండి మంగళకైశికి యనే మాలదాసరి కథని రాస్తూ ఉండగా విరామం వచ్చింది. ఆ కథని కొనసాగిస్తున్నాను. ఇది ఇంకొక్క సంచ్కతో గోదాకళ్యాణ మహోత్సవంతో ముగుస్తుంది. అటుపైన ఇంకో తెలుగు కావ్యంనుండి ఇంకో రసగుళిక.
ప్రతిబింబం
రోజుకో కొత్త బొమ్మ.

Comments
game for sangeetam.net? ;)
మూడు బ్లాగులూ నిరాటకంగా కొనసాగాలని అభిలషిస్తూ..
మూడూ బ్లాగు ల్లోనూ క్రమం తప్పక టపాయించే వీలు దొరకాలని కోరుకుంటూ..
"మీ ఆలోచనలు చాలా బాగున్నాయి.వాటిని గేయ కవిత్వం రూపంలో కంటే పద్యకవితా రూపంలోకి మలచగలిగితే శాశ్వతత్వం సంతరించు కుంటాయి. ఎందుకంటే పద్య కవిత్వానికున్న చంధస్సు ఆ గుణాన్ని పెంపొందిస్తుంది. పైగా ధారణ కనువై మనసులో గుర్తుండి పోడానికి వీలు కలుగ జేస్తుంది. ఆ దిశగా కూడా ప్రయత్నం ప్రారంభించండి.శుభం భూయాత్." తో ఆ దిశగా కాస్త ప్రయత్నం మొదలు పెట్టాను. కావాల్సినవారు your plate is too full, you may get stressed out అని హెచ్చరిస్తున్నా, the busiest man has the greatest leisure అన్న మా సహజమార్గ గురు వాక్కు ననుసరించి కొద్దికొద్దిగా ఈ లోకంలోకి తొంగిచూస్తున్నా. త్వరలో ఒక పద్యం వ్రాయాలని, దానికి 08/30/09 deadline గా నిర్ణయించాను. అలా తేదీలు పెట్టకపోతే వాటికి అలవాటు పడిన మనసు లొంగదని అనుమానం ;) కనుక త్వరలో ఒకటి మీకు సంధిస్తాను.