గుర్తు చేసుకోడానికి వీలుగా ఉంటుందని రివర్సు వరుసలో వెళ్తాను.
నిన్ననే స్లండాగ్ మిలియనేర్ చూశాం. చాలా బాగుంది. సినిమా కేవలం కామెడీ, సినిమాని సినిమాలాగానే చూడాలి .. ఇట్లాంటి సొల్లు కబుర్లు కాకుండా మంచి సినిమా చూడాలి అనుకునేవారెవరైనా తప్పక చూడాల్సిన సినిమా. ముఖ్య పాత్రలైన జమాల్, సలీం, లతిక సుమారు 8-10 ఏళ్ళ వయసులో, మళ్ళీ 13-15 ఏళ్ళ వయసులో, ఆఖరికి 18-20 వయసులో కనిపిస్తారు. అన్ని వయసుల పాత్రల్లోనూ చేసిన వాళ్ళు బాగా చేశారు కానీ, అతి చిన్న వయసులో సలీం జమాల్ గా చేసిన మగ పిల్లలిద్దరూ తినేశారంతే. ఇర్ఫాన్ ఖాన్ గురించి చెప్పేదేముంది. గేంషో హోస్ట్ గా అనిల్ కపూర్ చాలా పరిణతి చెందిన నటన కనబరిచారు. నటన పక్కన పెడితే, ఇక సినిమా అంతా స్క్రీన్ ప్లే, దర్శకుని ప్రతిభ.
నేను సాధారణంగా సమకాలీన హిందీ సినిమాలకి దూరంగా ఉంటూ ఉంటాను. కానీ ఏదో బలహీన ముహూర్తంలో బలైపోతుంటాను. అలా మూడు సినిమాలకి నా బుర్ర నైవేద్యం పెట్టాల్సొచ్చింది.
ముందు జోధా అక్బర్. ఏదో సోప్ ఆపెరా షోలో అక్బర్ ని హీరో చేసినట్టుగా ఉంది. అక్బర్ గారు వీరోచితమైన మాటలూ, రాజోచితమైన మాటలూ మానేసి, ఇరవయ్యొకటో శతాబ్దపు నాగరిక మగవాడిలా ఆడవారి మనసుల్ని అర్ధం చేసుకోవడం, అంతరంగాలు కలుసుకోవడం లాంటి అర్ధం పర్ధం లేని మాటలు మాట్లాడుతుంటాడు. ఎంతో రాజనీతిజ్ఞుడిగా పేరు పొందిన అక్బర్ గారు మారు వేషం వేసుకుని బజారు వీధిలో తిరిగితే తప్ప ప్రజలు పన్నుల బాధలు తట్టుకోలేక బాధపడుతున్ణారని తెలుసుకోలేడు. హిందువుల తీర్థయాత్రల మీద ఉన్న పన్ను తొలగించడం ద్వారా ఒక్ఖ దెబ్బని పాప్యులారిటీ పెంచేసుకుంటాడు. పన్లో పని, సదరు హిందువులు, అయ్యవారి ఉదారతకి మెచ్చి "అక్బర్" అని బిరుదిచ్చేస్తారు. (అల్లాహో అక్బర్ అనేది ముస్లిముల సాధారణ ప్రార్ధన అని వాళ్ళు తాత్కాలికంగా మర్చిపోయారు.) ఉన్నంతలో సుగుణం ఏంటంటే ఐశ్వర్య అమ్మగారు నటించాలని ప్రయత్నం కూడా చెయ్యలేదు. ఆమెకూడా నటించి ఉంటే చచ్చుండేవాళ్ళం. మిగతా పాత్రల్లో కాస్త టేలెంట్ ఏదన్నా ఉంటే అది కోంచెం కూడా జాలువారకుండా దర్శకుడు తగు జాగ్రత్తలు తీసుకున్నాడు. సినిమాకి ఇంకో ప్లస్ పాయింటు అద్భుతమైన ఆగ్రా కోట లో జరుగుతుంది సగం కథ. ఆగ్రా కోటని ఇంత అద్భుతంగా అందంగా నేనెప్పుడూ చూళ్ళేదు.
రెండోది జబ్ వియ్ మెట్. కొంత కాలం క్రితం ఇక్కడ స్నేహితుల వలయాల్లో ఈ సినిమా పేరు మారుమోగింది. ఓయబ్బో ఎంత గొప్పసినిమానో అనుకున్నాం .. ఇన్నాళ్ళు చూడకుండా ఉండిపోయినందుకు తెగ ఫీలైపోయి మరీ డిస్కు తెచ్చుకున్నాం. వోర్నాయనో .. కరీనా అమ్మగారు ఎడాపెడా లెఫ్ట్ రైట్, మైక్ టైసన్ లెవెల్లో వాయించేసింది. కోట్లకి పడగెత్తిన వా్ణిజ్య కుటుంబానికి ఏకైక వారసుడుగారు, సినిమా చివర్లో .. ఏ సమస్య ఎదురైనా ఈ పరిస్థితుల్లో కరీనా ఏం చేస్తుందీ అని ఆలోచించి అలా ఆయా సమస్యల్ని పరిష్కరించుకున్నాట్ట .. నాయనా .. అక్కడ ఫ్రిజ్జులో ఉన్న కాలీఫ్లవర్లు, ఒకటి కాదు రెండు తీసుకురా మా చెవుల్లో పెడుదువు గాని.
మూడోది తారే జమీన్ పర్. దీన్ని గురించి మన బ్లాగ్వరులు ఇప్పటికి చాలానే రాసేశారు. ఇది మిగతావాటీకంటే చాలా బెటారు. ఆ బుడ్డాడు అద్భుతంగా నటించాడు. (మనలో మాట, సినిమాల్లో ఇది యింక బుడ్డాళ్ళ యుగం అని నాకు కచ్చితంగా నమ్మకం). అమీర్ ఖాన్ కూడా నటన పర్లేదు. మరీ క్యూట్ కాకుండా ఏదో తిప్పలు పడ్డాడు. వచ్చిన ఇబ్బందల్లా కథతోటే. ఇటువంటి సమస్యల్ని ఇదింతే, ఇట్లా పరిష్కరించెయ్యొచ్చు అన్నట్టుగా చూపించడం, తలిదండ్రుల్ని ఏదో పాషాణ హృదయులుగా చూపించడం .. కొంచెం ఇబ్బంది కలిగిస్తాయి. అసలింతకీ ఒక ఫండ"మెంటలు" కొస్చెను. ఆ బుడ్డాడు అంత అసాధారణ చిత్రకారుడూ కాబట్టి సినిమా సుఖాంతమయింది. ఒకేళ కాకపోయి ఉంటే? చిత్రకళే కాదు, డబ్బు సంపాయించడానికి పనికొచ్చే ఏ పనిమీదా వాడికి ఆసక్తి, తద్వారా ప్రావీణ్యత కలగక ఉండి ఉంటే? ఈ కథ అప్పుడెలా ఉండేను?
లాష్టండ్‌ఫైనలు బుజ్జిగాడు .. ప్రభాస్ .. త్రిష .. పూరీ .. నా బుర్ర చపాతీ! :)

Comments
(ఎంతైనా సినిమాను సినిమాలానే చూసే మహారాజపోషకులున్నంతవరకు ఈ బాపతు చినీమాలకు దిగుల్లేదనుకోండి.)
మనలో చాలామంది "సినిమా ని సినిమా లాగా" చూస్తారు కాబట్టే అప్పుడప్పుడు చెయ్యి DVD స్టాప్ బటన్ మీదికెళ్ళినా ఏదో ఆశతో చివరిదాకా చూస్తాం అనుకుంటున్నాను నేను..
కరివేపాకులా తీసివేస్తున్నారంటే మీకు వయస్సొచ్చేసిందనే లెఖ్ఖ:-)'అరవై'లో 'ఇరవై'లా ఎలా ఉండాలో సి.బి.రావు గారితో మీకు గీతోపదేశం చేయించాలి:-)
గీతోపదేశం - :)
"అక్బర్ గారు వీరోచితమైన మాటలూ, రాజోచితమైన మాటలూ మానేసి, ఇరవయ్యొకటో శతాబ్దపు నాగరిక మగవాడిలా ఆడవారి మనసుల్ని అర్ధం చేసుకోవడం, అంతరంగాలు కలుసుకోవడం లాంటి అర్ధం పర్ధం లేని మాటలు మాట్లాడుతుంటాడు. "
అక్బర్ లోని రొమాంటిక్ సైడ్ పరిచయం చేయడం ఈ సినిమా ముఖ్య ఉద్దేశ్యం... అనుకుంటా!? ఇది యాక్షన్ మూవీ కాదు..
(బాగా వెనకేసుకొచ్చానా? ;-) )
me too.
అంతే నంటారా?
భలే వాళ్ళే అది వయసుకు సంబంధించిన విషయం కాదు ఇస్మాయిల్. గీతోపదేశం అనగానే, త్రిషా, ఇలియానా ల మీదుగా ఓ పెద్ద లీప్ తీసుకొని గీత దగ్గరికెళ్ళిపోయారంటే, పాళీ గారి టేస్ట్ ప్రొఫైల్, మీరు అతడు సినిమాలో మహేష్ త్రిషా ని చూసినప్పుడు చెప్పిన మాటలు చూస్తే అర్ధమవుతుందన్న మాట.
ఇంతకి మించి నేనిక్కడ ఏమీ మాట్లాడను. ఇప్పటికే ఎక్కువ వాగానా? క్షంతవ్యుణ్ణి.
ఆ సినిమా వేరే వస్తుంది లెండి.
రచన, దర్శకత్వం - రాకేశ్వర రావు
nenu choosina vanaja ane oka telugu movie meeda mee comments vinaalani undi.
ఎప్పుడన్నా ఓపికుంటే, క్లైమాక్స్‌లో వాయస్ ఓవర్ వినండి.నా ఉద్దేశ్యం ఆ లాజిక్‌తో ఆ సినిమా మొదలెట్టాడని నా ఉద్దేశ్యం.
సినిమా చాలా సాచివేతగా ఉన్నది నిజం.కానీ ఏం చేస్తే పేస్ మెరుగ్గా ఉండేదో నేనూ తేల్చుకోలేకపోయాను.
నాకు బానే ఉంది. సినిమా చాలా అందంగా కూడా అనిపించింది.ఖాజా మేరే ఖాజా పాట - నాకు చాలా ఇష్టం.