వారాని కొక్కసారి ఒక పేజీడు వాక్యాల్ని పండించడం ఏం పెద్ద కష్టం?
కానీ ఒక్కోసారి అదే ఎవరెస్టు పర్వతారోహణం చేసినంత కష్టమై పోతూ ఉంటుంది.
అనాయాసంగా పేజీలకి పేజీలు రాసి పడేసే సమర్ధుల్ని చూసి అసూయ కుట్టేస్తుంటుంది.
ఖాళీగా ఉన్న కంప్యూటర్ తెరా, తెల్ల కాగితమూ ఒక్కలానే వెక్కిరిస్తాయి, కానీ మూడ్ మాత్రం ససేమిరా రానంటుంది.
బాబ్బాబు, ఈ మూడ్, కిలోల్లెక్కన ఏ బజారులోనన్నా దొరుకుతున్నదేమో, చెప్పి కాస్త పుణ్యం కట్టుకోండి.
డిశంబరు 14 నుండీ జనవరి 13 వరకూ ధనుర్మాసం అంటారు. దక్షిణాది హిందువులందరికీ, ముఖ్యంగా వైష్ణవులకి ఇది పవిత్రమైన మాసం. ఈ నెల రోజులూ ఉదయాన్నే తిరుప్పావై పారాయణ చెయ్యడం శుభం చేకూరుస్తుందని నమ్ముతాము. చిలమకూరు విజయమోహన్ గారు రోజుకో పాట చొప్పున, తమిళ మూలమూ, తెలుగు అనువాదమూ తన బ్లాగులో ప్రచురిస్తున్నారు, అభినందనలు.
డిశంబరు నెల తెలుగు బ్లాగులకి కూడా బాగానే పవిత్రమైనదిగా పరిణమించింది. చాలా సంతోషం. ముందుగా తెలుగుబ్లాగర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ-తెలుగు ఆధ్వర్యంలో హైదరాబాదు బ్లాగర్లందరూ కలుసుకోవడం, అటుపై కూడలి చాట్లో అంతర్జాతీయ సమావేశంలో పాతిక ముప్ఫై మంది బ్లాగర్లు సమావేశం కావడం మంచి స్ఫూర్తి నిచ్చాయి. ఈ రెండు సమావేశాల నించీ కొన్నైనా కార్యాచరణ ప్రణాళికలు పుట్టే ఉంటాయి. వాటిని క్రోడీకరించి అందరి దృష్టికీ వచ్చేట్టుగా ఉంచితే బాగుంటుంది. అరిపిరాల సత్యప్రసాద్ గారు ఆ దిశగా కొంత కృషి చేస్తున్నట్టు కనబడుతున్నది
హైదరాబాదు సమావేశం నించి ఉద్భవించిన ఒక అద్భుతమైన ప్రయత్నం మన వాళ్ళు పుస్తక ప్రదర్శనలో పాలు పంచుకోవడం. ఈ ప్రయత్నంలో చురుగ్గా పాల్గొన్న బ్లాగు మిత్రులందరినీ పేరు పేరునా అభినందిస్తున్నాను. సుమారు రెండేళ్ళ పైగా సాగుతున్న ఈ బ్లాగు ప్రయాణంలో, అర్రె నేనూ అక్కడ ఉంటే బాగుణ్ణే అనుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి కానీ, ఈ సందర్భంలో మాత్రం .. ఈ సందోహంలో పాలు పంచుకుంటూ నేను కూడా అక్కడ లేనే అనే బాధ ఎంత తీవ్రంగా ఊపేసిందో చెప్పలేను. నేను టూరులో ఉండి కూడా, ప్రతి రోజూ రాత్రి మజిలీకి చేరగానే ముందు శ్రీధర్ డెయిలీ రిపోర్టు చదవడం కోసం నెట్ వెతుక్కున్నాను అంటే అతిశయోక్తి కాదు.
ఈ సత్సమయంలో ఒక ప్రత్యేక వ్యక్తిని గురించి కొంచెం చెప్పుకోవాలి. దూర్వాసుల పద్మనాభం గారు. అప్పుడప్పుడూ ఈ-తెలుగు నివేదికల్లో వారి పేరు వినడం, వారు నిర్వహించే తెలుగు గ్రీటింగ్స్ సర్వీసుని అప్పుడప్పుడూ వాడుకోవడం మినహా, వారితో నాకు పరిచయం లేదు. తెలుగు బ్లాగర్ల దినోత్సవం సందర్భంగా తన బ్లాగులోనూ, తెలుగు బ్లాగు గుంపులోనూ, చెర్నాకోల ఝళింపు లా చురుక్కుమనే టపా ఒకటి రాశారు, తెలుగు బ్లాగరుల్లారా మేల్కోండి, మీ భాషకోసం మీరుకూడా ఏమన్నా చెయ్యండి అంటూ. తన మాటల్నే చేతలుగా నిలబెట్టి, పుస్తక ప్రదర్శన జరిగినన్నాళ్ళూ అవిరళంగా శ్రమించారు. ఎవరైనా వారి కృషిని కొనియాడితే ఒక చిర్నవ్వు నవ్వి మళ్ళీ పనిలో మునిగి పోయారు. పూని యేదైన ఒక్క మేల్ కూర్చి జనులకి చూపవోయ్ అన్న మహాకవి ప్రబోధానికి మానుష రూపం పద్మనాభం గారు. అయ్యా, పద్మనాభం గారూ! పెద్దవారు. ఇక్కణ్ణించే రెండు చేతులూ జోడించి నమస్కరిస్తున్నాను.
మొత్తానికి ఈ సందోహం అంతా, కొత్త వారిని కంప్యూటర్లో తెలుగు వాడకానికీ, తెలుగు బ్లాగుల వైపుకీ ఆకర్షించడంతో పాటు, కాస్త పాతబడి చప్పబడుతున్న బ్లాగరుల్లో కూడా కొత్త ఉత్సాహాన్ని ఇంజెక్ట్ చేసినట్టుంది. సంతోషం. ఈ ఉత్సాహపు పొంగు చల్లారనివ్వకండి. మంచి టపాలు రాస్తుండండి.
మూడ్ ఎక్కడన్నా కిలోల్లెక్కన దొరుకుతున్నదేమో తెలిస్తే మాత్రం నాకు చెప్పండేం?

Comments
ఇక పుస్తక ప్రదర్శనలో మన స్టాల్ ను విజయవంతంగా నిర్వహించిన వారికి శతకోటి దండాలు. అలానే విజయవాడలో కూడా విజయవంతం కావాలని కోరుకుంటున్నాను.
బైదవే.. కిల్లోల్లెక్క బద్ధకాన్ని అమ్మే ప్లాను వర్క్ అవుట్ అవుతుందా అని ఆలోచిస్తున్నా! ;-)
నాది కూడా ఓ చిన్న రిక్వస్ట్ 'మూడ్' కిలోల లెక్కన దొరికే అడ్రస్ మీకు ఎవరన్నా చెప్తే, మాకు కూడా చెప్పి పుణ్యం కట్టుకోరూ ప్లీజ్!!!
@యోగి .. మీవంటి అతి తెలివి వ్యాపారులుంటారనే సావీ, కిలోల్లెక్కన బేరమాడుకునేది :)
@పూర్ణిమ .. బద్ధకాన్ని అమ్మెయ్యడం .. ఇది కూడా ఏదో బాగానే ఉంది. కానీ నా సమస్య బధకం కూడ కాదు :(
@జ్యోతి .. చలికాలం మహిమ అని మాత్రం అనకండి. ఎందుకంటే, ఏప్రిల్ చివరి దాకా మాకిది తప్పదు. ఏదో, మీ వంటి వారు అభిమానంతో ఎదురు చూస్తుంటారనేదే నా రచనకి ప్రస్తుతానికి ఇంధనం!
ఒకటపాకి చెప్పారు మరి
ఒక కవితకు?
ఒక కామెంటుకు?
ఒక అనానిమస్ కామెంటుకు?
ఒక కవితకు, కామెంటుకు కలిపి ఎంత?
ఒక కామెంటుకు ఒక అనానిమస్ కామెంటుకు కలిపి ఎంత ?
వోల్ మొత్తం ఎంత, ఏవన్నా రిబేట్ ఇస్తారా?
డీల్ సెట్ అయితే తూగోజీ వోల్ మొత్తం మీ చేతుల్లో పెట్టేస్తాను.
సరదాగా
బాబా గారు - మీ ప్రశ్నల సమాధానానికి కూడా పైసలైతయ్.
అన్నట్టు తూగోజి వద్దు, మాంచి సీమ డీల్ ఉంటే చూడండి మాట్లాడదాం :)
puduccEri vAramtA mImIda katti kaTTE pramAdam ponci undi. tasmAt jAgrata...
(yAnAm vishayamgaa)
"మూడ్ ఎక్కడన్నా కిలోల్లెక్కన దొరుకుతున్నదేమో తెలిస్తే మాత్రం నాకు చెప్పండేం":) మరదే అందరి సమస్య. మూడ్ కుదిరినప్పుడు సమయం దొరకదు, సమయం ఉన్నప్పుడు మూడ్ రాదు!
>>మూడ్, కిలోల్లెక్కన ఏ బజారులోనన్నా దొరుకుతున్నదేమో
సరే అయితే, మా స్నేహితులు కొందరు వ్యాపారం ప్రారంభిద్దామని అనుకుంటున్నారు, కానీ ఏం చేయాలో తోచక ఆగిపోయారు.. ఇక్కడ చాలా మంది కొనే వాళ్ళు కనిపిస్త్తున్నారు కాబట్టి, వాళ్ళని ఈ వ్యాపారం చేయమని చెబుతా! :) (Just kidding)
ఓ మంచి పాట గురించి మీ అభిరుచులను మరియు అనుభవాలని తెలియ జేయండి.
ఈ విన్నపం చాలు మిమ్మల్ని మరో రెండు లేదా మూడు రోజులు ముప్పు తిప్పలు పెట్టడానికి (నేననుకోవడం)
ఁఏధ .. ఈ విషయం ఇద్దరు ముగ్గురు మిత్రులు చెప్పారు. సహజంగా సంబరపడ్డాను అనుకోండి. వెంటనే కించిత్ ఆశ్చర్యం కూడా వేసింది. అక్కడ ఉన్న టపా అప్పటికే వారం పదిరోజుల పాతది, పైగా బ్లాగు మొదలెట్టిన నాటినించీ టెంప్లేటయినా మార్చకుండా మొండిగా కూర్చున్నానే, ఇదెందుకు చూపించారా అని. ఈ పనులు చేసేవారికి ఒక సూచన .. ఇక మీదట తెరపట్టులు కానీ, ప్రత్యక్షంగా కానీ చూపే పక్షంలో అతి తాజాగానూ, ఆసక్తికరంగానూ ఉన్న బ్లాగుల్ని చూపమని మనవి. బయటికి కనబడేప్పుడు మరి మనల్ని మనం తాజాగా చూపించ్కోవాలి గదా!
@చక్రవర్తి .. నన్నెక్కడ నొక్కాలో బాగానే కనిపెట్టారు. తప్పక రాస్తాను :)