ఆ క్లాసు రూములో అడుగు పెట్టేసరికి అది క్రిక్కిరిసి ఉంది. రెండు సెక్షన్లు కలిపినట్లున్నారు. ఎవరో ఒకతను డయాస్ మీద నిలబడి ఇంగ్లీషులో లెక్చరు చెప్తున్నాడు. "మనకి వినడం అన్న పని సరిగ్గా రాదు. అసలు వినే అలవాటే తక్కువ. విన్నా కూడా విన్న మాటలు శ్రద్ధగా వినం. కొన్ని వింటాం. కొన్ని తెలీకుండానే వదిలేస్తాం. దాని వల్లనే మన మధ్య కమ్యూనికేషన్ సరిగ్గా ఉండదు. వినని మాటల్ని కొన్నిటిని ఊహిస్తాం. దానివల్లనే రిలేషన్స్ దెబ్బతింటూ ఉంటాయి. దానికి మీకు నేను కొన్ని ఉదాహరణలు చెప్తాను" అన్నాడు.
నన్ను పరిచయం చేసుకుని అతనితో అన్నాను. "వీళ్ళు తెలుగు మీడియం స్టూడెంట్స్. మీరు ఇంగ్లీషులో చెప్పేది వినగలరు కానీ అర్ధం చేసుకోలేరు. తెలుగులో చెప్పండి."
"ఐ కెనాట్ స్పీక్ టెల్గూ మేడం." అన్నాడు వెర్రి మొహం వేసి. "సరే మీరు చెప్పండి, నేను తెలుగులో ట్రాన్సులేట్ చేసి వీళ్ళకి చెప్తాను" అన్నాను.
"ఇప్పుడు నేను మీముందు ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నా నంటే దానికి నేను చేసిన పెర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సే కారణం. మా కంప్యూటర్ సంస్థ ప్రత్యేకంగా ఆ కోర్సులో క్లాసులిస్తుంది. బయటైతే ఆ కోర్సుకి ఆరువేల రూపాయలు కట్టాలి. మా సంస్థ ఐతే ఊరికే నేర్పుతుంది. ఆ క్లాసులు నేనే చెప్తాను. ఈ కంప్యూటర్ కోర్సు చేస్తే దీనివల్ల మీకు ఇన్ని వేల రూపాయల జీతంతో ఉద్యోగం వస్తుంది. ఇప్పుడు మీరు గవర్నమెంట్లో చేరితే లంచం లేకుండా ఉత్త జీతం ఎంత సంపాదించ గలరు? మహా ఐతే పది వేలు. కానీ ఇందులో ఐతే అలాక్కాదు. మొదలే ఇరవై వేలు. అప్పుడు మీ జీవితమే మారి పోతుంది. ఇప్పుడు మీకు పోజు వేసిన అమ్మాయి వాళ్ళ పిల్లాణ్ణి మ్యునిసిపల్ బడికి తీసుకెళ్తుంటే మీరు మీ పిల్లాణ్ణి మంచి కాన్వెంట్ లో చదివిస్తారు. మీకు హేండిచ్చిన ఫ్రెండు ముందు అప్పుడు మీరు కార్లోంచి దిగుతారు."
ఈ మాటల్ని అనువాదం చేసి చెప్పడానికి నాకు ఎంతో చిన్నతనంగా అనిపించింది. పోజిచ్చిన అమ్మాయికి తిరిగి పోజివ్వడం, హేండిచ్చిన స్నేహితుడికి తిరిగి హేండివ్వడమేనా వ్యక్తిత్వమంటే?
***
బీయే రెండో సంవత్సరం క్లాసు. ఆ మాస్టారు ఛాందసుడు కాదు. ఆయనకి ప్రాచీనంలోని నవీనత, నవీనంలోని ప్రాచీనత తెలుసు. అందుకే అప్పుడప్పుడూ ఆ క్లాసులో కూచునే అలవాటు.
"యాదృఛ్ఛికమో కాదో గానీ గమ్మత్తుగా రెండు చిత్రమైన పాఠాలు పక్క పక్కనే పెట్టారు యూనివర్సిటీ సెలెక్షన్ కమిటీ వారు." అంటూ డిగ్రీ టెక్స్టు బుక్కు తీశారు. క్లాసులో ఒక్కడంటే ఒక్కడి దగ్గర టెక్స్టు బుక్కు లేదు. ఆ అలవాటే లేదన్న మాట.
"దుర్యోధనుడి ప్రాయోపవేశం మొదటిది. కిరాతార్జునీయం రెండోది. అని చెప్పి ఒక్క నిమిషం ఆగి, చెప్పడం మొదలు పెట్టారు.
అరణ్యంలో ఉన్న పాండవులను అవమానించాలని వెళ్ళి తనే అవమానాల పాలవుతాడూ భారతంలో దుర్యోధనుడు. ధర్మరాజు దయా ధర్మ భిక్ష మీద తిరిగి బ్రతికి బయట పడతాడు. ఆ అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకో బోతాడు. ఎవరి మాటా వినడు. ఆఖరికి రాక్షసులు వచ్చి పాతాళానికి తీసుకెళ్ళి మరిన్ని కుతంత్రాలు చెప్పినప్పుడే ఆ ప్రయత్నం విరమిస్తాడు. అంతకంటే పెద్ద అవమానం కౌరవ సభలో పాండవులందరికీ కలిగింది. రెండో పాఠం కిరాతార్జునీయంలో అర్జునుడు ఆ అవమానం నించి బయట పడటానికి కొత్త శక్తి సంపాదించుకోవాలనీ మనోబలంతో అవమాన భారం పోగొట్టుకోవాలనీ ఇంద్రకీల పర్వతం మీదికి తపస్సుకి వెళ్ళాడు."
"ఇవీ ఈ రెండు కథలూ. రెండు అవమానాలే. ఒక దాన్ని మించి ఒకటి. కానీ వ్యక్తుల ప్రవర్తన ఎలా ఉందీ? ఎలా ఉండాలీ?" అని మాస్టారు ఆగారు.
ఒక కుర్రాడు ఠక్కున చెప్పాడు. "ఒకడు పాతాళంలోకి కూరుకు పోయాడు, ఒకడూ కొండ మీదికి ఎక్కి పోయాడు."
సంతోషంతో చప్పట్లు కొట్టారు ఆయన.
"ఎవరిలా ఉండాలి మనం?" అడిగారు ఆయనే.
"రెండొదే సార్ .." క్లాసంతా అరిచింది.
"అవమానాలు జీవితంలో ఎవరికీ తప్పవు. కానీ ఇంద్రకీల పర్వతాలే మనల్ని పిలవాలి." అంటూ మాస్టారు పాథంలోకి వెళ్ళిపోయారు.
ఇది సెకండ్ లాంగ్వేజి క్లాసా? వ్యక్తిత్వ వికాసం క్లాసు కాదా? అనుకున్నాను.
అథః పాతాళంలోకి జారే చూపుల్ని ఆకాశంలోకి తిప్పడం ఇలాకాక మరొకలా ఎలా సాధ్యం? ! !!
ఈ సంగతి సదరు "ఐ కెనాట్ " సారుకి ఏ విధంగా మనవి చేయగలను??
***
పుస్తకం: ఆకులో ఆకునై
రచయిత్రి: వాడ్రేవు వీరలక్ష్మీదేవి
పేజీలు: 96
వెల: రూ. 40/-
ప్రతులు దొరికే చోటు: విశాలాంధ్ర (వాళ్ళ దగ్గర కనీసం 50 ప్రతులు ఉన్నాయని రచయిత్రిగారే సుమారు నెల్రోజుల క్రితం నాకు చెప్పారు. ప్రతులు లేవని షాపువాళ్ళు అంటే నమ్మొద్దు.)
నా చివరి మాట .. జీవితాన్నీ, జీవితంలోని మాధుర్యాన్నీ ఆస్వాదించే ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకమిది.

Comments
మంచి పుస్తకాన్ని పరిచయం చేశారు.. నెనర్లు...
నిజమే! aspirational వ్యక్తిత్వవికాసంకన్నా,inspirational వ్యక్తిత్వవికాసమే మనకు కావల్సింది.ఈ మధ్యకాలంలో professional career కు పనికొచ్చే కిటుకుల్ని వ్యక్తిత్వవికాసం పేరుమీద కొన్ని సంస్థలు "అమ్మేసుకుంటున్నాయి" వారినీ,వారి మారినపడే యువతనూ ఇలాంటి పుస్తకాలే కాపాడాలి.కానీ ఈ పుస్తకాలున్నాయని తెలిసేదెట్టబ్బా!?!
దీన్ని ఎలా అయినా సంపాదించాల్సిందే!
మంచి పుస్తకం గురించి పరిచయం చేసినందుకు నెనర్లు!
ఈ విషయం నేను ఎక్కువగా ఆలోచిస్తుంటాను. ఏదన్నా ఫంక్షన్ విషయంలో .. "మనల్ని ఎవరన్నా పిలవకపోతే మనమూ పిలవద్దు,
వాళ్ళకి అక్కర్లేకపోతే మనకీ వద్దు, వాళ్ళేలా ఉన్నారో మనమూ అలాగే ఉందాము" అంటూ ఉంటారు చాలామంది. నేను అనేది "మనమేలా ఉండాలనుకొంటున్నామో అలా ఉందాము. వాళ్ళకి మనము నచ్చలేదు, అందుకని పిలవలేదు. మనకి వాళ్ళు నచ్చారు, మనము పిలుద్దాము. వాళ్ళు చేసిందే మనము చేస్తే , వాళ్ళకి మనకీ తేడ ఏంటి??" అని అడిగే మనఃతత్వం నాది. వితండ వాదన అంటారు వినేవాళ్ళు. ఇది చదువుటుంటే నా వాదన గుర్తోస్తోంది.
పుస్తకం నేను తప్పక కొంటాను.
మహేష్ .. చాలా నిజం .. ఇలాంటి పుస్తకాలున్నాయని యువతకి తెలియడం చాలా ముఖ్యం. రచయిత్రి గారితో మాట్లాడినప్పుడు ఆమెకి అదే చెప్పాను. మరికొన్ని వ్యాసాలు చేర్చి ఈ పుస్తకాన్ని త్వరలో పునర్ముద్రించే ఆలోచన ఉన్నదని అన్నారామె.
ఏదన్నా పుస్తకం గురించో, సినిమా గురించో పరిచయమో సమీక్షో రాసినప్పుడు, సాధారణంగా నాలో కలిగిన భావాల గురించి రాస్తూంటాను. కానీ ఈ పుస్తకం పరిచయం చెయ్యడానికి .. అందులోని ఒక తునక రుచి చూపిస్తే చాలు, నా వ్యాఖ్యానం ఏమీ అక్కర్లేదు అనిపించింది. ఇప్పూడు మీ అందరి వ్యాఖ్యలు చూస్తుంటే నా ఊహ నిజమే ననిపిస్తోంది.
ఒకవిధంగా, కొత్తపాళీ గారి సూచనే కొంతమేరకు పని చేస్తుంది, గుడ్డిలోమెల్ల.
వెళ్ళి పుస్తకాల దుమ్ము మనమే దులపాలి. కాని మనలో ఎంతమంది, బయటకు లాగిన పుస్తకం అట్ట నలగకుండా ఆ పుస్తకాల దొంతరలొకి వెనక్కి నెడతాము. మనలో ఎంతమంది, పుస్తకం వెన్ను విరవకుండా, నాలుక తడపకుండా, కాగితం నలగకుండా పేజి తిప్పుగలం?
పుస్తకం మీద ప్రేమ ఉందనగానే సరిపోదు.
కొత్తపాళి గారు మీ ఊహ సరైనదే.
ఆన్ లైన్ లో కొంటున్నాము.మీరు కుడా కొనుక్కోవచ్చు.ఒకసారి యీ link చూడండి
http://www.avkf.org/BookLink/book_link_index.php
వాడ్రేవు వీరలక్ష్మీదేవిగారు రాసిన ఆకులోఆకునై పుస్తకం "వ్యక్తివవికాసం" పుస్తకం కాదు. కానీ అందులో యువజనులు మనసుకి పట్టించుకోవలసిన ముఖ్యమైన విషయాలు చాలా ఉన్నై. అంతేకాక ఎంతో చక్కగా హాయిగా చెప్పారు రచయిత్రి. తప్పక పుస్తకం కొని చదవండి.