కథ రాయండి - 3

ఈ కింది ఇతివృత్తంతో కథ రాయండి.

"ఈ మొగుళ్ళతో వేగలేకపోతున్నాం తల్లీ" అని భార్యలందరూ అమ్మవారికి మొరబెట్టుకున్నారు.

ఆమె అయ్యవారికి ఆర్డరు వేసింది.

అయ్యవారు విరించిని రావించి తక్షణం ఈ కస్టమర్ కంప్లైంట్ ని పరిష్కరించమని ఆజ్నాపించారు (ఈపాటికి స్వర్గం కూడా ISO QOS PMP DUMP ఇలాంటి సర్టిఫికేట్లన్నీ తెచ్చేసుకుంది.) అందులోనూ లేడీ కస్టమర్లకి తిక్క రేగితే మనకి పుట్టగతులుండవనీ, పరిస్థితులు విషమిస్తే తామే మళ్ళీ ఆన్సైట్ వెళ్ళాల్సి వస్తుందనీ, అటువంటి పరిస్థితి రాకుండా తగిన నివారింపు చర్యలు తీసుకోమనీ ఆదేశించారు.

విరించి బాఘా ఆలోచించి ఒక ప్రణాళిక తయారు చేశాడు.

అప్పటినించీ పుట్టిన మగ పిల్లలలో ఒక విచిత్రమైన సిస్టం ఇన్స్టాల్ చేశారు. దాని ఫలితంగా, అబ్బాయికి యుక్త వయసు వచ్చాక, ఎవరన్నా అమ్మాయిని చూసి పెళ్ళాడదాము అనే దృష్టి కలిగితే చాలు, ఆ ఆమ్మాయికి అబ్బాయి నుదుటిమీద మెరిసే LED display లో ఆ అబ్బాయి గుణగణాలు కనబడి పోతాయి. ఒకేళ ఎప్పుడైనా అమ్మాయి అబ్బాయిని ఆ దృష్టితో చూసినా కూడా అబ్బాయి గుణగణాలే అమ్మాయికి కనబడి పోతాయి.

ఈ customer complaint management program implement అయ్యాక, అమ్మాయిలకి అబ్బాయిల నుదుళ్ళ మీద ఎలాంటి మెసేజిలు కనిపించాయి? వాటి పర్యవసానమేవిటి? పెళ్ళిళ్ళు జరిగాయా అసలు? ఒకేళ జరిగితే, లేడీ కస్టమర్లు తృప్తి చెందారా? లేక విరించి ని fire చేసి అయ్యవారు తనే భూమి మీద onsite కి రావాల్సొచ్చిందా?

కళ్ళు మూసుకుని మీ ఊహా శక్తిని తట్టి లేపి ముందు మీ మనోఫలకం మీద తిలకించి, అటుపై కీబోర్డు మీద పలికించి, మా విహరిణి తెరపై కనిపింప చేయ ప్రార్ధన.

కథని జెనెరల్గా అందరు జనాభాకీ వర్తించేట్టు రాయొచ్చు. లేదా కొన్ని ఎంచుకున్న జంటల ఆధారంగా రాయొచ్చు. లేదా ఒక అబ్బాయో, అమ్మాయో ముఖ్య పాత్రగా అయినా రాయొచ్చు. ఇవన్నీ కాకుండా మీకింకో పద్ధతి తడితే అలాక్కూడా రాయొచ్చు - మీ ఇష్టం.

రచన సీరియస్ గా ఉండొచ్చు, హాస్యంగా ఉండొచ్చు, వ్యంగ్యంగా ఉండొచ్చు - మీ ఇష్టం.

గడువు: ఆగస్టు 29.
బహుమతి: నాకు నచ్చిన కథకి ఒక మంచి తెలుగు కథల పుస్తకం బహుమతి ఇస్తాను.
మీ బ్లాగులో పెట్టినా సరే, నాకు మెయిలు
చేసినా సరే. మీ బ్లాగులో పెడితే, ఆ సంగతి నాకో మెయిలు
కొట్టి చెప్పండి.

Comments

కొత్తపాళీ గారు...
హ హ :-) ఐడియా ఐతే బానే ఉంది కానీ కాస్త స్త్రీ పక్షపాతం కనపడుతుందండీ.... మరి పెళ్ళాలతో వేగలేని మొగుళ్ళ మాటేం చేసారు....!! ఆ LCD ఏదొ ఇద్దరికీ తగిలించేస్తే బావుంటుంది కదా.... లేదంటే ముందు ముందు "ఈ పెళ్ళాలతో వేగలేక పోతున్నాం తండ్రీ..." అని అయ్యవారికి అర్జీలు రావడం మొదలవుతుందేమో...
Purnima said…
కథ వద్దు.. ఇలాంటిదేదో నిజంగా కావాలి నాకు :-)
Unknown said…
ఓ... కామెడీ మీద పడిందన్నమాట మీ దృష్టి ఈ సారి.
రంజుగా ఉంది టాపిక్కు.
మాలతి said…
కొత్తపాళీగారూ,
కథంతా మీరే చెప్పేశారనిపిస్తోంది నాకు. ఆపైన రాస్తే నవల అవుతుంది, హీహీహీ
ఇంకేమి రాస్తాం?చూడబోతే ఇది కేవలం సాంకేతిక నిపుణులకు మాత్రం అన్నట్లుంది :)
@ వేణూ - నేను చెప్పాల్సింది చెప్పాను. ఆ పైన కథలో ఏం జరిపిస్తారో అది మీ ఇష్టం.
@పూర్ణిమ - ఇల్లాంటివి కోరుకునేముందు బాగా ఆలోచించి మరీ కోరుకోండి. పైన తథాస్తు దేవతలుంటారు. :)
@ప్రవీణ్ - comedy is in the eye of the beholder :)
@ మాలతి గారు - అయ్యో మీకలా అనిపించిందా? జనాలు నవల్లు రాసినా నాకేం అభ్యంతరం లేదు.
@ రాజేంద్ర - అదేం లేదు. ఊరికే థీం ని ఇంట్రొడ్యూస్ చెయ్యడానికి కొంచెం వెరైటీగా సాఫ్టువేరు ప్రాజెక్టు మేనేజిమెంటు జార్గాన్ వాడాను. కాకపోతే కొత్తగా పుట్టే మొగ పిల్లల నుదుటి మీద ఆ సమాచారం కనిపించడం మాత్రం కీలకం.
మళ్ళీ మన రచయితలకి, రచయిత్రులకి కలం ఝుళిపించే రోజు వచ్చింది అన్న మాట. టాపిక్ మాత్రం భలేగుంది. చూద్దాం ఎవరి సృజనాత్మకత ఎలా ఉంటుందో.

ముందు ఇలాంటి ఐడియాలకి వేసుకోండి మీకొక వీరతాడు.
Kranthi M said…
bavundandi mee prothsaham kottaga em rayalo telleni vallaki meere topic kuda iccharu.
రవి said…
బావుంది టాపిక్. నాకు రానారె గారు ఈ టాపిక్ కు రాయలసీమ మాండలికం లో ఎలా రాస్తారో చూడాలని ఉంది.
Bolloju Baba said…
రాజేంద్ర గారు
అంతే అంతే
బొల్లోజు బాబా
Purnima said…
హహ.. నిజంగా అయ్యిపోతుందనే!! డోరియన్ గ్రే.. గుర్తు వస్తున్నాడు!! :-) ఆస్కర్ వైల్డ్ ని వెత్తుక్కోవాలి మరి!!
LCD ఆలోచన బావుంది. కాని గుణగుణాలు కనపడేదెలా ? అని ! దృశ్యకంగానా ? శ్రవ్యకంగానా ? JPEG/GIF/TiFF/PNG బొమ్మగానా ? లేక కేవలం పాఠ్యంగానా ?

ప్రతి మనిషిలోనూ గుణాలు కొన్ని వందలుంటాయి కదా ! అవన్నీ చూసే ఓపిక ఏ అమ్మాయికైనా ఉంటుందా ? నేననుకోవడం - ఆ LCD Display లో అబ్బాయిల జీతం, బ్యాంకు ఖాతా, బ్యాలన్సు గట్రా కనిపిస్తే అమ్మాయిలకు ఎక్కువ ప్రయోజనకరమేమో నని !
లలితాబాలసుబ్రహ్మణ్యం గారూ, మీ ఊహలు ఆల్రెడీ మేఘాల్లో ఎగురుతున్నై, ఇహ ఇలాంటి చిన్న చిన్న డీటెయిల్సుదేముంది? :)
ఏ రూపంలో కనబడినా పరవాలేదు, సమాచారం అమ్మాయికి తెలియడం ముఖ్యం. ఏం కనబడిందీ ఎలా కనబడిందీ రచయితల ఊహకే వదిలేస్తున్నాను.
పూర్ణిమ, ఆస్కార్ వైల్డు కాదు, మీ వైల్డ్ ఇమాజినేషన్ కావాలి :)
భాను said…
కొత్తపాళీ గారూ,
ఈ ఇతివృత్తానికి కథ తయారయ్యిందా?
భాను
Anonymous said…
కొత్తపాళీ గారు,

క్షమించాలి కాస్త ఆలస్యం అయింది. నా సమర్పణ ఇక్కడ.

http://blog.vikatakavi.net/2008/09/07/%E0%B0%B6%E0%B0%BE%E0%B0%AA%E0%B0%AE%E0%B1%88%E0%B0%A8-%E0%B0%B5%E0%B0%B0%E0%B0%82-%E0%B0%93-%E0%B0%95%E0%B0%BE%E0%B0%95%E0%B0%B0%E0%B0%95%E0%B0%BE%E0%B0%AF/