జర్నలిస్టుల అరెస్టుని ఖండించండి

నువ్వనే దానితో నేనేకీభవించక పోవచ్చు కానీ నువ్వు మాట్లాడే హక్కుని మాత్రం నా తుదిశ్వాస అయినా పణంగా పెట్టి కాపాడుతా అన్నాడుట ప్రసిద్ధ ఫ్రెంచి రచయిత వోల్టేర్.

పత్రికలు మాట్లాడ లేక పోయినప్పుడు ప్రజాస్వామ్యానికి (అదెంత నామమాత్రపుదైనా) కాలం చెల్లినట్లే.

ఆంధ్రజ్యోతి చేసింది సరియా కాదా, వాళ్ళ పంథాతో మనం ఏకీభవిస్తామా లేదా అన్నది పక్కన పెట్టండి.

సభ్య సమాజంలో ఇటువంటి దుశ్చర్యలు, దౌర్జన్య చర్యలు జరగడానికి వీల్లేదు. బాధ్యత గల పౌరులుగా మనవంతు పని చేద్దాం.

నా మాటలు సరైనవి అనిపిస్తే - ఇదిగో పిటిషన్ .. మీరూ సంతకం చెయ్యండి.

Comments

ramya said…
Thankyou,nEnu santakaM cesaanu.
మీ బ్లాగ్ లో పెట్టి మంచి పని చేసారు కొత్త పాళీ గారు. దీన్ని ఖండించక పోతే ఇప్పుడిప్పుడే తెరవడానికి ప్రయత్నిస్తున్న పత్రికల నోళ్ళు శాశ్వతంగా మూత పడిపోతాయ్.
Naga said…
ఖండించితిని, పిటిషనించితిని!
శ్రీ said…
నేను సైతం..
Ramani Rao said…
నేను సైతం...