ప్రోత్సాహం

ఏదో DRDO ప్రయోగశాలలో పనిచేసే ఒక యువ పరిశోధకురాలు ఏదో కొంచెం పనికొచ్చే డిస్కవరీ ఏదన్నా చేశారనుకోండి. అకస్మాత్తుగా అబ్దుల్ కలాం గారి దగ్గిర్నించి ఫోనొస్తే ఎలా ఉంటుంది?

ఏదో సినిమాలో ఏదో చిన్న పాత్రలో .. తనకున్న పరిధి బహు కొద్దే అయినా .. తన ప్రతిభ కనబరుస్తూ ఒక నటి అద్భుతంగా నటించింది అనుకోంది. అథాట్టున చిరంజీవి గారి దగ్గర్నించి ఆమెకి ఫోనొస్తే ఎలా ఉంటుంది?

కానీ మీకూ తెలుసు, నాకూ తెలుసు, నిజ జీవితంలో ఇవి జరిగేవి కావని.

ఒక ఫీల్డులో ఆయన ఒక దిగ్గజం .. అదే ఫీల్డులో ఆమె ఇంకా తప్పటడుగులు వేస్తున్న చిన్నారి. ఐనా ఆమెలో ప్రతిభ గుర్తించి, ఆమెని వెదికి పట్టుకుని, ఫోన్ చేసి మాట్లాడి, అది చాలక, తానే పని గట్టుకుని వారింటికి వెళ్ళి ఆమెని ప్రోత్సహించిన వైనం .. నాకైతే చదువుతుంటే గొంతు చిక్కబట్టింది.

కారా మాష్టారూ, మీ పెద్ద మనసుకి వినమ్రంగా టోపీలు తీసేశాం!

మనం అబ్దుల్ కలాములూ, చిరంజీవులూ, కారా మేష్టార్లూ కానక్కర్లేదు మన తోటి వారిలో ప్రతిభని గుర్తించి ప్రోత్సహించడానికి!!

Comments

శ్రీ said…
బాగుందండీ! కారా గారు అంత ప్రేమగా అమెను అభినందించడం నిజంగా బరువుగా ఉంది!
కాళీ పట్నం రామారావు గారితో ఇటువంటి అపూర్వమయిన అనుభవం నాకూ కలిగింది.ఉత్తమ వ్యక్తి.మంచి మనసున్న మనిషి.ఎంత ఎదిగితే అంత వొదగటానికి ఉత్తమ ఉదాహరణ రామారావుగారు.నాగ లక్ష్మి గారు హైదరాబాదులోనే వుంటారని ఇప్పుడే తెలిసింది.ఇటీవలె ఆంధ్ర భూమి దిన పత్రికలో బహుమతి వచ్చిన వారి కథ చిన్నబోదా చిన్ని ప్రాణం చదివాను.అద్భుతమయిన కథ అది.ఆ కథను జాగృతి పత్రికలో నా శీర్శికలో ప్రస్తావించి ప్రశంసించాను కూడా!
cbrao said…
ఆసరా కథ పరిచయం చేస్తానని సుజాత గారికి చెప్పా. అది నాకు అందుబాటులో లేదు. ఆ కథ పరిచయం చేస్తూ, ఒక టపా రాయగలరా? మీ ఈ ప్రస్తుత టపా బాగుందని ప్రత్యేకంగా రాయనక్కరలేదనుకుంటా. మీ టపాలు అందరికీ ఇష్టం.
Anonymous said…
chaalaa baagundi :)
Anonymous said…
ఎంతటి ధన్యజీవి ఆమె. అంతటి మహోన్నత వ్యక్తిని కదిలించిన ఆ కథ ఏమిటి? కథని ప్రాణంలా భావించి కారా మాస్టారు ఆమెని ప్రోత్సహించిన వైనం చదివి కళ్ళు చెమ్మగిల్లాయి.
వారణాసి నాగలక్ష్మి గారు రాసిన కథ "ఆసరా" 2005 లో సిలికానాంధ్ర మరియు రచన మాస పత్రిక సంయుక్తంగా నిర్వహించిన కథలో పోటీలో మూడవ బహుమతి గెల్చుకున్నది. సిలికానాంధ్ర వారి జాల పత్రిక సుజన రంజనిలో ఈ కథ చదవచ్చు.
హైదరాబాదు కథాసాహితి వారి కథ 2005 ఉత్తమ కథల సంకలనంలో కూడా ఈ కథ చోటు చేసుకుంది.
కారా మాస్టారు గారికి మరొక రకం "ప్రోత్సాహకం" ఇచ్చే అలవాటు కూడా ఉంది. ఆయన "కధానిలయం"లో చేరుస్తున్న కధల పుస్తకాలు కొన్ని, వారి ద్వారా వీరి ద్వారా వచ్చిన వాటిలో ఒకే పుస్తకం ఎక్కువ ప్రతులు కూడ చేరుతుంటవి. (డూప్లికేట్ కాపిస్ అన్నమాట) అలా వచ్చిన కధలని ఆయన "కధ" అభిమానులకు అందజేస్తుంటారు.

"యజ్ఞం" కధని చిత్రీకరించడానికి, ఆ నిర్మాత/దర్శకులు వారిని చెన్నైకి అహ్వానించారు. మాస్టారు కొన్నాళ్ళు ఆ ఊళ్ళో ఉన్నారు. వారికి తీరిక సమయం, సాధారణంగా సాయంత్రాలలో ఉన్నన్ని నాళ్ళు కలుసుకునే వారం. ఆ సందర్భంలో, నాలుగు కధల సంపుటాలని పరిచయంచేస్తూ ఇచ్చారు. అందులో ఒకటి - అల్లాం రాజయ్య కధల సంపుటి.

కారా మాస్టారు, అబ్దుల్ కలాం, ఇందిరా గాంధి, ముఖ్య మంత్రి రాజశేఖరరెడ్డి, కొత్తపాళీ లేకాదు. అభినందించాల్సిన సమయం, సందర్భం వచ్చినప్పుడు ఆ యా వ్యక్తులను, కృషిని ఎవరైనా సరే అభినందించవచ్చు, ప్రోత్సాహించవచ్చు! అభినందించాలి, ప్రోత్సాహించాలి కూడా!

పెద్ద మనసులకి, మరుగుజ్జు మనస్తత్వాలకి అదే తేడా.
నాగలక్ష్మి గారి కధలంటే నాకు చాలా ఇష్టం.. ఆవిడ పాత్రలన్నీ మన చుట్టూ ఉన్న, మనకు తెలిసిన వ్యక్తుల్లానే దగ్గరగా ఉంటాయి..

2007 రచన-కౌముది వారి ఉగాది కధల పోటీలో ప్రధమ బహుమతి పొందిన నాగలక్ష్మి గారి కధ ఒకటి..

http://www.koumudi.net/Monthly/2007/april/april_2007_kathakoumudi_1.pdf
Anonymous said…
నిజమే, శ్రీకాకుళవాసిగా కారాగారిని నేను బాగా ఎరుగుదును. నాకు ఒకసారి అభిమానంగా వారణాసి నాగలక్ష్మి గారి కథల పుస్తకం ఆలంబన సగం ధరకే అందించారు. ఆ పుస్తకం చదివి నేనెంతో సంతోషించాను. ఆ పుస్తకంపై నేను రాసిన పరిచయ వ్యాసాన్ని కూడా కారా మెచ్చుకున్నారు. నాగలక్ష్మీగారు మంచి కథల రచయిత్రే కాదు, చిత్రకారిణి కూడా. చదువుల్లో గోల్డ్ మెడలిస్ట్ కూడా. మీ వ్యాసం అన్నీ నెమరు వేయించింది. నెనర్లు.
vasantam said…
http://parnashaala.blogspot.com/2008/05/3.html

లో మీరు వ్రాసిన కామెంట్ కి సమాధానం గా ఇదివ్రాస్తున్నాను.
"యాసతో రాయడం (సరిగ్గా చెప్పాలంటే మాండలికంలో రాయడం) సులువైన పని కాదు ఆయా ప్రాంతల వారికి కూడా. ఈసడించుకోవలసినది అసలే కాదు. చిక్కటి చిత్తూరి మాండలికానికి నామిని కతలు, ఈ మధ్య బాగా రాస్తున్న సుంకోజు దేవేంద్ర కథలు చదవండి. గుమ్మపాల మాదిరి కడప భాషని పిండుతున్న మన రానారె బ్లాగు చదవండి."

కొత్త పాళీ గారు మీతో నేను ఏకీభవిస్తున్నాను.మీరు సూచించిన రచనలు,బ్లాగ్ చదివేదానికి ప్రయత్నిస్తాను, నేను ఎవరి యాసని యీసడించుకోను, సరదాగా వ్రాసానంతే. కాళీపట్నం రామారావు గారి రచనలు చదివితే తెలుస్తుంది కదా మాండలికములో వ్రాయటం ఎంత కష్టమో.మీకా వుద్దేశం(లేక మహేష్ గారికి కలిగించినట్టయితే) క్షంతవ్యున్ని.
నెనర్లు
rākeśvara said…
నాకు కళ్ళళ్ళో నీళ్ళు తిరిగై.


అన్నట్టు ఇలాంటి విషయమే ఐ, లంకెకి పీడిఎఫ్ ఎందుకు ఇచ్చారు. పీడీఎఫ్ అనేది, తెలుగు కథానిలయం ఆశయాలకు వ్యతిరేకం అని గమనించగలరు. ఏది చేసినా కనీసం యూనీకోడులో వుండాలి.
@ bojja.vasu - I welcome your comments.

@రాకేశ్వర - ఆ పత్రిక తయారు చేసిన వారికి ఉన్న వెసులుబాటు అది. అంచేత మన చేతికి అందింది అదే.