నా కథ

న్యూజెర్సీ తెలుగు లలితకళాసమితి వారి తెలుగు పత్రిక తెలుగుజ్యోతి రజతోత్సవ ప్రత్యేక సంచికలో.

Comments

Anonymous said…
కథ చదివాను సార్, బాగుంది.
కొత్తపాళీ గారూ, చాలా బావుందండీ! asusual, I LOVED your narration! తెలుగు జ్యోతిలో మొన్ననే చదివాను కానీ మీది అని తెలీదు.. ఉమ లాంటి విలక్షణమైన వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు ఎంత తొందరగా దగ్గర కాగలరో అంతే త్వరగా దూరమూ కాగలరు.. ఆ పాత్ర చాలా నచ్చింది!
రాధిక said…
చాలా బాగుందండి.కధలో కూడా మీ సాహిత్యాభిమానం కనిపిస్తుంది.
Anonymous said…
చాలా బాగుందండీ
ఏకబిగిన చదివించారు
కథకు పెట్టిన పెరే మీ సాహిత్యాభిమానాన్ని చెప్తోంది

ఉమ ని ఉమ గా చూసే వారు చాలా తక్కువ మంది
ఉమ లాంటి అమ్మాయి ని జీవిత భాగస్వామి గా చేసుకోవాలి అంటే మంచి మనసు కు మించి సంస్కారం ఉండాలి

ఆ పాత్ర నాకు చాలా బాగా నచ్చింది
ramya said…
కథ చాలా బాగుంది, దీన్ని సినిమా గా తీస్తే :)
కొత్తపాళీ గారు,
కథ బావుందండి! శేఖర్ కమ్ములగారు కానీ తన నిజజీవిత కథని మీ చెవులో రహస్యంగా ఊదారా అన్న చిన్న అనుమానం మాత్రం ఉంది:-)
ముగ్గురు మిత్రులూ వరసగా ఔటయిపోడం కాస్త dramaticగా ఉన్నా మీ కథనం దాన్ని కవర్ చేసేసింది.
బాగుంది. అభినందనలు. చెరువులోపల బండపై చంద్ర-ఉమల సంభాషణ దాసరి గారి సినిమాలోని డైలాగుల్లా సాగదీయకుండా మరియు చివరలో నేను అన్న స్త్రీ గొంతు వినపడటం అప్పుడు చంద్ర మొహం వెలిగిపోవటంతో కధ ముగించటం ... అనే రెండు విషయాలలో మీలో ఉన్న ఓ గొప్ప కధకుడు కనిపించాడు. అధ్బుత రచనా పటిమ. మరొక్కసారి అభినందనలు. ఆఫ్ట్రాల్ బి.ఎ అనే ఆలోచనను మరియు పనిపిల్ల కొడుకు అనగానే సారీ అని వారితో చెప్పించటం వాస్తవ చిత్రీకరణ మరియు మీ నిశిత పరిశీలనకు అక్షరరూపం.

ఇప్పుడు నేను చెప్పబోయేది మీ కధకే కాదులేండి చాలా కధలకు నా అభిప్రాయం, ఆలోచనలు ఇలాగే ఉంటాయి ... ఇలా ఊహించకుండా మరియు/లేక తదుపరి ఏమిటి అన్న ఆలోచనలు దరిచేరనీయకుండా కధను కధ లాగా చదవలేకపోవటం, సీరియల్స్ ను సీరియల్స్ లాగా చూడలేకపోవటం ఓ పెద్ద బలహీనతై కూర్చుంది ... అందుకే నేను రాజేంద్రుని, విజయావారి సినిమాలు, అన్నగారి పౌరాణికాలు, అంగ్ల డిష్యుం డిష్యుం, మంచి టెక్నిక్/టెక్నికల్ సినిమాలు, స్పోర్ట్స్ కార్యక్రమాలు ఎక్కువ చూడటం అలవాటు చేసుకున్నాను.

ఇకపోతే కధలో హీరో హీరోయిన్స్ ఎవరో ముందే ఎష్టాబ్లిష్ అయిపోయింది కనుక మిగతా ముగ్గురిని ఎలాగూ (వదిలిస్తారని ఊహించవచ్చు కనుక) వదిలించాలి కనుక వరుసుగా వదిలించటం అనే దగ్గర స్క్రీన్ ప్లే ఇంకా సమర్ధవంతంగా ఉండవలసిందేమో అనిపించింది..కాకపోతే వదిలించటానికి తీసుకున్న నేపధ్యం దానిని నడిపిన విధానం మాత్రం చాలా గొప్పగా ఉంది. ఇలాంటి సన్నివేశాలలో చదివే పాఠకులను కన్విన్స్ చేయటానికి రచయిత ప్రయత్నించకుండా ఆయా సన్నివేశాలలో వారిని చూసుకునేలా చేయటంలోనో లేక వారి చుట్టుపక్కల జరిగిన/చూసిన/విన్న వాటితో అన్వయించుకునేలా చేయటంలోనో ఆ రచయిత యొక్క గొప్పదనం బయటపడుతుంది .. అందుకు మీకు మరొకసారి అభినందనలు.
Anonymous said…
గురువు గారూ,

రుద్రయ్య, పీయూష్, శంకర్ లను ఉమకు దూరం చెయ్యటంలోని మీ కథనం, చంద్రని ఉమకి దగ్గరకి చేర్చటంలో పలచబడ్డట్టనిపించింది. అదేంటి, అంత తేలికగా నాలుగు మాటల్తో ఉమకి నచ్చేశాడా అనిపించింది. అందులోనూ ఆ అమ్మాయిని ఘటికురాలుగా కూడా చిత్రీకరించారాయె.

ఏదో నా రెండూ అణాలు.
Anonymous said…
కొత్త పాళీ గారు,

మీరు పొగడ్తలనే దశ దాటి విమర్శలనే వాటిని హుందాగా తీసుకునే దశలో వున్నారని వ్రాస్తున్నాను.

నాకెందుకో ఇది చాలా సాద సీదాగా అనిపించింది. బహుశా ఎక్కువగా ఊహించుకొని చదివానేమో. పాట అర్థవంతంగా అనిపించింది గానీ మిగిలిన పాత్రల స్వభావాలు అంత గొప్పగా వర్ణించినట్లు కనబడ లేదు. ప్రత్యేకంగా ముగించిన విధానం బావున్నా ఇది ఈ మధ్య వస్తున్న కథల్లోని పంచ్ ముగింపు లానే వుంది.

నేను కథా విశ్లేషకుడిని కాను గానీ. పొద్దున చదివిన వెంటనే కలిగిన అనుభూతి ని ఆపి మరికొంత సమయం తీసుకుని ఆలోచన మారుతుందేమో అని మళ్ళీ చదివి సమాధానం ఇస్తున్నా.


-- విహారి
మెచ్చుకుంటూనూ, సద్విమర్శతోనూ వ్యాఖ్యలు రాసిన మిత్రులందరికీ ధన్యవాదాలు. రుద్రయ్య, పీయూష్, శంకర్ లు పందెం లోంచి తప్పుకోవటాన్ని ఇంకాస్త ఇంటరెస్టింగ్ గా చెప్పొచ్చు అని ఒప్పుకుంటాను. వికటకవి - చంద్ర ఉమ కి నచ్చాడని మీరెందుకు అనుకుంటున్నారు?
విహారి - తప్పకుండా విమర్శ రాయవచ్చు. మీరు ఇంకొంచెం విపులంగా చెప్ప గలిగితే సంతోషిస్తా. ఇక్కడైనా సరే, వ్యక్తిగత వేగులో నైనా సరే.