కల్తీ లేని చెత్త

ఈ మధ్యన ఇంటలెక్చువల్ పుస్తకాలు చదవడమూ ఇంటలెక్చువల్ సినిమాలు చూడడమూ ఎక్కువై పోయింది, బుర్రలో కాస్త సమతుల్యత సాధించాలని చెప్పి వరస బెట్టి నాలుగు కొత్త తెలుగు సినిమాలు చూశా.

వార్నాయనో .. సమతుల్యత మాట దేవుడెరుగు, బుర్ర వాచి పోయింది!
ఈ చిత్ర రాజమ్ములు థియేటర్లలో రిలీజై చాన్నాళ్ళై పోయింది గాబట్టి అక్కడే బలై పోయిన వాళ్ళకి ఈ టపా ఏం చెయ్యలేదు, సంతాపం వెలిబుచ్చడం తప్ప. ఎప్పుడన్నా డిస్కులో చూద్దాం అని వాయిదా వేసుంటే .. ఈ టపా మీ ప్రాణాల్ని రక్షించే హెచ్చరిక అని గ్రహించండి.

యమగోల మళ్ళీ మొదలైంది
సుత్తి చెత్త! ఈ సినిమా ఎంత చెత్తంటే .. ఖాళీ బుర్ర జీవి గారు కూడా దీన్ని సమీక్షించడానికి సాహసించ లేదు.
కానీ ఒక్క మాట చెప్పాలి. ఇన్నాళ్ళూ తొట్టెంపూడి వేణుని చూసి అపహాస్యంగా నవ్వుకుంటూ ఉన్నా. వొట్టి బోరు గాడు, ఏమీ టేలెంట్ లేనోడూ అనే అర్ధంలో పాపం ఈ అబ్బాయి పేరుని విశేషణంగా కూడా ఉపయోగించా. కానీ ఈ అబ్బాయికి మన తెలుగుహీరోలకి చాలా మందికి లేని గొప్ప టేలెంట్ ఉంది - తెలుగు, వొత్తుల్తో సహా, చక్ఖగా మాట్లాడతాడు. నటన మానేసి, వొత్తులు పలకలేని వెధవాయలందరికీ సుబ్భరంగా డబ్బింగ్ చెప్పుకుంటే బెటర్. ఇహ నించీ అతని పేరుని పైన చెప్పిన అర్ధంలో ఉపయోగించనని ప్రమాణం చేస్తున్నా.

సీమ శాస్త్రి
బోరు చెత్త! ఒకడు కాదు, ఇద్దరు కాదు, తెలుగు సినిమాలో కామెడీ యాక్టర్లని పేరు పడ్డ మహామహులంధరూ ఉన్నారు. నాకు మాత్రం చక్కిలిగిలి పెట్టుకున్నా కొంచెం కూడా నవ్వు రాలేదు మూడు గంటల సినిమాలోనూ. అల్లరి నరేష్ పిల్లాడు పాపం ఏదో కష్ట పడ్డాడు కానీ ఈ బోరు హోరులో కొట్టుకుపోయాడు గోదారి వరదలో గడ్డిపోచలాగా.

చందమామ
చెయ్యి తిరిగిన దర్శకుడు తీసిన సినిమా కాబట్టి ఇది వీర చెత్త కేటగిరీలోకి వస్తుంది. రొయ్య మీసాల హీరో ఒహడు, పిల్లకళ్ళ హీరో ఒహడు. ఎనీమియాతో ఈ క్షణమో మరుక్షణమో సొమ్మసిల్లి పడిపోయేట్టున్న హీరోయిన్‌ ఒహత్తి. రెండో హీరోయిన్‌ సింధూ మీనన్‌ అట, పర్లేదు బానే ఉంది, ఏదో చేద్దామని ప్రయత్నించీంది, కథా, దర్శకుడూ చెయ్యనిస్తేగా. మొన్న ఆసిన్‌, నిన్న ప్రియమణి .. ఏదో పరశురామ క్షేత్రాంగనలే మన తెలుగు తెరకి కాస్త వెలుగిస్తారల్లే ఉంది. ఈ పిల్ల ఇంకేదన్నా మంచి సినిమాలో కనిపిస్తుందని ఆశిద్దాం. ఆహుతి ప్రసాద్ బానే చేశాడు గానీ ముత్యాలముగ్గు రావు గోపాలరావు ఇమిటేషన్‌ చాలా తీవ్రంగా ఉంది. నాకు తెలీకడుగుతానూ, నాగబాబుకి తాను నటించగలనని భ్రమపెట్టిన వాళ్ళెవరో? పోలీస్ ఇన్స్పెక్టరుగా సినిమా మొదట్లో ఒక పది నిమిషాలు కనబడే జీవా నటన ఒక్కటే ఇందులో ప్లస్ పాయింట్. అతగాడీ నటనా జీవితం ముగిసే లోపు అతని ప్రతిభకి తగిన పాత్ర ఎవరన్నా చేయిస్తే చూడాలని ఉంది. అన్నట్టు కొన్ని నెలల క్రితం నేను సమీక్షించిన గౌతమ్‌ ఘోష్ చిత్రం యాత్రా లో అతను గొప్ప ప్రతిభ కనబరిచాడు.
తుదిపలుకు: కృష్ణవంశీ ఇంక సినిమాలు తియ్యడం మానేస్తే మంచిది.

మంత్ర
ఇదసలు ఏ మాత్రం కల్తీలేని ప్యూరెస్టు చెత్త. ఎంత ప్యూర్ చెత్తంటే, ఎవరన్నా సినిమా తీస్తూ, అబ్భే మరీ బొత్తిగా చెత్తలేదు మన సినిమాలో, కొద్దిగా చెత్త ఉంటే బాగుంటుంది దిష్టి చుక్కలాగా అనుకుంటే, ఈ సినిమాని కొద్దిగా గిల్లి తమ సినిమాలో కలుపుకోవచ్చు. ఐనా అదే ఘాటెక్కి పోతుంది. అంత ప్యూర్ కాన్సన్‌ట్రేటెడ్ చెత్తన్న మాట.
తుదిపలుకు: ఛార్మీని తెలుగు సినిమాల్లో హీరోయిన్‌ చేసిన వాణ్ణి ఆర్టీసీ చౌరాస్తా నడిబొడ్డున కొరత వెయ్యాలి!

Comments

బ్రహ్మాండంగా ఉంది మీ హెచ్చరిక! పొద్దున్నే బాగా నవ్వించారు. ముఖ్యంగా మంత్ర - కాస్తంత గిల్లి వేసుకున్నా ఘాటెక్కిపోద్దా!!! అదరగొట్టేసారు పొండి.
leo said…
I quite liked Mantra. The camera work is refreshingly new and for a horror movie it doesn't quite tread the beaten path. Tries to endear itself to the masses unlke movies like aithe/AOKR which is where it fails miserably.

About Charmee does that include Bapu too? :-)
BHARAT said…
enti babu .. mantra cinema purest concentrated chetta ??

meeku cinema chuste emanna manishi lo marpu ravatam , samajam baagu paadipovadam , cinema kadha meeda oka thesis submit cheyyadam lanti brahmalu emanna unnayaa ?

cinemalu anduna telugu cinemalu time pass kosam chustam anthe

aa cinema lo antha bore kottesina vishyam emunda visadikariste santhoshistha

antha meaning ful cinema chudalanukunte ee "Iran Cinema " edo chudandi

leda meree oka cinema thisi maaku chupisthe inkaa santhosisthaam
Indian Minerva said…
మాష్టారు..
పరశురామ క్షేత్రాంగనలు అంటే. కేరళ కుట్టీలా? బాగుంది.
ఐనా నాగబాబుని poster మీద చూసి కూడా cinima కి వెళ్తే ఆ తప్పు director దటండీ? ఇదేం బాలేదు. నాగబాబు ని చూపిస్తున్నారూ అంటేనే director మనల్ని హెచ్చరిస్తున్నట్టు.
ఛార్మి ని మరీ అంతగా తీసిపారెయ్యల్సిన అవసరం లేదేమొ. తను చక్కగ తన డబ్బింగ్ తనే చెప్పుకుంటుంది. కొన్ని సినిమాల్లొ ఆ పిల్ల బాగానే చేసింది (మళ్ళీ చూడుడు: అనగనగా ఒక రోజు). ఇక మంత్ర అంటారా. మీరు చెప్పేరు కద దానికే నేనుకూడ ఓటెస్తాను.
dnchari said…
venu di sonta gontu kaadu....dubbing cheppinchukuntaadu anduke vattulu baaga palukutunnadu aa dubbing artist....
అయ్యో, నాలుగూ వరుసగా చూశారా! పాపం మీరు :)
ఛార్మి అంటే నాకిష్టమే స్వంతగా డబ్బింగ్ చెప్పుకుంటుందని..
చదువరి - :)
leo - true, it doesn't tread beaten path. Actually, it doesn't tread any path at all. The comment about Charmee was meant for the director who had cast her for the very first time as a heroine. If that was Bapu, then so be it!
bharat - looks like my tongue-in-cheek somehow upset you. నన్ను లైట్ తీస్కోమని చెప్తూ మీరింత అప్సెట్ ఐతే యెలా? ఇరాన్ జపాన్ సినిమాలు చూసి చూసి బోరు కొట్టే కాసేపు ఇటొచ్చా. మళ్ళీ అటే పోతా లెండి. పొయ్యేముందు మంత్రలో మీకు నచ్చిన అంశలేవిటో చెబితే వెళ్ళి ఆ ఇరాన్ వాళ్ళకీ వాళ్ళకీ కూడా చెబుతా.
indianminerva - మీ పేరు బాగుంది. పరశురామ క్షేత్రాంగనల్ని సరిగ్గా పోల్చారు. ఇది నా సృష్టి కాదు, రాకేశ్వరుడిది. ఈ కింది టపాలో మూడో స్కంధం చూడండి.
http://andam.blogspot.com/2007/11/blog-post_12.html

dnchari and నిషిగంధ - రెండు కొత్త విషయాలు నేర్చుకున్నా, వేణుకి ఎవరో డబ్బింగ్ చెబుతారనీ, ఛార్మీ తనే చెప్పుకుంటుందనీ .. ఇది కొంచెం పునరాలోచన చెయ్యాలి.
రాధిక said…
నాకు చందమామలో శివబాలాజీ,సింధూ జంట అంటే చాలా ఇష్టం.వాళ్ళు బాగా చేసారనిపించింది.ఆహుతి ప్రసాదు తెగ నచ్చేసాడు.సేం అలాగే మా చిన్నాన్నగారు మాట్లాడతారు మరి.
చార్మీ అన్నా ఇష్టమే.బాగా చేస్తుంది.కానీ మంత్రాలోనే ఎందుకో బాగా చెయ్యలేదు.నేను చాలా అనుకుని చూసాను.చార్మీ హావభావాలు కొంత విసుగు తెప్పించాయి.శివాజీ నటన బాగుంటుంది ఈ సినిమాలో.
ఈ మధ్యన వస్తున్న యంగ్ హీరోల్లో నరేష్ బాగా చేస్తాడు.ఫస్ట్ మహేష్,అల్లు అర్జున్,యంగ్ ఎన్ టీఅర్,నరేష్,రాజా,తరుణ్ ఇదీ నా లిస్ట్.
వీలయితే గమ్యం చూడండి.చాలా సినిమాల కన్నా ఎంతో చక్కగా వుంది.వీలయితే సినిమా హాలులో చూడండి.
హహ...
మీరు చెప్పిన వాటిలో మంత్ర తప్ప ఇంకేమీ చూడలా. నాకూ నచ్చలా.
ఇక వేరేవి చూడను లెండి :)
Dreamer said…
Im just curious... Can you name a couple of telugu movies you like. I remember you declaring that you didn't like bommarillu, nuvvu naaku nachchaav also.

Iam just wondering what kind of movies you like?
@ Suave..బొమ్మరిల్లు క్లీన్ గా ఉంది గానీ కథా పాత్రలూ నాకు చాలా చికాకునే మిగిల్చాయి. నువ్వు నాకు నచ్చావ్ ఎవరో ఏంటో నాకు గుర్తు లేదు, నటీ నటులు, కథ కొంచెం గుర్తు చేస్తే దాని సంగతేంటొ చెబుతా.
గత పడేళ్ళలో నాకు విపరీతంగా నచ్చిన సినిమా - సింహాద్రి
టైం వేస్టు కాలేదు అనుకున్నవి - వెంకటేష్ మల్లీశ్వరి, భూమిక మిస్సమ్మ, జగపతి బాబు పెళ్ళైన కొత్తలో, మహేష్ బాబు ఒక్కడు, మురారి
ఏదో ఒక మంచి గుణం ఉంది అనుకున్నవి - నీలకంఠ తీసిన నందనవనం 120 కి మీ, ఇంకొన్ని వెంకటేష్ సినిమాలు (కలిసుందాం రా, మొ. ఇవన్నీ ఇంచుమించు ఒకేలా ఉంటై), ప్రభాస్ ఛత్రపతి.
ఇంకాసిని నచ్చిన సినిమాలు ఉండొచ్చు, ప్రస్తుతానికి గుర్తొచ్చినవి ఇవి.
pi said…
Illusions లొ Richard Bach అంటాడు, మనం సినిమాలు చూడడానికి మూడు కారణాలుట. ఒకటి knowledge(ఇది తెలుగులో రాయలేక చచ్చా), వినోదం కోసం మూడవ కారణం మనని మనం బాధ పెట్టుకోవడం. చాలా తెలుగు చిత్రాలు మూడవ కోవకే వస్తాయి.
మీరు చెప్పిన సినిమాలు ఎవి చూడలేదు కాని, గమ్యం చూసా. పర్లేదు బానే ఉంది. NameSake తర్వాత ఈ మధ్యకాలంలో నచ్చిన సినిమా ఇదే . మీకు నచ్చిన(లేక కితాబు ఇచ్చిన) ఛత్రపతి, సింహాద్రి నాకు అస్సలు నచ్చలేదు సుమండి.
రమణి said…
పరమ వీర ధీర వీక్షకులు గారు: బాగుందండి మీ చిత్రాతి చిత్ర విన్యాసం. మమ్మల్ని ఇక చిత్ర సన్యాసం తీసుకొమని భలే హెచ్చరించారు. నెనర్లు.(బిరుదు బాగుందా? మా బ్లాగర్ల తరుపున మిమ్మల్ని మెచ్చి ఇచ్చిన బిరుదు అది) .
BHARAT said…
@kottapaali

Mantra lo naaku nacchinadi enTanTe
"it was different from the current genre of movies" and aa cinema chustunnanta sepu all the people are wholly involved in the movie
as if we are present at the current scene in the movie

i think thats kind of achievement

i thought you would delete my post as i used "ekavachana" proyagam in my post
@రమణి: హ హ హ బాగుంది బిరుదు. అందుకోడానికి మొహమాటంగా వుంది. మీ అభిమానానికి కరిగి ముద్దవుతున్నా .. ఏవిటో చిన్నప్పటినుండి కష్టపడి, చెమటోడ్చి(అప్పటి మా దుర్గకళామందిరంలో ఏ.సి లేదు) సినిమాలు చూసాను. అందుకే అలా ఏకబిగిన నాలుగు సినిమాలు చూడగలిగాను. ఈ మాత్రానికే ఈ బిరుదులు గట్రా అబ్బే! ఓ నాలుగు డీవీడీలు ఇప్పించంది దాని బదులు ..

@Bharath: Thank you for your response. I agree with you - leo also commented on the camera work. However, I feel good story and strong characterization are the cornerstone for any movie - devoid of those, external factors like good technical work don't have much chance to shine. Re. "ekavachana prayogam" - I believe in giving and taking respect, certainly. I noticed that you were peeved. I also noticed that you had something to say. Any reasonable discussion is quite welcome here.
విహారి said…
ఒక్క చందమామ తప్ప అన్నీ చూశా.
అన్నీ ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైన్మెంట్లే. తెలుగు సినిమాని సినిమాలాగే చూడాలి. ఇలాగే ఓ నెల రోజుల పాటు అన్ని సినిమాలు చూసేస్తే జన జీవన స్రవంతి లో కలిసిపోతారు. తరువాత సినిమాలలో కొన్ని సీన్లు తప్ప సినిమా అంతా బావుంటుంది లేదా కొంత సినిమా తప్ప సీన్లన్నీ బావుంటాయి. దీన్నే ధనాత్మక దృక్పథం అంటారు.
-- విహారి
"అన్నీ ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైన్మెంట్లే."
ఈ సినిమాల గురించి నేను ఆ మాట అనుకోవాలంటే ఇంకో జన్మెత్తాల్సిందే. పోనీ మీ శిష్యరికం చేస్తే ఏమన్నా వొంటబడుతుందేమో విహారీ?
"తెలుగు సినిమాని సినిమాలాగే చూడాలి."
నేనూ వాటిల్ని సినిమాలాగే చూశాననుకుంటున్నానే .. ఏ సర్కస్ లాగానో, జూలాగానో, ఆర్ట్ మ్యూజియంలాగానో చూళ్ళేదే! ఏంటో!! ప్చ్
జ్యోతి said…
కొత్తపాళిగారు,

మీరు మరీను. విహారి అన్నట్టు సినిమాను సినిమాలాగే చూడాలి. దాని గురించి ఎక్కువ లోతుగా ఆలోచించొద్దు. మీ మైండ్ లోకి ఆ సినిమా ప్రభావం దూరకుండా అలా చూసేయండి. అప్పుడు అందరితో పాటు నవ్వొస్తుంది, ఏడుపొస్తుంది etc..etc..

కాని రెండ్రోజుల క్రింద నేను మంత్ర సినిమా చూసా. చార్మి ఈ నాటి యువతరానికి బాగా నచ్చుతుంది(అది ఎందుకో మీకు అర్ధమయ్యే ఉంటుంది) వేరీ బ్యూటీఫుల్ గా చేసింది. మీ రివ్యూ చూసాక అది ఎంత వరకు నిజమో . నామీద అది ఎంత ప్రభావం చూపిస్తుందో అని మాత్రమే చూశా.కాని దానివలన నాకో లాభం కలిగింది. ఆరోజు ఉదయం నుండి ఉన్న తలనొప్పి,(మాత్ర వేసుకుంటే గాని తగ్గని మైగ్రైన్) మంత్ర సినిమా చూడగానే టక్కున మాయమైపోయింది. అదేంటో మరి.
అందుకే పెద్దలన్నారేమో?? విషానికి విషమ విరుగుడని.(నిజంగా అన్నారా?).. అలాగని మళ్ళీ ఆ సాహసం చేయను.కాని మొత్తం సినిమా చూసినా నాకు కథ అర్ధం కాలేదు. ఎవరు ఎవరిని చంపుతున్నారు. ఎందుకు చంపుతున్నారు. మా పిల్లలిద్దరిని అడిగా . వాళ్ళు సేమ్ డైలాగ్. ప్చ్...
టపాకన్నా వ్యాఖ్యలే మజా తెప్పిస్తాయని మీరెక్కడో అన్నారు. మీ ఈటపాకొచ్చిన వ్యాఖ్యలు అలాంటివే. మీరు చెప్పిన సినిమాలు నేను చూడలేదు. ఇదిగో నాభాగ్యమూ ... ఏమి చెప్పను...
నేను సినిమాలు చాలా తక్కువగా చూస్తా. అవికూడా క్రిటికల్ గా చూడను - మన సినీవిహారి చెప్పినట్లుగా చూస్తా. ఎటొచ్చీ కథ, కథనం, అభినయం బాగుంటే మంచి కాఫీ తాగిన ఫీలింగొస్తుంది. బాగోగుల నిష్పత్తిని బట్టి- అమ్మ పెట్టిన కాఫీ రుచా, పెళ్ళామిచ్చినదానిదా లేక అత్తగారిచ్చినదాని రుచా అన్నది ఆధారపడుతుంది.
ఇంత స్తితప్రజ్ఞత (:))అలవాటు చేసుకున్నాకా కూడా వెన్నెల సినిమా (రాజా, పార్వతీ పెంటన్ (మిల్టన్?), సర్వానందు అఫ్ అమ్మచెప్పింది ఫేమ్)కి హాలుకెళ్ళి చూసి మరీ నరకంలో పడ్డాం. అపరిచితుడు కనక ఆసినిమా చూసుంటే అంధకూపం, క్రిమిభోజనాది శిక్షలతో పాటు వెన్నెల చలనచిత్ర దర్శనాన్నికూడా ఒకశిక్షగా అసలు చేసుండేవాడు.
Purnima said…
>>..బుర్రలో కాస్త సమతుల్యత సాధించాలని చెప్పి వరస బెట్టి నాలుగు కొత్త తెలుగు సినిమాలు చూశా.

ఓహ్.. తెలుగు సినిమాలు ఎందుకు చూడాలో అర్థమవుతోంది. భలే టపా! మీ ఓపిక మాత్రం సమాన్యం కాదు. రమణిగారి బిరుదు సరిగ్గా సరిపోయింది.
సింహాద్రి నచ్చిందా? Gr8.

మీకు నిజంగా ఓపిక ఎక్కువే!
Anonymous said…
I am sure, you don't know how to enjoy a movie. You have to what ever good available. If you are aware of Godavari Villages you will like Chandamama. Dont see logic or just enjoy mama...
Anonymous said…
సినిమాని చెత్త చెత్త అని తిట్టినంత మాత్రాన మచి విమర్శకులు కాలేరు. వాళ్ళు చేసిన పనిలో మంచిని మెచ్చుకో... లోపాలు తెలియజెయ్యి.
అల్లుడా, ఓరల్లూడా, పేర్లేని అల్లూడా, నా ఆంగ్ల అల్లుడా, ఈ సారి తెలుగు సినిమా చూసే ముందు నీక్కాల్ చేస్తా. నా పక్కనే కూర్చుని ఏసీన్ని ఏమోతాదులో ఎంజాయ్ చెయ్యాలో చెప్దూగాని.

రెండో అనామకుడు ఇట్లు వాకృచ్చెను:
"సినిమాని చెత్త చెత్త అని తిట్టినంత మాత్రాన మచి విమర్శకులు కాలేరు."
నిజమే!
"వాళ్ళు చేసిన పనిలో మంచిని మెచ్చుకో... లోపాలు తెలియజెయ్యి."
శిరసావహిస్తాను!!
అసలూ,ఈ టపాని ఇన్నాళ్ళూ నాక్కనిపించకుండా ఎలా దాచారండీ?
కొత్తపాళిగారు,
తెలుగు సినిమాలు ఫైట్లూ, పాటలూ ఫార్వర్డ్ చేసి చూడండి. నేను ఎప్పుడూ అలాగే చూస్తుంటా కాబట్టి నాకు ప్రతీ సినీమా బాగానే వుంటుంది.
భవాని said…
ఒక ఇంగ్లీషు సినిమా ద్వారా వాళ్ళ కల్చర్ ని అర్ధం చేసుకోగలం. కానీ మన సినిమాల ద్వారా అర్ధం చేసుకోటం అంత సులభం కాదు. ఇప్పటి తెలుగు సినిమాల్లో ఎక్కువ శాతం ఆర్టిఫీషియాలిటీ కనిపిస్తుంది -- సెట్లూ, వస్త్రధారణ, మాటలూ అన్నీ. వీటితో మనలను అస్సలు రిలేట్ చేసుకోలేము. కానీ క్రిష్ణ వంశీ సినిమాల్లో డైలాగులు కొంచెం మనుషులు మాట్లాడుకునేవిలా ఉంటాయి. అతని హీరోయిన్లు ఆర్టిఫీషీల్ గా అనిపించినా మిగతా వాళ్ళు తెలుగుదనానికి దగ్గరగా ఉంటారు. పైగా మన పండుగలనూ, పెళ్ళిళ్ళనూ బాగా చూపిస్తాడు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంతకంటే తెలుగు సినిమాల నుండి ఆశించటం అత్యాశవుతుంది.
పై సినిమాల్లో చందమామొక్కటే చూశాను. నాకు చందమామలో అన్నిటి కంటే ఆహుతి ప్రసాద్ క్యారక్టర్ నచ్చింది. తండ్రో, కొడుకో కష్టపడితే హాయిగా కూర్చొని తినటం. ఇంకో జన్మంటూ ఉంటే హాయిగా అలా ఉండాలి అనుకుంటాను. కాకపోతే ఆ సినిమాలో లానే చుట్టు సంతోషంగా ఉండే జనం ఉంటే బావుంటుంది. చిరంజీవి యాక్షన్ కంటే నాగబాబుదే బావుంటుంది అనిపిస్తుంది. చిరంజీవి డైలాగులన్నీ ఒక mould నుండి అచ్చువేయబడినట్లుగా అనిపిస్తాయి.
harish said…
mantra antha chetha em kaadhu...sare,meeku nachina cinemaalu entoo cheppandi mari....
babu nandanavanm 120 ante ne artham ayyindi...tamari taste ento........

chandamam ok.............manta grudge remake..1.30 movie 2.30 hrs cheste alane vuntundi........
@Vinay Chakravarthi.Gogineni ..
you said - "nandanavanm 120 ante ne artham ayyindi...tamari taste ento.."
What does that statement mean? WHat is your opinion of Nandanavanam 120km? What did you learn about my taste?
Did you find chandamama movie to be OK?
What does it matter if Manthra was a remake of Grudge - my point was that it was badly made.
మిగతా సినిమాల విషయంలో ఏకీభవిస్తాను కానీ చందమామ బాలేదంటే మాత్రం నేనొప్పుకోనంతే. ఆ.

మంత్ర సినిమా చూసానో లేదో గుర్తుకులేదు.