జీవిత పరమార్ధం ఏవిటి?

మీ జీవిత పరమార్ధం ఏవిటి?

మీ అంటే మీరే .. ఈ పోస్టు చదువుతున్న మీరే.

మీ పక్కన బ్రేక్ఫాస్ట్ తింటున్నవాళ్ళో, మీ బుజమ్మీంచి కంప్యూటర్లోకి తొంగి చూస్తున్న వాళ్ళో,ఇవన్నీ కాక ఎవరో సాధారణ సగటు మనుషులో కాదు - మీరంటే అచ్చంగా మీరే .

మీ జీవితాశయం ఏవిటి? ఏ పరమార్ధం కోసం జీవిస్తున్నారు మీరు?

నాకు Pulp Fiction అనే సినిమా చాలా ఇష్టం. అందులో Samuel Jackson అనే నటుడు Jules అనే గూండా పాత్ర పోషిస్తాడు. ఒక రోజు పొద్దున్నే తమ బాస్‌ని మోసం చేసిన ఒక బృందాన్ని బెదిరించి వాళ్ళ దగ్గిరున్న బాస్‌కి చెందిన బ్రీఫ్‌కేస్ తీసుకు రావడానికి వెళ్తారు, జూల్స్, అతని సహ గూండా విన్సెంట్. అక్కడ అంతా వీళ్ళకి అనుకూలంగా జరుగుతోంది అనుకుంటుండగా, ఆ బృందానికి చెందిన ఒక పిల్లగాడు బాత్రూంలో దాక్కుని ఉండి, అకస్మాత్తుగా వీళ్ళ మీద పిస్తోలుతో దాడి చేస్తాడు. వాడు ఆరు బుల్లెట్లు పేలిస్తే తమాషాగా వీళ్ళకి ఒక్కటి కూడ తగల్దు. ఆ తరవాత జూల్స్, విన్సెంట్ ఒక కాఫీహోటల్లో బ్రేక్ఫాస్ట్ తింటుండగా తను గూండాగిరీ విరమిస్తున్నా అంటాడు జూల్స్. విన్సెంట్ నీకేమన్నా మతి పోయిందా అంటాడు. దానికి జూల్స్ సమాధానం ఇది -

"Well, yeah. I was just sitting here, eating my muffin, drinking my coffee, when I had what alcoholics refer to as a moment of clarity."

Now, the question is this - Did you ever have your own moment of clarity?

Comments

rākeśvara said…
మనుషులకే కాదు, ప్రపంచంలో ఏ ప్రాణికైనా జీవిత పరమార్థం ఒక్కటే.
Survive the day(or may be the night, of that is more dangerous) and have sex in the night (or may be even in the day, if that is more convenient).
తేడా ఏంటంటే కొన్ని ప్రాణులు ఈ పని ఏటికవే చేసుకుంటూ పోతుంటాయి, కొన్ని ప్రాణులు గుంపులుగా చేస్తాయి (ఉదా- అమెరికా ప్రాణులూ, భారత ప్రాణులు).

పై సిద్ధాంతంతోఁ మీరు మీ జీవితం విసిఱే ఏ చిక్కు ప్రశ్నకైనా సమాధానం చెప్పగలరు. నా వివరణతోఁ మీ సంశయం/సందేహం తీరుతుందని నాకు గట్టి నమ్మకం ఉంది. తీరకుంటే మఱిన్ని వివరాలు కోఱండి.

రాకేశ
Ramani Rao said…
జీవితం అర్ధాలు పరమార్ధాలు గురించి నేను మాట్లాడలేను కాని, అసలు జీవితాశయం అంటే ఒక్కటే "ఆనందంగా జీవించగలగడం". ఆనందం అంటే కార్లు, మేడలు, ఒంటి నిండా నగలు కాదు, చిన్న చిన్న సాధారణ ఆనందాలు, పసి పిల్లాడి బోసినవ్వులు, వర్షం పడుతుంటే అలా పడక్కుర్చిలో కూర్చుని వేడి వేడి కాఫి/టీ తాగుతూ మిరపకా బజ్జీలో/పకోడినో అర కొర నములుతూ ఇష్టమైన సంగీతం వింటూ "సూరట్టుకు జారతాది సిటుక్కు సిటుక్కు వాన చుక్క అనుకొంటూ" వర్షాన్ని ఆస్వాదించగలగడం, ఇష్టమైన వాళ్ళు పక్కన వుంటే కలిసి తడవడం... ఇలా ఎన్నెన్నో... చక్కటి ఫీలింగ్స్. వెరసి మొత్తానికి "ఆనందంగా జీవించగలగడం" అనేదే జీవన ఫిలాసఫి అనుకోవచ్చు లేదా జీవితాశయం అనుకోవచ్చు నా అబిప్రాయంలో.
Anonymous said…
Wonder how many of these Telugu bloggers remember that dialog. Surprising that you picked up this dialog. Even I was mulling over this.

To answer your question yes, when my other half moved away (and that was my moment of clarity) and I realized all of a sudden the futility of taking and the enormous happiness one is filled with when one gives without expecting ABSOLUTELY nothing in return.

It is my turn to ask you and the others: Did you ever give?
Expecting nothing in return in ABSOLUTE TERMS but for the sheer pleasure of giving?
Nagaraja said…
వావ్.. నెనరులు.
Ramani Rao said…
కాస్త కష్టపడితే కార్లు, నగలు అవే వస్తాయి. కాని ఇలాంటి చిన్న చిన్న ఆనందాలనే అసలు ఎంత కష్టపడినా అనుభవించలేము అనిపిస్తుంది అందుకే దీనిని జీవితాశయం అనాల్సి వస్తోంది. ఒక రకమైన యాంత్రిక జీవనానికి అలవాటుపడ్డాక వర్షంలో తడవడం అయితేనేంటి , కిటికీ పక్కన కూర్చుని ప్రకృతిని ఆస్వాందించడం అయితేనేంటి చెయ్యలేము, ఇక్కడ పక్కవాళ్ళేమనుకొంటారో అనే భయం కాదు, వాళ్ళ ఆలోచనలు ఎటు దారి మళ్ళూతాయో అన్న ఫీలింగ్ అంతే. ఇలా అనుకొని మనం హోదా ముసుగులో కాలం గడిపేస్తాము ఎంతో హుందాగా (నటిస్తూ). ఎందుకంటే అంత తొందరగా ఇలాంటి ఫిలాసఫి ఎవ్వరికి నచ్చదు మరి.
అయ్యా గురూ గారు,మీ సవాలుకు జవాబుగా ఒక టపా రాసా
http://visakhateeraana.blogspot.com/2008/04/blog-post_05.html
Anonymous said…
I dont know about all that but this post definetely lacked clarity
teresa said…
"we make a living by what we get, we make a life by what we give" అన్నారెవరో పెద్దాయన.
Those who 'give' for the sheer pleasure of it, don't mention it.
oremuna said…
కడుపులో చల్ల కదలకుండాఅ ఉన్నది కదా! ఇప్పుడివన్నీ అవసరమా? :)
Anonymous said…
జీవిత పరమార్ధం ఏమిటి?? మీరు అడిగిన ప్రశ్న బాగుంది..నేను ఒక టపా రాశాను దాన్ని మీరూ ఒకసారి చూడండి..
http://drrams.wordpress.com/
రమణి(గారు) చెప్పినట్లు నిజమే జీవితము అంటే ఆనందము గా జీవించడమే..కాని ఆ ఆనందాన్ని ఇంకో పది మంది తో పంచుకుంటే ఇంకా ఆనందం గా వుండొచ్హు కదా!! నా ఉద్దేశ్యము లో జీవితము అంటే ఇచ్హి పుచ్హుకోవడము (Sharing).. ఏది మనతో ఆగి పోకూడదు, అది ఆనందం కావచ్హు, విజ్ణానము కావచ్హు..నీ జీవితాన్ని "నా వాళ్ళు" అంటూ యే కొద్దిమంది కో కుదించుకోవద్దు.. భగవద్గీత లో "పెద్దాయన" చెప్పినట్లు వస్తూ నువ్వు ఏమి తీసుకు రాలేదు, పోతూ ఏమి తీసుకు పోవు..ఇంత కన్నా గొప్ప పరమార్ధమ్ వుంటుంది అని నేను అనుకోవడము లేదు..
@netizen:-there are enoromous exceptions even to the Altruism a term coined by auguste comte,of which we were taught both in the college and in the university.i think the so called scholars and researchers are of the opinion even the mother will/would expects some thing from her children consciously/unconsciously.so how can we ordinary mortals could expect such a spartan,gentle act of sheer giving??
Anonymous said…
@teresa: You are right..
Nagaraju Pappu said…
Did you ever have your own moment of clarity?

YES - I did. It was a moment of blinding clarity, happened in the most unexpected places, at a most uneventful of times and in the most unexpected sort of way!

What the alcoholics don't mention is that after that, for the rest of your life - you generate the momentum from that moment.

As you might already know - it is almost impossible to express it. It is as futile as unrolling an infinite carpet in front of you.
cheers,
Nagaraj
ఏవిటీ పిచ్చి ప్రశ్న అని కొట్టి పారెయ్యకుండా కాస్త ఆలోచించి, లేదా ఈ ప్రశ్నని తమ జీవితానికి అన్వయించుకుని సమాధానం రాసిన మిత్రులందరికీ ధన్యవాదాలు.
ప్రశ్న అడగటానికి నేపథ్యం ఏవిటంటే .. నాకు నేను ఇంకా ఆ పరమార్ధం కోసం వెతుక్కుంటూ ఉండటమే. కొన్ని కొన్ని సార్లు కొన్ని ఆలోచనలు వచ్చాయి (కభీ కభీ మేరె దిల్మే ఖయాల్ ఆతాహై టైపులో) వాటిలో కొన్ని ఆచరణలో కూడ పెట్టాను, సత్ఫలితాలనీ ఇచ్చాయి .. కానీ అవేవీ జీవిత సత్యాలుగా నిలిచిపోలేదు. అంటే నిజమైన moment of clarity రాలేదేమో .. దాంతో మళ్ళీ అన్వేషణ ..
రాకేశ్వర - ఇది సిద్ధాంత చర్చ కాదు, అనుభవైక వేద్యం. మీ అనుభవమేంటి అని అడుగుతున్నా.
రమణి - జీవిత పరమార్ధం ఆనందం. బాగుంది. కానీ ఆ ఆనందం ఎలాగొస్తుంది. మీకది చిన్నిచిన్ని కోరికలు తీరడం వల్ల రావచ్చు. మరొకరికి కోట్ల ఆస్తులు, వొళ్ళు పట్టని నగల వల్ల రావచ్చు. ఇదే సరైనదని ఎలా చెప్పటం?
నెటిజెన్‌ - నిస్వార్ధ దాతృత్వం .. బహుశ దాన్నే ప్రేమ అని కూడ అనొచ్చమే. మీ ప్రశ్నకి సమాధానం .. ఇచ్చాను, చాలానే ఇచ్చాను, ఇస్తూ ఉన్నాను. ఐతే ఎంత నిస్వార్ధంగా ఇచ్చాను అని చెప్పలేను. ఎందుకంటే ఇంకా జీవితం నించి చాలా ఆశిస్తున్నా నేను. మీకింకో ప్రశ్న. నిస్వార్ధం కనక జీవిత పరమార్ధం ఐతే మనుషుల్లో స్వార్ధం ఒక instinct లాగా స్థిరపదిందెందుకు?
రాజేంద్ర మరియు డా. రా్మ్‌ - మీ టపాలు చూసి మళ్ళి వస్తాను, కానీ మీరిద్దరూ కూడ సిద్ధాంత చర్చలోకి వెళ్ళిపోయినట్టు ఉంది.
నాగరాజు గారు - థాంక్యూ సర్. సో, నాక్కూడా హోప్ ఉన్నదంటారు!
Anonymous said…
@కొత్తపాళీ: "తమజీవితాన్ని అన్వయించుకుని" - అదేగా సాధ్య పడేది. ఇక మీరడిగిన ప్రశ్న "ఐతే మనుషుల్లో స్వార్ధం ఒక instinct లాగా స్థిరపదిందెందుకు?" ఒక టపా అవసరమవుతుంది.
Anonymous said…
@ రాజేంద్ర కుమార్ దేవరపల్లి : Sorry missed your comment earlier. Please expect a post on the question you raised.As Mr. Nagaraj mentioned here "........it is almost impossible to express it.".
మీరందరు చెప్పింది బాగానే ఉంది. కాని నేను ఇంతవరకు నా జీవితంలో లక్ష్యం , పరమార్ధం అనే విషయాలే ఆలొచించలేదు. ఇల్లు , పిల్లలు అంటు ఒక కర్తవ్యం , నా బాధ్యత అనుకుంటు వచ్చా. నేను మారాలంటారా???hmmmm
Anonymous said…
ఈ మధ్య కొంచం విపరీతమైన పని ఒత్తిడి వల్ల బ్లాగులజోలికి రావడం తగ్గింది. నాకు జీవితంలో ఒకసారి ఈ moment of clarity వచ్చింది. ఆ సమయంలో నేను చాలా ఆందోళన, చిరాకు, జీవితం మీద విసుగుతో బాధ పడుతున్నాను. ఇలా లాభంలేదు కొద్దిరోజులు ఎక్కడికైనా పోదామనిపించింది. పాండిచ్చేరి వెళ్ళాను. ఒక మూడు రోజులు అక్కడ నిశ్శబ్దంగా గడిపి వచ్చేద్దామని ఆలోచన. మొదటిరోజు వెళ్ళగానే అరవిందుల ఆశ్రమంలోకి వెళ్ళి కొన్ని గంటలు ప్రార్ధన చేస్తూ ఉండిపోయాను. అప్పుడు హఠాత్తుగా మనసుకి ఏదో ఒకానొక ‘స్పృహ’ కలిగింది. నా శరీరాన్నీ, జీవితాన్ని కల్పించిన అతీత శక్తి పట్ల గొప్ప కృతజ్ఞతా భావం కలిగింది. అసంతృప్తీ, విసుగూ మటుమాయమైపోయాయి. ఒకవిధమైన సంతృప్తితో మనసు నిండిపోయింది. పరుగుపెట్టడం మానేసింది. ఆ అనుభూతిలో మిగతా రెండు రోజులూ గడిపి ఇంటికి వచ్చేటప్పటికి ఆ అనుభవం మాయమై మళ్ళా మెల్లిగా మనసు పాత స్థితిలోకే వచ్చేసింది. అయినప్పటీకీ జీవితంపట్ల ఒక కొత్త ‘ఆశ’, ‘రుచి’ మాత్రం మిగిలినై. అదే స్థితి మళ్ళీ కలిగి ఎప్పటికీ ఉండిపోతే బాగుణ్ణు అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు వెనక్కి చూసుకుని ఆ అనుభవంలో నాకు కలిగిన clarity ఏమిటని ఆలోచిస్తే, జీవితం అనే అనుభవం గొప్ప మిరకిల్ అని ఆ క్షణంలో తెలిసింది అనిపిస్తుంది. ఆ అవగాహన అనుభవంలోకి రావడం వల్ల, మిగతా సమస్యలూ, మన: ప్రవృత్తులూ అన్నీ చాలా చిన్న విషయాలైపోయి, మనసు చాలా తేలికైపోయింది అనిపిస్తుంది. మీరు చెప్పిన సినిమాలో సన్నివేశంలో కూడా వాడికి near death experience కలిగింది. కాబట్టి వాడికి జీవితం మీద ఒక ‘స్పృహ’ వచ్చింది. అటువంటి సన్నివేశమే ‘Fight Club’ సినిమాలో కూడా ఉంటుంది.
Anonymous said…
@రాజేంద్ర కుమార్ దేవరపల్లి: Perhaps you would enjoy this piece Anthem by Ayn Rand > http://netijen..googlepages.com/home
Anonymous said…
JyOti, you might be one of the luckiest ones, if you never felt like searching for some meaning. So, keep it up!
Unknown said…
నాకు ఈ పరమార్థం ఇంత వరకూ తెలీలేదు.
మీలాగే కనుగొందామని ప్రయత్నిస్తున్నా. మీ ఈ టపా చూసి నా ఈ టపా గుర్తుకొచ్చింది.
రవి said…
నాకిలాంటి డవుట్లు వచ్చినప్పుడు జిడ్డు కృష్ణమూర్తి పుస్తకాలలో తల దూర్చడం అలవాటు. ఈ టపా చూసిన తర్వాత అదే పని చేసాను. అక్కడ నాకు దొరికిన సమాధానం " పరమార్థం యేదైనా కానివ్వండి. ఆ పరమార్థాన్ని ఓ ఆశయం (ideal) లా తీసుకోక జీవితాన్ని సాధారణంగా గడపడం ఉత్తమం "

కొత్తపాళీ గారూ, మీరీ మధ్య బ్లాగు మిత్రులందరినీ బాగా ఇన్వాల్వ్ చేయిస్తున్నారు. నెనర్లు.
Anonymous said…
ఈ ప్రశ్న అప్పుడప్పుడూ తొలుస్తూనే ఉంటుంది. కాకపోతే అసంతృప్తితో ఉన్నప్పుడే ఎక్కువ తొలుస్తుంది. ఆ బాధకి కారణం ఏదైనా కానివ్వండి. సహజంగానే ఇలాంటప్పుడు ఈ ప్రశ్నకి అంతగా విలువనివ్వక్కరలేదు. కానీ ఇదే ప్రశ్న బాగా సంతృప్తితో ఉన్నప్పుడు కూడా తొలిస్తే అప్పుడు ఆ ప్రశ్నకి, రేకిత్తించిన మనసుని సమాధానపరచటానికి చేసే ఆలోచనలకి అక్షర లక్షల విలువుంటుందని నా భావన.

నాకు రెండు స్థితులూ అనుభవాలే. మొదటి స్థితి ముందే చెప్పినట్లు పెద్దగా పట్టించుకోనవసరం లేదు. రెండోది స్థితి కలిగినపుడు కలిగే ఆలోచనలన్నీ నన్ను నేను మరింత సంస్కరించుకోమని చెప్పేవీ లేదా మరింత పరులకు (ఆపన్నులకు) సహాయపడు అని తెలియజెప్పేవే. ఈ స్థితే మన జీవిత పరమార్ధాన్ని మనకి తెలియచేస్తుందని అనిపిస్తుంది.

* మీరు పరమార్ధం కెరీరు గోల్స్, ప్రమోషన్లు గట్రా వంటి వాటి అర్ధంలో అనలేదనే అనుకుంటున్నాను.
Anonymous said…
నేను ఇంకో వ్యాఖ్య కూడా రాశాను. అది మిస్సయినట్లుంది.

జీవితానికి పరమార్థం "జీవించడం" అని. అర్థం అదే దొరుకుతుంది, ఆనందం అదే అందుతుందనీను.
అదే నాకు ఇంకా అందుకోలేని గమ్యంగా ఉందని.
అంటే ఉదాహరణకు జ్యోతి గారిలాగా ఉండగలగడం.

ఇక వికటకవి గారు,
మీరు చెప్పింది "అసంతృప్తిగా ఉన్నప్పుడూ", "సంతృప్తిగా" ఉన్నప్పుడు ఇటువంటి ఆలోచనలు రావాదం, దానిని మనం విశ్లేషించుకోవడం గురించి నేను పూర్తిగా ఏకీభవిస్తాను.
కొన్ని మాటలలో చెప్పలేను కాని బహూశా మీ వ్యాఖ్య చదువుతున్నప్పుడూ కూడా నాకు ఒక విధమైన moment of clarity కలిగింది.
ఇంతకు ముందు తప్పిపోయిన వ్యాఖ్యలో ఇది కూడా రాశాను. నాకు moments of clarity వచ్చినై, పోయినై అని. నిషిగంధ గారి కవిత గుర్తు చేసుకున్నాను. ఆ కవిత లంకె దొరికితే మళ్ళీ ఇస్తాను. ఇంతకీ చెప్పేదేమిటంటే, అలాంటి moment of clarity నిలిస్తే మనం బుద్ధులమైపోయినట్లేనేమో కదా అని.
ఇక, వికటకవి గారు సూచించిన రెండో పరిస్థితిలోనే కదా బుద్ధుడు అశాంతితో సమాధానం వెతుకుతూ బయటకు వెళ్ళింది.
దాంట్లో నాకు ఇంకో సమాధానం దొరికింది. ఎన్నో సార్లు అనుకుంటూ ఉంటాను, అన్నీ ఉన్నప్పుడు ఎందుకు ఇంకా ఏదో అర్థం వెతుక్కుంటాను అని. అలా ఉండడం అసంతృప్తి కాదని సహజమైన మానవ లక్షణం అనీ, అలా ఉన్నందుకు feel అయ్యేకంటే, దానిని ఎలా deal చెయ్యాలన్న ఆలోచన మీద ఎక్కువ ధ్యాస పెట్టాలనీను.
ఇక బుద్ధుడు కూడా కొన్నేళ్ళు కొందరు గురువుల నుంచి నేర్చుకోగలిగింది నేర్చుకుని, సాధన చెయ్య గలిగింది చేసి, తనకు తానుగా మార్గాన్ని అన్వేషించుకుని చివరంటా సాధన చేశాక అతనికి జ్ఞానోదయం అయ్యింది.
కాబట్టి ఈ పరమార్థం అనేది తెలిసేసుకుంటే తెలిసిపోయేది, వెంటనే జీవితాన్ని ప్రశాంతంగా చెసేసేదీ అయిన ఒక magic formula మటుకు కాదు అని నాకర్థమయ్యింది.
ఇంకో మాట, బుద్ధుడు జ్ఞానోదయమయ్యాక ఇది ఎవరికైనా చెప్పినా, మనుషులు తమ సహజ గుణాలను వదిలి అర్థం చేసుకోగలరా అని సందేహించాడట. అప్పుడు అతనికి ఏ దేవదూతో ఇలా సందేశం ఇచ్చారటా,"అందరికీ అర్థం కాకపోవచ్చు. కానీ కొందరికి అర్థం కాగలదు" అని. ఆ కథ నిజమైనా కాకపోయినా, అందులో నాకు ఇంకో సందేశం దొరికింది. కొందరికైనా అర్థం అవుతుంది కదా అని. అది day to day life లో కూడా మనం ఏదైన పని చేయబోయేటప్పుడు ఉపయోగపడే సందేశం అనిపించింది.
ఇవీ నేనెరిగిన సత్యాలు ఈ నాటికి:-)
spandana said…
తమాషాగా నాకు ఈ చర్చలో పాల్గొన్న అందరి సమాధానాల్లోకి రాకేశ్వరరావు సమాధానమే (బహుశా మొదట్లో వుండటం వల్లనా?) నా ప్రస్తుత అవగాహనకు (జీవిత పరమార్థ అవగాహనకు) దగ్గరగా వున్నట్లు అనిపిస్తోంది.

ఎన్ని చెప్పుకొన్నా జీవి పరమార్థం తను వీలయినన్ని నాళ్ళు బ్రతగ్గలగడం బ్రతకడం, బ్రతికినన్ని నాళ్ళు తన సంతానాన్ని తద్వారా తన జాతిని పెంచుకోవడం, ఉద్దరించడం.

ప్రతిజీవీ ఈ పరమార్థికత కొరకే దినం దినం, క్షణం క్షణం ప్రయత్నిస్తూ వుంది తెలిసో తెలియకనో.

జీవుల సమిష్టి ప్రక్రియగా ఈ సృష్టి యొక్క పరమార్థికతా అదే అనుకుంటాను.

రాకేశ్వరరావు అన్నట్లు మిగతా అందరి వాఖ్యానాలలో వున్న నిస్వార్థ ప్రేమ, సుఖాన్ని పంచుకోవడం ఇతరత్రాలన్నీ కూడా తన వారిని, తన జాతిని, తన తోటి జీవిని ఉద్దరించడం అన్న పరమార్థానికి లోబడే వున్నాయి.

--ప్రసాద్
http://blog.charasala.com
Ray Lightning said…
హ్మ్మ్మ్. moment of clarity ? ఇంకా రాలేదు అనుకుంటా! నా దృష్ఠిలో జీవితం అంటే ఒక అనంతమైన ప్రశ్న. దీనికి ఎప్పుడూ సమాధానం దొరకదు. ఒక treasure hunt. మారియో అని వీడియో గేము నాకు చాలా ఇష్టం. జీవితం అంటే నాకు ఈ గేములాగ ప్రతీ లెవెల్లోనూ పాయింట్లు సంపాదించుకుంటూ, ఒక లింకునిండి ఇంకొక లింకుకి క్లూలు వెతుక్కుంటూ.. అలాగ ముందుకు పోవడం.

జీవితం అనే ప్రశ్నకి సమాధానం దొరికేస్తే, మరి బోర్ కొట్టేస్తుంది. గేం ఓవర్ :)
GIREESH K. said…
చాలా ఆశక్తి కరమైన చర్చ...ఎంతో ఆహ్లాదకరమైన స్పందనలు...మిత్రులందరికీ అభినందనలు. దీనికి కొనసాగింపుగా ఒక టపా వ్రాశాను...చూడగలరు.
http://gireesh-k.blogspot.com

-గిరీష్
Srinivas said…
జీవితాశయానికీ, జీవిత పరమార్థానికీ తేడా ఉందనుకుంటాను. జీవితాశయం మనం ఆలోచించుకుని తీసుకున్న నిర్ణయం. పరమార్థం మన ప్రమేయం లేనిది, మనకు తెలియకపోయినా ఉండి ఉండవలసింది.

చిత్రమేమిటంటే ఇంతవరకూ ఎవరూ దేవుడి పేరెత్తకపోవడం. జీవితానికో పరమార్థం ఉందనుకుంటే అది ఎవరో ముందే నిర్ణయించి ఉండాలి. ఈ దృష్టితో చూస్తే ఆ పరమార్థాన్ని కనుగొనాలనుకోవడంలో అర్థముంది.

నేను పొందింది moment of calrity కాదు, moments of clarity అనాలేమో ఇది ఏదో ఒక క్షణంలో కలిగింది కాదు గాబట్టి. నాకు బోధపడిందేమిటంటే మానవ జీవితాలకు అర్థం లేదు. అందులో పెద్ద విషాదమున్నట్టూ తోచదు. మన కాలికింద నలిగి చచ్చే చీమ జీవితానికి ఎంత అర్థమున్నదో మన బతుకూ అంతే. మన ముందు పుట్టి చనిపోయిన కోట్లాది మానవ జీవితాలకేం భాష్యం చెపుతాం?

అందువల్ల మన బతుకు విలువేమీ తగ్గదు. సృష్టిలో ఆనందాలకు లోటేమీ కలగదు. అర్థం లేనంత మాత్రాన ఏదీ వ్యర్థం కాదు. ముందు వ్యాఖ్యాతలు చెప్పినట్టు జీవితానికి అర్థం జీవించడమే.. ప్రతి క్షణమూ ఇది ఎంత అమూల్యమో స్పృహలో ఉంచుకుని.

ఇక ఎలా జీవించడమన్నది మన చేతుల్లో ఉంది, కనీసం ఎలా జీవించడానికి ప్రయత్నించడమనేది. అంతిమంగా మనం మనకి ఆనందం కలిగించే, లేదా బాధ తొలగించే పనులే చేస్తాం. అవి పొరుగువాడికి కూడా ఆనందం కలిగిస్తే సమాజమూ ఆనందప్రదంగా మారుతుంది, తిరిగి మనకి ఆనందదాయకమవుతుంది.
Naveen Garla said…
>> జీవిత పరమార్ధం ఏవిటి?
ఇదే ప్రశ్నను నా పదహైదవ యేడు డైరీలో రాసుకున్నాను. నాకు తోచిన సమాధానం కూడా అదే పేజీలో వ్రాసుకున్నట్టు గుర్తు. అప్పుడు నేను వ్రాసుకున్న సారాంశం ఏమిటంటే, "చాలా మంది జీవితం మొదట్లో బంధాలు, బాధ్యతల మధ్య ఉండి అస్సలు సమయం తెలియదు. వయసు పెరిగే కొద్దీ బంధాలు దూరమై, బాధ్యతలు తగ్గుతాయి. జీవితమనే రహదారిలో అంత దూరం నడిచిన తరువాత వెనక్కు తిరిగి చూసుకుంటే ఏముంది? ఎవరున్నారు?....." ఇలా సాగింది నా ఆలోచనా సరళి. ఇప్పటికి కూడా ఆ ప్రశ్న నా మదిలో సదా మెదులుతూనే ఉంటుంది. చిన్నప్పుడు నేను వ్రాసుకున్న ప్రశ్నలు ఇప్పుడు నేను వేసుకుంటే, జీవితంలో వెనక్కు తిరిగి చూస్తే ఏముంది నా స్కూలు, కాలేజీ, ఆఫీసు అంతే. ఇంతేనా జీవితం, దీని కోసమేనా జీవించడం? మనం బ్రతికినా చచ్చినా, ఈ ప్రపంచానికి ఏమి మార్పు తెస్తుంది? పుట్టలో చెదలాగే కదా మనమూ. సంపాదనా, సంసారమనే గంతలు కళ్ళకు కట్టుకొని జీవిత సత్యాన్ని గ్రహంచలేకుండా ఉన్నాము. కామము, క్రోధము, మోహము, మదము, అసూయ, అహంకారము వగైరా వికారాలు మనలో నివాసం చేసుకొని తిష్ట వేశేశాయి. రోజులు పదహారు సార్లు కోపం, ఇరవై సార్లు బాధ కలుగుతాయి. ప్రతి విషయానికి మనస్సు చలిస్తుంది, ఇంకెక్కడి సంతోషకరమైన జీవితము? జీవితంలో ప్రతి క్షణం ఆత్మానందంలో గడపడమే మనకు కావలసింది. పరిస్థితులు ఎలాంటివైనా కానీ, అవి మన ఆనందం కన్నా ఎక్కువా? ఉన్నది ఒక్క జీవితం, ఆనందంగా ఇప్పుడు కాకుంటే ఎప్పుడు బ్రతుకుతాం? ఇక్కడ బాధలు, నిస్పృహలు ఉండవా అని అడగచ్చు. మొన్నరోజు నేను ఒక విషయమై చింతన చేస్తూ బాధపడుతూంటే మాయమ్మ ఓ మంచి కథ చెప్పింది. ఒక చిలుక చెట్టుకొమ్మను పట్టుకొని, ఇది నన్ను వదలలేదే వదలలేదే అని చింతన చేస్తూ, ఎగరటం ఎలా అని ఆలోచిస్తూందంట. అలా మనిషి నన్ను జీవితంలో ఈ బాధలు, నిస్పృహలు వదలటం లేదే అని చింతన చేస్తాడంట. అవి మనల్ను ఎప్పుడూ వదలవు, మనమే వాటిని వదిలెయ్యాలి. ఒకరిలో/ఒక విషయంలో ఎప్పుడూ మంచినే చూస్తూ వ్యర్థమంతా వదిలేస్తే జీవితమంతా ఆనందమే. అప్పుడే జీవితమంతా ఆనందంగా ఉండగలుగుతాం.

@రాకేశీ
తమ జాతిని సంరక్షించుకొని, పెంపొందించుకోవాలన్న స్పృహే ఈ సృష్టిని నిలబెడుతోంది. మన ఆలోచనా విధానాలు/చర్యలు కూడా ఈ స్పృహ మూలంగానే. ..సందేహం లేదు. కానీ మానవ జాతి ఈ ఆలోచనా స్థాయి / పరిదిని దాటి వేల యేండ్లు కావస్తోంది. అందుకే మిగతా జంతువులు, ఈగల్లా కాక తన జీవితం మరింత విలువైనదని తెలుసుకున్నాడు.
(ఇది మీ సందేహాలకు సమాధానం ఇస్తుందో లేదో నాకు తెలియదు. మీ ప్రశ్న చదువుతూనే, నాలో పొంగినా ఆలోచనా ధారను ఇలా అక్షరాల రూపంలో వొంపేశాను)

- నవీన్ గార్ల
( http://gsnaveen.wordpress.com )
Naveen Garla said…
@netizen:
>> one is filled with when one gives without expecting ABSOLUTELY nothing in return.
శెభాసో..సెభాసు.
"మనం తినింది మట్టి పాలు...వేరే వాళ్ళకు పెట్టింది మన పాలు".

-- నవీన్ గార్ల
( http://gsnaveen.wordpress.com )
జీవితానికి పరమార్థం గురించి నన్నడిగితే ఆనందంగా జీవించడం. ఈ ఆనందం పరిపూర్ణమవడానికి తొలి మెట్టూ, ఆఖరు మెట్టూ సంతృప్తి. కాని మనిషి ఎప్పుడైనా సంతృప్తి పడగలడంటారా? ఎనాడయితే మనం జీవితం సంతృప్తిగా జీవిస్తామో, అనాడు మన జీవితానికి పరమార్థం దొరిఇనట్టే.

Thats why live life as it comes.
మిత్రులందరూ చాలా శ్రమ తీసుకుని చాలా చక్కటి విషయాలు రాశారు. ఇవన్నీ చదివి జీర్ణించుకోడానికి నాకు బాగానే సమయం పడుతుంది. ఇక్కడా, తమ తమ బ్లాగుల్లోనూ దీని మీద చర్చ చేసిన మిత్రులందరికీ కృతజ్ఞతలు విన్నవించుకోవడం తప్ప వేరేం చెప్పలేను ప్రస్తుతానికి.

దీన్ని గురించి ఇంకా రాయదల్చుకున్న వారు, కొత్తవి గానీ, వాదోపవాదాలు గానీ, నిరభ్యంతరంగా రాయొచ్చు. మళ్ళీ వస్తా ఎప్పుడో దీనికి పొడిగింపుతో ముందుకి.
GIREESH K. said…
శ్రీనివాస్ గారు,

ఇంతవరకూ, ఎవరూ దేవుడి ఊసెత్తకపోవడం నాకూ ఆశ్చర్యంగానే ఉంది.

నా అభిప్రాయమేమిటంటే, జీవితాశయానికీ, పరమార్ధానికీ తేడా లేదు. భగవద్విరచితమైన, శాస్త్రపరంగా సమన్వయ లక్షణ భరితమైన ఈ చరాచర జగత్తూ, అందులో ప్రాణులూ, వాటిలో ఉన్నతుడైన మానవుడూ - అన్నీ కలిసి పరిపూర్ణమైన ఈ సృష్టిలో, మన ప్రమేయానికి తావు లేదు. దేవులపల్లి గారన్నట్లు, విశ్వమంతా విభుని ప్రాణమందిరమైన, పిలుపేది, తలపేది? ఈ సత్యాన్ని, మనసా వాచా కర్మణా నమ్మగలిగిన నాడు, ఆచరించగలిగిన నాడు, ఈ జీవితమంతా ఆనందమే! అదే జీవితపరమార్ధం.

ఓ మహానుభావుడన్నట్లు,

ఏదో సాధించడం కాదు జీవిత లక్ష్యం.
నువ్వే భగవంతుడు సాధించినదానికి తార్కాణం!

- గిరీష్
నా మట్టుకి నాకు జీవిత పరమార్థం కేవలం మన జీవితం మనం జీవించడమే కాదు, కనీసం అవసరమైనప్పుడైనా ఇతర్లకు కూడా కొద్దో గొప్పో ఉపయోగపడాలని.

మన పిల్లలు, మన ఇల్లు, కారు, నగలు ఇవి ఎప్పుడైనా ఉంటాయి ! లేకపోతే లేవు! కానీ, మన చేతిలో ఉన్నది..ఒకే ఒక్క జీవితం.! దీనికి ప్రత్యామ్నాయమూ లేదు, ఇంకో చాన్సూ లేదు. జీవిత చరమాంకంలో తీరిగ్గా పడక్కుర్చీలోనో, మంచంలోనో కూచునో, పడుకునో 'జీవితమంతా పిల్లలకోసమో, కుటుంబం కోసమో సంపాదించడానికే అయిపోయింది. నేను బతుకుతున్నానా, జీవిస్తున్నానా' అనే ప్రశ్నించుకునే పరిస్థితి రాకూడదని నేను అనుకుంటున్నా!

జీవితంలో ఒక్కరికైనా సహాయపడె అవకాశం వస్తే, జీవించినట్టే! కేవలం బతికినట్టు కాదు.
ఎదుటి మనిషి పిలుపుకి స్పందించి, సాయం అంధించడానికి చేయి చాచగలిగితే చాలు!
ఆలస్యంగా రాస్తున్నానా? "యస్మిన్ విజ్ఞాతే సర్వ మేవం విజ్ఞాతం భవతి". ఏం తెలుసుకుంటే, తక్కినవన్నీ వాటంతట అవే తెలుస్తాయో అదే ఈ గుప్పిట తెరిచిన ఘడియ (ముమెంట్ ఆఫ్ క్లారిటీ). ఆ ఘడియని ఒడిసి పట్టుకుంటే , జీవిత పరమార్ధం అవగతమవుతుంది.

ఆగిపోయిన గడియారమూ, రోజుకి రెండు సార్లు సరైన సమయాన్ని సూచిస్తుంది. కానీ అది ఎప్పుడొ తెలియదు. సమస్యంతా అదే! ఈ ఘడియలు అనేకానేకాలూ నిత్యమూ వస్తుంటాయి. బాణం దెబ్బకి నేల రాలిన పాల పిట్టా, చెట్టుమీంచి జారి పడ్డ ఆపిలు పండూ, స్నానాల తొట్టెలోని ఉత్ప్లవనమూ మనకెందుకు ముమెంట్స్ ఆఫ్ క్లారిటీ కావు?

ఆ ఘడియకి ముందు ఎంతో అంతర్మధనం అవసరం. అది లేకపోతే, ఏ క్షణమూ, అమృత ఘడియ కాలేదు. ముమెంట్ ఆఫ్ క్లారిటీ కల్ల.

మీ శీర్షిక చాలా ఆలోచింపజేసింది. నమస్తే.
Dr.Pen said…
గురువు గారూ...

నా జీవిత పరమార్థం 'ఇతరులకు కష్టం కలిగించకుండా నా పని నేను చేసుకుపోవడం.సాధ్యమైనంతలో ఇతరులకు సాయం చేయడం.' ఈ జగన్నాటకంలో నా పాత్ర ఎంత వరకూ ఉందో... అంత వరకూ బాగా పోషించి ఓ మంచి మనిషిగా నిష్క్రమించడం.

ఇక 'moment of clarity' అంటారా? నెచ్చెలి కళ్లలో నేరుగా చూస్తూ... అనంతమైన ప్రేమతో...రెండు మనస్సులను అనుసంధానిస్తూ గడిపిన క్షణాలు- నా జీవితంలో నిర్మలమైన,నిష్కల్మషమైన,గాఢమైన,స్పష్టత కలిగిన విలువైన క్షణాలు!
ఇలాంటి ప్రశ్న మెదిలినప్పుడల్లా మేట్రిక్సులో కీమేకర్ గుర్తుకొస్తాడు నాకు..ఇక నేను చెప్పాలనుకున్నది మీకు అర్ధమయ్యే ఉంటుంది మాష్టారూ..
తినటం, తొంగోవటమే జీవితార్ధమైతే చచ్చి భూమాతను బతికించండి బాబులూ..
మూమెంట్ ఆఫ్ క్లారిటీనా..అంత సీను నాక్కలగలేదు, నీ పాటికి నీ పనులు చేస్తూపో, అన్ని గమనిస్తూ ఉండూ..ఎప్పుడో ఒకసారి నీ కళ్ళముందు పరమార్ధం సాక్షాతర్కరిస్తుందనే నా ప్రగాఢ విశ్వాసం..
మాష్టారూ, ఒక మంచి సమస్య ఇచ్చి బ్లాగర్ల మనోమథనానికి దోహదం చేసినందుకు మీకు జోహార్లు. బాలానందం భాషలో జేజేలు.
charcha a^taa chadivaaka iTeevala chadivina oka pustakaanni gurtuchEyaalanipi^cgiDi. chaala ma^di chadivE vu^Taaru. 'The alchemest'. telugulO 'parusavEdi' anE pErutO prachuri^chaaru. evari personal legendnu vaaru kanukkovalisi^dE. ee tapana maaatra^ chaala baagu^di.
Anonymous said…
ముప్ఫైతొమ్మిది కామెంట్ల దగ్గర ఆగిపోవడం చూసి, బాధేసి, రౌండు ఫిగరు చేద్దామని ఈ కామెంటు రాస్తున్నా. ఈ పోస్టుకి వచ్చిన స్పందన అపూర్వం. ఒట్టినే కామెంటు రాయడం ఎందుకు? ఓ సంగతి చెప్తా. జీవిత పరమార్థం, ఆ మాటకొస్తే ఈ యావత్ ప్రపంచానికీ పరమార్థమేంటో కనుక్కోడానికి ఇదివరకు ప్రయత్నం చేశారు. అది కూడా మానవమాత్రుల వల్ల కనుక్కోడం సాధ్యం కాదని ఓ బ్రహ్మాండమైన సూపర్ కంప్యూటర్ ని తయారు చేసి దాన్నడిగారు ఈ ప్రశ్న. అది కొన్ని వందల ఏళ్ళపాటు లెక్కలు వేసి చివరికి సమాధానం చెప్పింది. జీవిత పరమార్థం 42 అని. ఈ సంగతి మీకింకా తెలియకపోతే Hitchhiker's guide to the galaxy చదవండి.
Bolloju Baba said…
సోక్రటిస్ కు తన చరమాంకంలో విషాన్నిచ్చి తాగమన్నప్పుడు ఇలా అంటాడు, ' సమయం వచ్చేసింది, మీరు ఉండటానికి నేను పోవటానికి, ఏది ఉత్తమ మైన మార్గమనేది కాలమే నిర్ణయించాలి ! ' దిమ్మ తిరిగి పోయే సందేహం ఇప్పటికీ ఒక సందేహమే. కాదనగలరా? మాజూవాలజీలో పిల్లలకు మేం చెప్తూంటాం, ప్రతీ జీవికి జివిత పరమార్ధం " టు లివ్ అండ్ లీవ్ ఎ జెనరేషన్ బెహైండ్ " అని. బహుసా అది మానవులకు కూడా వర్తిస్తాది అనుకుంటాను. బహుసా ఇదే అభిప్రాయాన్ని ఎవరో వ్యక్తం చేసారనుకుంటా!

చాలా సమాధానాలను బట్టి మొమెంట్ ఆఫ్ క్లారిటీ, మన జీవితంలోని కలలన్నీ మసకబారినపుడు, ఆశలన్నీ కూలినప్పుడు, మనసు ఒంటరి అయిపోయినపుడు ఒక ఫ్లాష్ లాగ ఒస్తుంది. కానీ జీవన సమరంలో దాని ప్రభావం తాత్కాలికమే!

బొల్లోజు బాబా
http://sahitheeyanam.blogspot.com/
Ramani Rao said…
మళ్ళీ మీ జీవిత పరమార్ధం టపా వెతుక్కొంటూ వస్తానని నేను అనుకోలేదు నిన్నటిదాక. కాని నిన్ననే ఈ పదం విన్నాను. జీవిత పరమార్ధం అంటు అసలు మనిషి ఎందుకు ఆలోచిస్తాడు? అని నిన్న ఓ ప్రముఖవ్యక్తి, ప్రశ్నిస్తే ఠక్కున గుర్తొచ్చింది మీ టపా. ఇది నిజమో కాదో నాకు తెలీదు కాని, విన్న తరువాత నాకు అ(క)నిపించిన విషయం:
"జీవితానికి అర్ధం, పరమార్ధం ఏవో ఉంటాయి అనుకొంటాము కాని అవేమి లేవు, ఇలా ఈ కాల చక్రం కొనసాగాల్సిందే. స్వతంత్ర దేశంలో పుట్టుక, చావు రెండు పెళ్ళి లా వేడుక చేసుకొవాల్సిందే. ఈ శరీరం నిమిత్తమాత్రం. ప్రాణం నిజం. ప్రాణం తానే ఓ శరీరాన్ని వెతుక్కొంటూ మన దగ్గరికి వచ్చింది. నిజానికి ఇదంతా మాయట. అంటే ఇంకా విపులంగా చెప్పాలంటే ఉల్లిపాయ పొర లాంటిది ఈ జీవితం. ఏదో ఉందంకొని బతికేస్తాము కాని, ఏమి వుండదు, ఉల్లిపాయ ఒక్కో పొర తీస్తూ పోతు ఉంటే లోపల ఏదో ఉంటుందేమో అనుకొంటాము, కాని చివరిదాక ఆ పొరలే మనకి దర్శనమిస్తాయి, జీవితం కూడా అంతేనట. చివరి (పొర) దాక ఏమి కనిపించంది ఈ జీవితం. మరి ఇది నిజమేనా?
@రమణి - దీన్నే మెట్ట వేదాంతం అంటారు. :-)
అన్నమైతే నేమిరా, సున్నమైతే నేమిరా
ఎందుకైనా పాడు పొట్టకు అన్నమే వేదామురా అని..
వెధవ అశాశ్వత శరీరమే .. అయినా పట్టు కాషాయవస్త్రాలూ, మెత్తటి ఫోం పరుపులో, ఏసీ వాతావరణమూ కోరుతుంది. మాయ కాకపోతే ఇంకేవిటి?

అది సరే, పోనీండి .. ఇంతకీ ఆ ప్రముఖ వ్యక్తెవరు? ఇంకా ఏమన్నారు? అవి విని మీకు ఇంకా ఏ ఆలోచనలు కలిగాయి? ఏకంగా ఓ టపా వేసెయ్యకూడదూ?
GIREESH K. said…
కొత్తపాళీ గారు, మీ అభినందనకు కృతజ్ఞతలు!

దాదాపు రెణ్ణెళ్ళ క్రితం, మీరు లేవదీసిన ఆ చర్చలో నేనుకూడా పాలుపంచుకున్నాను. ఆ తరువాత, ఆ ప్రేరణతోనే ఏప్రిల్ నెల చివర్లో "సత్యం.. శివం..సుందరం" అన్న రెండుభాగాల కథ వ్రాసాను. దయచేసి గమనిచగలరు.

ఈ విషయాలు, అర్ధమయినట్లే ఉంటాయి. మనసులో బలంగా నాటుకున్నాయీ అన్న నమ్మకం కలుగుతుంది. కానీ, అంతలోనే తేలిగ్గా అంతా మరచిపోతాము. ఈ విషయాలను మళ్ళీ మళ్ళీ పునఃశ్చరణ చేసుకోవడంద్వారా, సృష్టి మర్మాలపైనుంచి మన దృష్టి మరలకుండా ఉంచుకోవచ్చు. ఆ ప్రయత్నమే ఈ టపా.

As an English poet said, "If the doors of perception were cleansed, everything would appear to man as it is - infinite".

So let us cleans our doors of perception. Understand. Accept. And Transcend.

మీ స్పందనకు కృతజ్ఞతలు!

- గిరీష్
rākeśvara said…
నేనే మొదలు పెట్టాను కాబట్టి నేనే ముగిస్తాను.

౧) సత్యదర్శనం (moment of clarity) అయినవారు, దానిని వివరింపగానేరరు.
౨) వారు బ్లాగులు చదివేవారయివుండరు సహజంగా. చదివి చర్చించేవారయివుండరు.

మనలాంటి వారికి మహా అయితే, కాస్త స్పష్టత కలిగించే అనుభవాలు ఎదురయివుంటాయి జీవితాన. అంతే. ఒక క్రొత్త ఆశ, జీవితం మీద నాసక్తీ కలిగించ గలిగే క్షణాలు తటస్థించిన అదే మహాభాగ్యము.
రాకేశ, అందుకే నువ్వు రాకు! :)