ముఖ్య గమనిక .. ఏప్రిల్ 1 న ప్రచురిస్తున్నాను కాబట్టి ఇదేదో తమాషా టపా అనుకునేరు. కాదు, కాదు .. యమా సీరియస్ పోస్టు!
మనం ఇంకోళ్ళకి సహాయం చెయ్యాలి అని అనుకోవడమే గొప్ప విషయం.
అరే, మనం చెయ్యగలిగినంత చెయ్య లేకపోతున్నామే, సహాయం అవసరమైన వారికి, వారు కోరినంతనే సహాయం అందజెయ్యాలి మనం అందుబాటులో లేకపోయినా అని తపన పడటం ఇంకా గొప్ప విషయం.
మొదటి సూత్రాన్ని నమ్మి పని చేసే వాళ్ళు చాలా మందే ఉంటారు గానీ, రెండో సూత్రాన్ని మనస్ఫూర్తిగా నమ్మి ఆచరణలోకి పెట్ట గలవాళ్ళు బహు కొద్దిమంది.
ఆ బహు కొద్దిమందిలో విశిష్ఠమైన వాడు మన కంప్యూటర్ ఎరా సంపాదకుడు నల్లమోతు శ్రీధర్.
కంప్యూటర్ ఎరా తెలుగు మాస పత్రిక ద్వారానూ, తన సాంకేతికాల బ్లాగు ద్వారానూ తెలుగు కంప్యూటర్ వాడుక దారులకి అందిస్తున్న సేవలతో తృప్తి పడక కొంత కాలం క్రితం చాట్ సహాయ కార్యక్రమం మొదలు పెట్టాడు శ్రీధర్.
ఆ చాట్ గదిలో http://computerera.co.in/chat/ద్వారా ప్రవేశించ వచ్చు.
కంప్యూటర్ ఎరా తెలుగు మాస పత్రిక సంపాదకుడిగా పత్రికలో తన వ్యక్తిగత మొబైల్ నెంబరు ఇచ్చి, ఎప్పుడు మీకు ఏ సందేహం వచ్చినా నన్ను పిలవచ్చు అని ప్రకటించిన సేవా నిరతి శ్రీధర్‌ది. ఐతే రోజుకి యాభై అరవై కాల్స్ వచ్చేవి. తన పనులు చేసుకోడానికి అడ్డం వచ్చేవి. ఇంతలో అనారోగ్యం వచ్చి ఆ మాత్రం సహాయం కూడా చెయ్యలేని పరిస్థ్తితి ఏర్పడింది. ఇదిలా ఉండగా, శ్రీధర్ పట్టుదలనీ, సేవాగుణాన్నీ చూసి ప్రభావితులైన నిపుణులు కొందరు మేమూ సహాయం చేస్తామని ముందుకొచ్చారు. ఎలా వీటన్నిటినీ సమన్వయ పరచడమా అని అబ్బుర పడుతున్న తరుణంలో ..
.. కూడలికి అనుబంధంగా వీవెన్ గారు కూడలి కబుర్లు మొదలు పెట్టారు, బ్లాగర్లు ఒక చోట చేరి కబుర్లు చెప్పుకోడానికి. అక్కణ్ణించే చాట్ గది ద్వారా అవసరమైన వారికి సహాయం అందించవచ్చుననే నిర్ణయం స్థిరపడింది. మొదట 2007 డిసెంబరు 26 న వీవెన్ సౌజన్యంతో కూడలి కబుర్లకి అనుబంధంగానే కంప్యూటర్ ఎరా చాట్ గది కొన్నాళ్ళు నడిచింది. అనతి కాలంలోనే దీనికి డిమాండ్, ట్రాఫిక్ రెండూ పెరిగి పైన ఇచ్చిన సొంత గూటికి మకాం మార్చారు.
సగటున రోజుకి 30 - 35 మంది ఈ చాట్ గదిని దర్శించి అనేక సాంకేతిక విషయాల్లో సహాయం పొందుతున్నారు. రోజులోని 24 గంటల్లో ఎవరో ఒకరు చాట్ గదిని కనిపెట్టుకుని ఉండి, కోరిన వారికి సహాయం అందించే విధంగా సుమారు 25 మంది ఔత్సాహిక నిపుణుల బృందం తయారైంది. ఈనాడు లో వ్యాసం వచ్చిన ఒక వారం రోజుల పాటైతే .. కంప్యూటర్లో తెలుగు రాయడానికి సాయం చేయండంటూ వెల్లువెత్తారట! అన్నట్టు ఒక ప్రముఖ మహిళాబ్లాగర్ కూడా ఈ బృందంలో యధోచిత సేవలందిస్తున్నారు, ఎవరో చెప్పుకోండి చూద్దాం?
శ్రీధర్ మాటల్లోనే .. "ఒక్కొకరిలో ఒక్కో టాలెంట్ ఉంటుంది కదా అందరి టాలెంట్ అందరికీ ఉపయోగపడేలా ఏదైనా ప్రాజెక్ట్ ప్రారంభిస్తే బాగుంటుంది ఎటూ నేను ఒక్కడినే అందరికీ ఫోన్ లో డౌట్లు క్లారిఫై చెయ్యలేకపోతున్నాను కదా అందరూ అందరికీ హెల్ప్ చేసుకుంటే దీనిని చూసి మరింత మంచి దీనిలో భాగస్వాములు అవుతారని భావించి దీనిని ప్రారంభించడం జరిగింది."
ఇంతకు మునుపెన్నడూ చాట్ గదుల అనుభవం లేని కొత్త వారు వస్తే, వారిని మర్యాదగా ఆహ్వానించడం, ఈ చాట్ ద్వారా వారికి ఎటువంటి సహాయం అందుతుందో అర్ధమయ్యేట్టు వివరించడం, తరచూ అడిగే ప్రశ్నలకి ముందే చక్కటి జవాబులు సిద్ధం చేసుకుని తెరపట్టులతో సహా అందుబాటులో ఉంచుకుని అడగంగానే సమాధానాలివ్వడం - ఈ విషయాల్లో సభ్యులందరూ తర్ఫీదు పొంది ఉన్నారు. చాట్ కదా అని అక్కడ పోచికోలు కబుర్లకి స్థానం లేదు. అంతా పకడ్బందీగా ఒక ఎఫిషియెంట్ ప్రొఫెషనల్ వాతావరణంలో జరుగుతుంది. పెద్ద పెద్ద కంపెనీల కస్టమర్ సర్వీసు కూడా ఈ స్థాయిలో పని చెయ్యడం లేదని నేను ఘంటాపథంగా చెప్పగలను. డబ్బుకి చేసే సేవకీ, మనసు తృప్తికి చేసే సేవకీ అదే తేడా!
ప్రస్తుతానికి బృందంలో సభ్యులందరూ తమ బ్లాగుల్లో దీని లంకె ఇవ్వడం, తమకి సభ్యత్వం ఉన్న యాహూ, గూగుల్ గుంపుల్లో దీన్ని గురించి మాట్లాడడం ద్వారా ప్రాచుర్యం కల్పిస్తున్నారు. త్వరలో స్థానిక సాంకేతిక కళాశాలల్లో చిన్న చిన్న సెమినార్లు నిర్వహించి సహాయం పొందడానికి గానీ అందించడానికి గానీ యువత పాత్ర పెంచాలని శ్రీధర్ ముందు చూపుని మనసారా అభినందిస్తున్నాను. పనిలో పనిగా శ్రీధర్ సంకల్పానికి పుష్టి కూర్చి ఈ సేవాయజ్ఞం నిరాఘాటంగా కొనసాగటానికి కంకణం కట్టుకున్న బృంద సభ్యులందర్నీ కూడా పేరు పేరునా ప్రశంసిస్తున్నాను.
ఈ ప్రయత్నం ఇంతింతై వటుడింతయై అన్నట్లు యెదిగి మరిన్ని విజయాలకి సోపాన మార్గం కావాలని అభిలషిస్తున్నాను.

Comments
ఈ చాట్ రూమ్ వలన ఎంతో మంది లబ్ది పొందారు ఇప్పటికే. ఇక ముందు కూడా ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. మహిళా బ్లాగర్ ఇంక ఎవరు సార్ జ్యోతి వలబోజుగారు కాకుండా.
ధన్యవాదములు.
జాహ్నవి
కొత్తపాళీ గారు మీరు వ్రాసిన ప్రతిమాటా అక్షరసత్యం. ధన్యవాదాలు.
ఆయనకుండే ఇతరులకు సహాయపడాలనే తపన ఎంతో మెచ్చుకోదగింది.
మీ నోట మా మాట వినడం చాలా చాలా సంతోషాన్ని కలిగించింది
ధన్యవాదాలు సర్
Gopal - It's my pleasure
- నల్లమోతు శ్రీధర్
ఈ చాట్ రూమ్ గురించి మీరు సమగ్రమైన పోస్టు రాయడం చాలా సంతోషం. మరి నాకేంటి అంత పెద్ద బిరుదులు ఇస్తున్నారు. ఒకప్పుడూ నాకు అలా సహాయం చేసినవారే మన తోటీ బ్లాగర్లు. ఇప్పుడు నేను అదే పని చేస్తున్నా. ఇది అంత కష్టమైన పనేమీ కాదు. మన పని చేసుకుంటూనే ఇంకొకరికి మనకు తెలిసింది చెప్పొచ్చు. కాని ఈ చాట్ రూమ్ గురించి ఇంకా ఎక్కువమందికి తెలియాలి. పిసి యూజర్లందరూ దీనిని ఉపయోగించుకోవాలి. తాము కూడా ఇతరులకు సహాయం చేయాలి. అప్పుడే దాని ఉద్దేశ్యం నెరవేరుతుంది..