అనుకోని అతిథులు

ఈ మధ్య మా కార్యాలయానికి అనుకోని అతిథులు వచ్చారు.
నాలుక్కాళ్ళ మీద నడుస్తూ ఇదే వయ్యారమన్నారు.
అదేమంటే కళ్ళింతంత చేసుకుని చూశారు.
ఆతిధ్యం స్వీకరించమని అర్ధిస్తే పచ్చగడ్డే పదివేలు, చాలు పొమ్మన్నారు.


నేను పని చేసే ఫేనుక్ రొబాటిక్స్ సంస్థ వ్యవస్థాపకులకి ప్రకృతి ఆరాధన అంటే చాలా ఇష్టమట. జపాన్ లో వారి ప్రధాన కార్యాలయం ఫ్యూజీ పర్వత పాదతలం దగ్గర ఉంటుంది. చాలా కిటికీల్లోంచి పర్వతం కనిపిస్తూ ఉంటుందిట. ప్రపంచ వ్యాప్తంగా వారి కార్యాలయాలన్నీ ప్రకృతికి దగ్గరగా, ఆహ్లాదకరమైన ప్రదేశాల్లో నిర్మించాలని వారి ఆదేశమట.

మా కార్యాలయ భవనం, పైనుంచి చూస్తే అర్ధచంద్రాకృతిలో ఉంటుంది. ముందు నుంచి చూస్తే మామూలు ఆఫీసు భవనం లాగానే ఉంటుండి. లోపలికి ప్రవేశించాక అర్ధచంద్రాకృతి వెంబడి సుమారు ఐదొందల గజాల పొడవున సాగే నడవా .. అవతలి పక్క గోడకి బదులు నిలువెత్తు అద్దాలు నడవా పొడుగునా .. ఆ అద్దాల్లోంచి కనపడే ఒక సన్నటి సెలయేరు, ఒక బుల్లి అడవి. ఆ అడవి లోంచి లేళ్ళు మా కంపెనీ లాన్‌లో గడ్డి నమలడానికి అప్పుడప్పుడూ వస్తూ ఉంటాయి. ఒకసారి నేను కొంత దూరం నించి ఎర్రనక్క (red fox) నొకదాన్ని కూడా చూశాను.

Comments

ramya said…
అదృష్టవంతులు
Anonymous said…
ఆహ్లాదం కలిగించే అతిధులు వీరు. చెన్నై I.I.T.Campus లోకి కూడా అప్పుడప్పుడు ఇలాంటి అతిధులు వస్తుంటారు.ప్రకృతిలో భాగమై కలిసి పనిచేయటం ఒక అదృష్టమే, ఈ నాగరిక జీవనం లో.
Anonymous said…
మాకు ఇక్కడ న్యూజెర్సీలో జింకలు విపరీతం. వాహనాల క్రింద పడి తరచుగా చనిపోతూ ఉంటాయి. న్యూజెర్సీ కూడా, భ్రష్ట రాజకీయాల మూలంగా దాదాపు దివాలా తీసే స్థాయిలో ఉంది. ఈ చనిపోయిన జీవాలని రోడ్డుపై నుంచి తొలగించటానికి డబ్బు ఖర్చు చేసే స్థితిలో కూడా లేదు (it's true) . దానితో ఈ జీవాలు పంచభూతాల్లో కలిసేదాకా, రోజూ పనికి వెళుతూ చూడాల్సి వస్తుంది.

రావు గారూ,

ఇండియాలో ఈ జీవాల్ని చూడగలగటం అదృష్టమే.
Anonymous said…
భలే అదృష్టవంతులు.

మాకైతే ఇంటి పక్కలకు కుందేళ్ళు వస్తాయి. పది అడుగుల దగ్గరికి వెళ్ళేవరకు రారమ్మని వూరిస్తాయి, ఆ తర్వాత చెంగున దూకి పారిపోతాయి.

ఈ ఏడాది మేరీలాండ్‌లో జింకల జనాభా అధికం అయిందని పరిమిత వేటకు అనుమతి ఇచ్చారు. ప్రతి జీవి మనుగడా మనిషి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాల్సిన రోజు అంతరించేదెన్నడో!

--ప్రసాద్
http://blog.charasala.com
మా విశాఖపట్నం లో వచ్చే మిత్రులను చూ సేందుకు 17 లక్షల నగరప్రజానీకానికి ధయి ర్యాలు చాలట్లేదు ఎందుకంటే చిరుతపులులను ఎవరు దగ్గరకు వెళ్ళి చూస్తారు టీవి 9 వాళ్ళతో సహా!
Anonymous said…
మా దేశంలో అయితే వాటిని ఆక్రమించెయ్యమూ? లేకపోయే ఏదో విందులో స్టార్ట్రర్ ముక్కలు క్రింద కర్సయిపోవూ?

మాకు కుక్కలే బెటర్. మేము వాటిని తినము, అవి చూడటానికి అందంగా వుండవు. మంచి ఎకో వ్యవస్థ.

మేరా భారత్ మహాన్.
అవి దూరంగా చూట్టానికి అందంగా ఉంటాయి..నాకు రాత్రిపూట అవంటే చాలా భయం. రాత్రిపూట ఎక్కడ గబుక్కున కారుమీదికి దూకుతాయో అని బిక్కుబిక్కుమని నడపాల్సివస్తుంది. నా కారుకొకటి గ్యారీ, ఇండియానాలో తగిలింది.
అందరూ అనుకున్నట్టు అవేమి అంతరించిపోవట్లేదు బాబు.
దయచేసి మనుషుల ప్రాణాలు ఫణంగా పెట్టి జింకల సంరక్షణా ఉద్యమాలు లేవనెత్తకండి.
ఈ లింకు చూడండి మీకే స్పష్టంగా అర్ధం అవుతుంది.
http://dev.smm.org/buzz/buzz_tags/minnesota?page=4
Anonymous said…
ఓసోస్ అంతేనా మా కయితే తోడేళ్ళు, నక్కలు కూడా తోడుంటాయి రాత్రయితే. అదృష్టం వుండాలే గానే ఎలుగుబంట్లు కూడా హలో చెబుతాయి ఇంటి వెనకాల కొచ్చి.

అదేం ప్రేమొ గానీ కార్ నడుపుతుంటే "డక్ క్రాసింగ్" "డీర్ క్రాసింగ్ " అని బోర్డు పెట్టి వాహనమును నిదానముగా నడుపుము లేనిచో నీకు చీటీ ముక్క ఇచ్చెదము అని బెదిరింపొకటి.

ఇక కుందేళ్ళయితే మా డెక్ మీదున్న హాట్ టబ్ మీద కెక్కి "హ్యాపీ డేస్ ..హ్యాప్పీ డేస్ " అని పాటలు పాడుకుంటుంటాయి.

-- విహారి
oremuna said…
విహారీ,

మేము కుళ్ళుకుంటున్నాము ఇక్కడ :)
ramya said…
మీ ప్రకృతి జీవనాన్ని చూసి నాకైతే అసూయగా ఉంది ,ఇండియాలో జతువుల్ని చూడాలంటే జూ కి వెళ్లాల్సిందే అవీ బక్క చిక్కి ఏదో బతుకుతూ వుంటాయి. అడవికెళ్లినా ఏవీ కనిపించవు ఇక్కడ.
సిటీ రోడ్ల పైన కాగితాలు తినే ఆవులుంటాయి,కరిచే కుక్కలుంటాయి.
Anonymous said…
మీ అదృష్టానికి మనఃస్పూర్తిగా అసూయ చెందుతున్నాము. మాకిక్కడ గుజరాత్ లో, చాకిరి చేసే అభాగ్య గాడిదలే ఎక్కువ(మనుషుల్లో కాదండోయ్). కొండొకచో నెమళ్ళు. ప్రకృతిలో మమేకమైపోయి పని చేయాలన్న మీ సంస్థ అధినేత రుచి గొప్పది.
rākeśvara said…
మీ కంపెనీలాంటి నెచర్ పాలసీలు వున్న కంపెనీ దొరుకుతుందేమో నని ఇన్నాళ్లూ చూసా.. నాకు దొరికేయల్లా బెంగుళూరు మహాత్మాగాంధీ రస్తా వంటివే...

అన్నట్లు నేను అమెరికాలో మొట్టమొదటి సారి తోలినప్పుడు, అనగా నా DL test కి జింక ఎదురువచ్చింది. ఇంకేంటి మంచి శకునం, అమెరికా అంతా మనదే.. రెండేళ్లలో మొత్తం చూసేస్తా అనుకున్నా...

తరువాత తెలిసింది అనుభవపూర్వకంగా జింకలు మంచి శకునాలు కావని :)