ఒక పక్కన "ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కు పోయాను" అనిపిస్తోంది ..
మరొక పక్కన "కుల్లాయుంచితి కోటు తొడిగితి .. పుల్లని సూపుఁ ద్రావితిన్ .. తల్లీ కేనడ రాజ్యలక్ష్మీ దయలేదా నేను శ్రీనాథుడన్!" అనిపిస్తోంది.
ఏంటంటే అంతా అమెరికావోడి మాయ!
మంగళారం నాడు టింగురంగా మంటూ బయల్దేరి కెనడా రాజధాని ఆటవా నగరానికి వచ్చాను వీసా పొడిగింపు కోసం. ఆ రోజు పొద్దున మన బ్లాగ్మిత్రులు కొందరు చాట్లో విష్యూఆల్దబెస్ట్లూ, గుడ్లక్కులూ అన్నీ చెప్పారు కూడా. ఆటవా చేరి ఆడుతూపాడుతూ హోటలు గదిలో బేగు పడేసి, బేంకుకెళ్ళి కట్టాల్సిన వీసా రుసుము చెల్లించి ఇంక హాయిగా హోటలు గదిలో వెచ్చగా కూర్చుని కూడలి కబుర్లలో చేరి మిత్రులతో జాలీగా గడిపేశాను.
బుధవారం పొద్దున్నే ఎనిమిదిన్నరకి వీసా ఎపాయింట్‌మెంటు. నిన్నంతా కురుస్తున్న మంచు వాన ఆగి పోయి బయట నీలాకాశంలో సూర్యుడు చిర్నవ్వులు చిందిస్తున్నాడు. ఆహా, ఎంత శుభదినం అనుకుని బయల్దేరి ఎంబస్సీ చేరుకున్నాను. అమెరికను ప్రభుత్వపు భద్రత పిచ్చి తెలిసిందే కాబట్టి సెక్యూరిటీ వేధింపులకి వెరవక లోపలికి పోయాను. కూచున్నాను. ఒక పది నిమిషాల్లో పేరు పిలిచారు. కిటికీలోంచి ఒక తెల్లభామ పళ్ళికిలిస్తూ నా ఉద్యోగ వివరాలు, కంపెనీ వివరాలు అన్నీ ఊసులాడుతున్నట్టుగా కనుక్కుని ఒక చీటీ చేతులో పెట్టి వచ్చే మంగళారం నాడు తిరిగొచ్చి పాస్‌పోర్టు తీసుకెళ్ళమంది.
బట్ .. బట్ .. వెయిటెమినిట్ .. బట్ ..
మీరు రేపటికల్లా నా పాస్‌పోర్టు .. వీసాతో సహా ఇచ్చేసెయ్యాలి. నా తిరుగు విమానం రేపే. వారం రోజుల పాటు .. నేను .. పని మానుకుని .. కుటుంబాన్ని వదిలి .. ఓకే, వుయ్ విల్ సీయూ ఆన్ ట్యూస్డే! ఎంజాయ్ యువర్ స్టే ఇన్ ఆటవా .. ఇట్సె బ్యూటిఫుల్ సిటీ.
అలా ఆటవాకి బందీనయ్యాను.
బయట అడుగుపెడీతే కొరికెయ్యటానికి కాచుకునున్న చలిని తప్పించుకోవటానికి కుళ్ళా లాంటి టోపీ కొని ధరించాను.
నా మిషిగను కోటునే ఇంకొంచెం గట్టిగా బిగించాను.
మూడు రోజులనుకున్న ప్రయాణం వారం రోజులయ్యేప్పటికి పుల్లటి ఇటాలియన్ సూపుతో నిన్న రాత్రి భోజనం సరిపెట్టాను.
కెనడా రాజ్యలక్ష్మికి ఎప్పుడు దయగలిగి బంధ విముక్తుణ్ణి చేస్తుందో!
తా.క. నా గోల సరేగానీ ఈ ఆదిబాబు గారి సంగతేంటో చూడండి, ఈ తెలుగు పాటల్ని గుర్తు పట్టగలరా అని సవాలు చేస్తున్నారు!

Comments
కొత్తో వింత పాతో రోత అన్నారుగా.
నాకక్కడ ఇస్తున్న ఉద్యోగం పెంటగానీ, లేక పోతే నేను హాకీ దేశానికి నిరభ్యరంతంగా ఎగిరి పోయేవాడిని.
నేను టరాంటో రెండు రోజులున్నా... ఎక్కువగా కారులో తిరగడమే. అది మార్చిలెండి. మంచు కుఱవట్లేదు కానీ నేల మీద వుంది.
మంచిగా కారూ, జీపీఎస్సు గైకొని, I tool the long long way from waterloo to Toronto.
మీరు కూడా ఆట్టావా నుండి మాంట్రియల్ వగైరా చూసి రావచ్చు.
అలానే రేపు ఒక సెనేటర్స్ vs. మా త్రాషర్స్ ఆట ఒకటుంది. నా కళ్లు పెట్టుకుని మీరు చూసి, ఒకటి రెండు ఫోటోలు తీసుకొని వస్తే .. ఈ బడుగు జీవికి సంతోషం కలిగించినవారౌతారు.
అశ్విన్ .. కొత్త వింత కొంతవరకూ బానే ఉంటుంది గానీ ..
రాకేశ్వర .. అందుకే అనుకున్నా, నువ్వు కనక పక్కన ఉండుంటే బహు తమాషాగా ఉండేదని. నేను హాకీ గేముకి ఫ్రీగా తీసుకెళ్ళినా వెళ్ళను! ఇక మంచు బొమ్మలు కావాలంటే .. వస్తున్నాయి
పానకంలో పుడక:
రాకేశ్వరుని మాటలు చూస్తే గుర్తొచ్చింది - గడచిన శుక్రవారం రాత్రి డాలస్ వెళ్లాను. అక్కడ చదువుకొంటున్న మిత్రబృందంతో శనాదివారాలు గడిపి వచ్చాను. వాళ్ల జీవనశైలికీ, నేరుగా ఉద్యోగాలకోసం ఇక్కడికొచ్చేవారి జీవనశైలికీ చాలా తేడా.