గాలిపటాల వేటగాడు

"నాకు ధైర్యం లేదు. చొరవా, తెగింపూ, సాహసమూ నాకు దూరం. నన్నెవరూ చికాకు పెట్టకుండా ఉంటే నా బతుకేదో నేను సంతోషంగా బతికేస్తాను" అనుకుంటాడొక అమాయకుడు. ఒక సాధారణ జీవి. కానీ అతనిక్కూడా ఏదో ఒక ఆమోదం కావాలి. ఎవరిస్తారు ఆ ఆమోదం? ఎవరూ ఇవ్వరు, ఆఖరికి కన్న తండ్రి కూడా. నా మానాన్న నన్నొదిలెయ్యండి అంటే ఈ దుష్ట ప్రపంచం ఊరుకోదు. నీకు అలవాటైన నీ జీవితాన్ని నీ రక్షణ వలయాన్ని అతలాకుతలం చేస్తుంది. నీ దేశాన్ని చిన్నాభిన్నం చేస్తుంది. నిన్ను ఖండాతరాలకి తరుముతుంది, నీ వాళ్ళని నరక హింసలు పెడుతుంది. అప్పటికీ నిన్నొదలదు. ఇంకా నా బతుకేదో నేను బతుకుతానంటావా? ఊరుకుంటావా?

తనలో తనకే నమ్మకం లేక, ఆమోదం కోసం ఎవరెవరి దగ్గరో వెతుక్కుని వెతుక్కుని, ఆ వెతుకులాటలో తనకి విలువైన వాటినెన్నిటినో వదులుకుని, తనకి నిజంగా అమూల్యమైనది తన మూలాల్లోనే ఉన్నదని గ్రహించి, దాన్ని కాపాడుకోవడానికి తనలోని ధైర్యసాహసాల్ని చివరికి గుర్తించి, ఫలితంగా తనని తాను ఆమోదించుకో గలిగిన ఒక (అ)సాధారణ వ్యక్తి కథ - ది కైట్ రన్నర్, రచయిత ఖాలెద్ హుసేని మొదటి నవల.

కాబూల్లో తన తండ్రితో పెరుగుతున్న పది పన్నెండేళ్ళ అమీర్ తన కథ చెబుతున్నాడు. తల్లి అతనికి జన్మనిస్తూ ప్రసవంలో చనిపోయింది. తండ్రి నిలువెత్తు మనిషి .. అచ్చమైన పఠాన్. సమర్ధుడైన వ్యాపారవేత్త. డబ్బుకి కొదవ లేదు. కాబూల్లోకెల్లా మిక్కిలి గౌరవప్రదమైన పేటలో, చక్కటి భవంతిలో ఉంటారు వాళ్ళు. ఇంటి పనులు చూసుకోవడానికి అలీ అనబడే ఒక అవిటి పనివాడు, అతని కొడుకు హసన్. హసన్ అమీర్ కంటే ఒకటి రెండేళ్ళు చిన్నవాడు. హసన్‌కి కూడా తల్లి లేదు - ఇతరుల వద్ద ముభావంగా ఉండే అమీర్‌కి హసన్ ఒక్కడే ప్రాణ స్నేహితుడు. ఇక హసన్‌కి అమీర్ అంటే అదేం ఆరాధనో చెప్పలేమన్న మాట. చలికాలంలో జరిగే గాలిపటాల పోటీల్లో గాలిపటాల యుద్ధం చెయ్యడం ఇద్దరికీ ఇష్టం. తెగిన గాలిపటాల్ని పట్టుకోవటంలో హసన్‌కి ఒక అతీంద్రియ శక్తిలాంటిదేదో ఉంటుంది. అదే నవల పేరుకి ఆధారం. తన తండ్రికి తనని చూస్తే తృప్తిగా లేదని అమీర్‌కి అనుమానం. ఎట్లాగైనా తండ్రి ప్రేమ సంపాయించాలని ఆత్రుత పడిపోతుంటాడు. ఒక గాలిపటాల పోటీలో అమీర్ గెలుస్తాడు. చీకటి పడుతున్న సమయంలో తనకి పోటీగా నిలిచిన చివరి గాలిపటాన్ని అతడు తెంపేశాక ఆ తెగిన పటాన్ని పట్టుకోడానికి హసన్ ఒంటరిగా పరిగెత్తుకెళతాడు. ఎంతకీ హసన్ రాకపోతే వెతుక్కుంటూ వెళ్ళిన అమీర్ కళ్ళముందే ఒక ఘాతుకం జరిగిపోతుంది. ఆ తరవాతి రోజుల్లో హసన్ మామూలుగానే ఉన్నట్టున్నా అమీర్ ఆ సంఘటన నించి కోలుకోలేక పోతాడు. ఇంట్లో హసన్ ఉనికి తన బలహీనతని ఎత్తి చూపుతున్నట్లుంటే అమీర్ జీవితం దుర్భరమైపోతుంది.

సోవియట్ ఆక్రమణ జరుగుతుండగా అమీర్ తండ్రితో సహా తప్పించుకుని అమెరికా వలస వచ్చేస్తాడు. అక్కడ కాందిశీకులైన తోటి ఆఫ్ఘనుల మధ్యన తన జీవితానికి ఒక కొత్త అర్ధం నిర్మించుకునే ప్రయత్నంలో రచయితగా ఎదుగుతాడు అమీర్. తండ్రి చని పోతాడు. ఇంకేంఉంది, నా జీవితం ఇలా నిశ్చలంగా సాగిపోతుంది అని అతను అనుకుంటుండగా పాకిస్తాన్నించి వచ్చిన ఒక ఉత్తరం అతని నిశ్చల జీవితాన్ని అతలాకుతలం చేస్తుంది. తన జీవితానికి నిజమైన అర్ధం తెలుసుకునే ప్రయాణం మొదలవుతుంది.

గత ముప్ఫయ్యేళ్ళ ఆఫ్ఘనిస్తాన్ చరిత్ర నేపథ్యంగా ఒక వ్యక్తి జీవన పయనాన్ని సమర్ధవంతంగా కథానాయకుడి నోటనే చెప్పించారు రచయిత. ఆఫ్ఘనిస్తాన్లో నిజంగా జరిగిన రాజకీయ సామాజిక పరిణామాలు నవలలో మనకి కనబడవు. వాటి మీద విశ్లేషణ, చర్చ అంతకంటే లేవు. ఎందుకంటే కథ చెప్పే అమీర్ కథ మొదలయ్యేప్పటికి (1975లో) పన్నెండేళ్ళ వాడు. అప్పుడు జరిగిన రాజకీయ తిరుగుబాటు పర్యవసానం అతనికి అర్ధమయ్యే వయసు కాదు. అటు రెండేళ్ళ తరవాత సోవియట్ ఆక్రమణ జరుగుతుండగా తండ్రితో సహా అమెరికాకి వలస వచ్చేస్తాడు. అంచేత అమీర్ దృష్టి ఒక ప్రవాసీ దృష్టి. సమకాలీన రాజకీయ పర్యవసానాల మీద వ్యాఖ్యానించాలనే దురదని బలంగా తొక్కి పట్టి, నవల ఆద్యంతమూ ఆ దృష్టి చెడకుండా కథనం సాగింది. అలా చూస్తే ఇదొక loss of innocence కథ, ఒక coming of age in an age of cruelty కథ, వెరసి ఒక discovering the self కథ.

రచయిత ఖాలెద్ హుసేని ఈ నవల ముఖ్యపాత్ర లాగానే ఒక ఉన్నత్ ఆఫ్ఘను వంశంలో పుట్టి చిన్న వయసులోనే తన కుటుంబంతో రాజకీయ రక్షణ కింద అమెరికాకి వలసవచ్చారు. వృత్తిరీత్యా వైద్యులు. ఈ నవల 38 దేశాల్లో వివిధ భాషల్లో ప్రచురితమైనదట! సినిమా కూడా తీశారు - ఈ సంవత్సరం చివర్లో వెలువడనుంది. వీరి రెండవ నవల ఈ మధ్యనే ప్రచురితమైంది.

Comments

Giri said…
ఈ పుస్తకం మొన్నే లైబ్రరీలోంచి తెచ్చి ఇంట్లో పెట్టాను..ఇంకా తెరవలేదు, డాషియల్ హామెట్ వి ఓ ఇంకో నాలుగు నవలలు చదివిన తర్వాత చదవాలి..మీ సమీక్ష కూడా అప్పుడే చదువుతా.

అన్నట్టు, ఖాలెడ్ హొసెనీ రాసిన రెండో పుస్తకం 'ఎ తౌసండ్ స్ప్లెండిడ్ సన్స్' దొరికితే చడవండి. అఫ్ఘానీయుల కష్టాలని కళ్ళకి కట్టినట్టు చెపుతాడందులో..వీలు దొరికినప్పుడు దాని గురించి రాద్దామనుకుంటున్నాను..
lalitha said…
ఈ పుస్తకం గురించి నా స్నేహితురాలు చాలా రోజుల (నెలల?) క్రితం చెప్పింది నాకు. మీ విశ్లేషణ మొదటి పంక్తులు చదవగానే నాలో ఒక రకమైన ఉత్సుకత మొదలైంది. మొత్తం విశ్లేషణ చదివాక ,పుస్తకం చదివితే
బాగుండనిపిస్తోంది. ఇప్పటికైనా చదువుతానేమో చూడాలి.

పుస్తకం సంగతేమో కాని, విశ్లేషణే నన్ను ఆలోచింప చేస్తోంది. "ఆమోదం" పొందడం కోసం పడే ఆరాటం ఎంత బాధతో కూడుకున్నదో. అయితే, ఆ ఆరాటమే, దాన్ని జయించి, అందువల్ల కలిగే తృప్తిని అందుకోవడానికి కూడా మార్గం కూడా .

Life is not easy. But it's worth living.
venkat said…
మొదటి సారి చదివినప్పుడు చాలా నచ్చిందీ పుస్తకం. కానీ తర్వాత తీరుబడిగా ఆలోచిస్తే చివర్లో పాకిస్తాన్ లో జరిగే ఘట్టాలన్నీ కొంచెం సినిమాటిక్ గా అనిపించాయి. నాకైతే వాళ్ళూ ఆప్ఘైస్తాన్ వెళ్ళి వదిలే వరకు బావుంది. ఆ తర్వాత అమెరికాలో వాళ్ళ కష్టాలు బాగా కదిలించేలా వున్నా మొదట్లోని నిజాయితీ నాక్కనిపించలేదు. అలా అని బాగోలేదని కాదు. ఏదేమైనప్పటికీ మంచి పుస్తకం చదివామన్న భావాన్ని మాత్రం మిగులుస్తుంది. Thousand Splendid Suns ఇంకా చదవలేదు. ఇప్పుడంతా తెలుగుకే ప్రధాన్యత.
lalitha said…
kottapaaLI garu,

After I read your review of The Kite Runner, I had to share it with my friend. I read it out to her over phone and she was amazed to find something so agreeing with her feeling about the book.

Not surprisingly, she is also a fan of Harry Potter series and has been after me to read them. I started on the first and am not moving very fast. However, I read to her your post on Harry Potter series and she was delighted.
@Giri..రెండో నవల కూడ చదవాలని డిసైడయ్యాను. మీరు ప్రస్తావించిన ఆ ఇంకో పేరు ఆంగ్ల స్పెల్లింగ్ సెలవిస్తారా?
@Lalitha..మీకు ఆసక్తి రేకెత్తినందుకు సంతోషం. ఈ నవలలో అటువంటి ఆరాటానికి ఉపశమనం ఏమిటని ఎవరికి వాళ్ళే తేల్చుకోవాలి గానీ ఆరాటాన్ని మాత్రం బాగా చిత్రించాడు. మీ స్నేహితురాలితో నా బ్లాగులు పంచుకున్నందుకు థాంకులు. ఆవిడెందుకు స్వయంగా చదవలేరు?
@veMkaT..సినిమాటిక్ గా అనిపించడంలోనే వాటి సహజత్వం ఉందనిపించింది నాకు. రోహింటన్ మిస్త్రీ రాసిన A fine balance చదివారా? నాకు ఆ నవలే గుర్తొచ్చింది.
Padma I. said…
హ(ఖ)లేద్ హొసేనీ రాసిన రెండో పుస్తకం A Thousand Splendid Suns. నా మటుకు నన్ను రెండవ పుస్తకమే ఎక్కువ కదిలించింది. (చాలా మంది విమర్శకులని కూడా అనుకుంటాను.) అందుకు ముఖ్య కారణం, ఈ కథని ప్రవాసుల దృక్పథం నించి కాకుండా నివాసుల దృక్పధం నించి చెప్పడం. మరింత సహజమైన పాత్ర చిత్రణ, ఇద్దరు కథా నాయికలకీ సమమైన పాత్ర ఇవ్వడం , ఇద్దరూ భిన్న ధృవాల్లాంటివాళ్లు కావడం కూడా అనుకుంటాను. మీకు వీలైతే ఈ పుస్తకం ఆడియో లో వినండి. (చాలా స్థానిక గ్రంథాలయాలలో ఆడియో సీడీ దొరుకుతుంది. తేలికగా MP3 format కి మార్చి మీ portable device లో వినచ్చు. పుస్తకం వినడం, ముఖ్యంగా ఆఫ్ఘన్, అరబిక్ పదాల సరైన ఉచ్చారణతో వినడం reading experience కి ఇంకొక dimension add చేస్తుంది. NPR లో హొసేనీ చదివిన excerpt కూడా వినచ్చు. (కానీ audiobook లో చదివినది రచయిత కాదు.)
Padma "Mistry Obsessed" I. said…
PS:A Fine Balance గురించీ, రోహింటన్ మిస్త్రీ గురించీ ఎంత తలచినా తీరదు. :- )
Giri said…
కొత్తపాళీ గారు,
I got an omnibus edition of Dashiel Hammett novels from the local library. His novels "The Maltese Falcon", "The Thin man" - both were made into successful B&W movies in 1940s. His novels feature hard-boiled detectives, quick dialogue (very colloquial) and piling body count that competes with page count..And make for interesting reads.
గిరి
lalitha said…
కొత్తపాళీ గారు,
నా స్నేహితురాలు చాలా బిజీ. ఆ ఆమ్మాయి దగ్గర నోటుబుక్ ఉంది కాని అందులో తెలుగు enable చేసుకునే తీరిక లేదు.

అయినా ఇలా చదివి వినిపించుకోవడం మాకో సరదా. తను నాకు నచ్చుతాయనుకునేవి ఏవైనా కనిపిస్తే చదివి వినిపిస్తుంటుంది. నేను తనకిష్టమైనవి కనిపిస్తే తనకి చదివి వినిపిస్తాను.

నాకీ మధ్య ఆంగ్ల పుస్తకాలు చదవడానికి ఎక్కువ ఓపిక ఉండటం లేదు. రానారె తెర మీద చదవలేనని అంటూ ఉంటారు. నిజానికి నా స్నేహితురాలికీ ఉంది ఈ సమస్య. నాకేమో తెర మీద చదవడం బాగా అలవాటైపోయింది.
ఓహో, మరో మిస్త్రీ అభిమానులా? ఒక పని చేద్దాం. మనందరం కలిసి మిస్త్రీ త్వరలో ఇంకో నవలో కథల పుస్తకమో విడుదల చెయ్యాలని ఆందోళన చేద్దాం, ఏమంటారు? ఆ పుస్తకం పూర్తి చేశాక కొన్ని వారాలు సరిగా నిద్ర పోలేక పోయాను. అన్నట్టు పద్మగారూ, ఈ లంకెలన్నీ మీరు మీ చేతిసంచీలో వేసుకు తిరుగుతుంటారా? సందర్భోచితంగా బలే వెదజల్లుతారు .. నాకు నా బ్లాగు టపాలకి కావలసినవి వెతికి పట్టుకొడానికే సగం సమయం పడుతుంది!

@గిరి .. అలాగా, రెండు మూడు సినిమాలు చూశాను, నవలల్నించి వచ్చాయని తెలీదు. నాక్కూడా మంచి డికెష్టి నవల్లంటే ఇష్టం. పంచుకున్నందుకు థాంకులు.

@ లలిత .. తమాషాగా ఉందే. సాలభంజికల నాగరాజుగారు వారి శ్రీమతికి తన బ్లాగు "చదివి" వినిపించిన ఘట్టం గుర్తొచ్చింది.
సిరి said…
నవల గురించిన మీ పరిచయం బాగుంది. ఇంకొన్ని మంచి పుస్తకాల గురించి తెలిసింది, వ్యాఖ్యల వల్ల! కృతజ్ఞతలు.
ఈ నవల చదివినప్పుడు, నేనూ venkat లాగానే అనుకున్నాను, చాలా సన్నివేశాలు సినిమాటిగ్గా ఉన్నాయని.
మొదటి అధ్యాయాల తర్వాత, కథ చాలా వరకు predictable గా వున్నా, మొత్తంగా చూసినప్పుడు నవల బాగుంది.
Anonymous said…
గవ్ కొత్తపాలన్నా. గిన్ని పుస్తకాలు చదువుతావు. సైన్మలు సూస్తావు.సమీచ్చలు రాస్తావు.సంగీతం పాడతావు. నాట్యంభీ షురు జేసినవంట. నమస్తే అన్నా. ఇయన్నీ జేసుడు నాతోని కాదన్న. నువ్వు శానా గ్రేటన్న. అన్నా. నారాజ్ గాకె. నువ్వంటే నాకు ఇష్టం గౌరవం అన్నా.
S said…
@ఖొత్తపలి గరు & పద్మ గరు:
Mistry.... Fine balance...నాలో మళ్ళీ ఆ నవల చదివినప్పటి భావనలన్నీ కలిగాయి మీరు దాన్ని ప్రస్తావించాక. అదేమిటో...ఆ తరువాత మిస్ట్రీ ది నేను "Tales from Ferozshah bagh and other stories" తప్పించి వేరే పుస్తకం చదవలేక పోయాను. కానీ... Fine Balance మాత్రం చదివి తీరవలసిన పుస్తకం అనిపిస్తుంది నాకు.... కొన్నాళ్ళ దాకా దాని ప్రభావం నుండి బయట పడలేకపోయాను. అలాగే బయట పడలేకపోయిన మరో పుస్తకం "City of Joy". ఎంత ప్రభావితురాలిని అయ్యా అంటే...ఇప్పటికి కూడా అందులోని కొన్ని వాక్యాలు అలవోకగా వచ్చేస్తాయి నోటికి :)
pi said…
I started reading this book at borders. Amazing narration. If I were not upset with borders(3 small business bookstores in my area went out of business) I would have bought the book right away.

"Theft is the only sin." Do you agree with that?
"Theft is the only sin."
--It took me a moment to realize what you're talking about .. isn't this part of a drunken lecture from Baba to Amir? The author tries to resurrect this line of thought somewhere along the lengthy climax, but not quite powerfully. The climax has its own drama .. IMO, only somewhat connected to Amir's life with baba. Like I said in the review, I felt that the vindication in the climax (and the book in general) is more about Amir's personal inner journey than anything else. It's worth a read. If you're pissed at Borders, buy it online form their competitors .. serves them right! :-)
pi said…
Yes! It is a part of drunken lecture. I found that statement very fascinating.

I just finished reading Arthur Clarke's Childhood' end. I also need to finish crime & punishment. After that I'll start reading this. I'll buy this book at a local small business. U can call me a crazy bay arean if u want to. ;).
leo said…
I read both the books of Khaled. Both books have a terrific start and fizz out towards the end. It amazes me that the second book made it to the top seller lists. Maybe sob stories are not for me.

A Fine Balance reminds me of the days I was reading books of Indian authors in English. Every one of them a dark tale and I gave up. I liked Mistrys Family Matters better. To me it was an education on old age.

I like Amitav Goshs writings. He has a way of narration that makes you feel like the story is playing out before you. Enjoyed both Hungry Tide and Glass Palace.
Thank you for your comment, Leo. I believe that books like A Fine Balance affect you differently depending on at what stage of life you read them. However, I agree with you that almost all Indian English writing around that time was full of sad sob stories. Mistry's superior skill shows, though.
Purnima said…
This book has been lying on my "to be read" shelf for a while!

This is quite an interesting review. Thanks!