ముఖారి రాగం శోకానికీ విషాదానికీ చిహ్నం అంటూ ఉంటారు. నవరసాల్లో శోకం లేదు. దానికి దగ్గరగా వచ్చేవి భీభత్సం, కరుణ. అసలు ఒక రాగం వింటే ఒక రసం, ఒక mood ఉత్పన్నమౌతుంది అనే సిద్ధాంతం నాకు నచ్చదు. ఇలా రాగానికీ రసానికీ ముడి పెట్టే తిక్క హిందుస్తానీ వాళ్ళకి మరీ ఎక్కువ.
ఏ రాగమైనా ఏ మూడ్లోనైనా పాడవచ్చని నా అభిప్రాయం. సాహిత్యాన్ని బట్టీ, పాడే పద్ధతిని బట్టీ కొంతవరకూ మూడ్ ఏర్పడుతుంది. సామజవరగమనా అని ఎంతో గంభీరంగా ఉన్నట్టుండే హిందోళం మనసులోని మర్మమును దెలుసుకో అంటూ దీనంగా వేడుకుంటుంది, లేకపోతే ఇళయరాజా ఇంద్రజాలంతో అలలు కలలు ఎగసి ఎగసి అలసి సొలసి పోయె అంటూ కడలి తరగలై నాట్యం చేస్తుంది.
పూర్వకాలం మనదేశంలో వీధినాటకం, యక్షగానం లాంటి కళారూపాలుండేవి. కొద్ది తేడాతో ఇలాంటివే కర్ణాటకలోనూ తమిళనాడులో కూడా ఉన్నాయి. ఈ కాలపు నృత్య నాటకాలకి మూలమైన కళలివి. వీటిల్లో సంగీతమూ నాట్యమూ ఉన్నా, కథకే ప్రాముఖ్యత. ఉదాహరణకి రామాయణ కథని ఆడుతున్నారనుకోండి - రాముడు అయోధ్య వదిలి అడివికి వెళ్ళినప్పుడు, సీత జాడ తెలియక రాముడు అల్లాడినప్పుడు, ఆశోకవనంలో సీత దుఃఖిస్తున్నప్పుడు - ఇలా విషాదమైన ఘట్టం వచ్చినప్పుడల్లా ముఖారి రాగమే వాడగా వాడగా, జనాల మనసులో ముఖారి అంటే విషాదం, శోకం అనే భావన వచ్చేసి ఉంటుంది. మన హీరోలకి ఇమేజ్ లాగా కొన్ని కొన్ని రాగాలకి కూడా ఇలా ఇమేజ్ ఏర్పడిందని నా అనుమానం.
లేకపోతే ముఖారి రాగం విషాదమేవిటి నా మొహం! ఈ రాగంలో చాలా మందికి తెలిసినది అన్నమయ్య కీర్తన "బ్రహ్మ కడిగిన పాదము". ఎవరు ఎప్పుడు స్వరపరిచారో తెలీదుగానీ ముఖారి రాగంలో ఇప్పుడూ మనం వింటున్న బాణీలో ఎప్పణ్ణించోనే వినబడుతూ ఉంది. ఘంటసాల, బాలమురళీ, ఎమ్మెస్ సుబ్బులక్ష్మిదాకా అందరూ పాడారు. ఎవరు పాడినది విన్నా ఒక పరమాద్భుతమైన దివ్యదృశ్యాన్ని చూస్తున్న అనుభూతి కలుగుతుందే గాని విషాదమన్నది ఏ కోశానా కనబడదు.
ముఖారిలో ఇంకొన్ని ప్రఖ్యాత కృతులు
శివకామ సుందరీ
ఎంతని నే వర్ణింతును శబరీ భాగ్యము
తలచినంతనే నా తనువైతే
సంగీత శాస్త్ర జ్ఞానము
క్షీణమై తిరుగ
సరసీరుహానన రామ
ఇందుకా ఈ తనువు పెంచినది
ఎంతని నే వర్ణింతును శబరీ భాగ్యము
ఏల అవతారమెత్తుకొంటివో
కారుబారు సేయువారు గలరే
ఏకామ్రనాథాయ నమస్తే
కృష్ణం కలయసఖి సుందరం
మహామహోపాధ్యాయ నూకల చినసత్యనారాయణ గారు కూడా తమ రాగాల పుస్తకంలో ఈ రాగం మనోధర్మ సంగీతానికి మంచి అవకాశం ఇస్తుందని సెలవిచ్చారు. క్షీణమై తిరుగ జనించే అనే త్యాగరాజ కీర్తన పాడేందుకు సెమ్మంగూడి శ్రీనివాసయ్యరు పెట్టింది పేరు. ఇంకా అనేక ఇతర కచేరీలలో వేర్వేరు గాయనీ గాయకులు పాడగా వీటిల్లో చాలా కృతులు వినిఉన్నాను ఇదివరలో. ఎందుకనో మరి ఎవరూ ఈ రాగాన్ని కచేరీలో ముఖ్యాంశంగా పాడరు. మహా ఐతే ముఖ్యాంశానికి ముందుగానో వెనుకగానో, జానెడు ఆలాపన, బెత్తెడు పాట, గుప్పెడు స్వరాలతో ముచ్చటగా ముగించేస్తారు.
మురిపెము గలిగె గదా రామ సురముని నుత కరివరద శ్రీరామ
పరమ పురుష జగదీశ వరమృదుభాష సుగుణమణి కోశ నీకు .. మురిపెము ..
ఈడు లేని మలయమారుతముచే కూడిన కావేరీతటమందు
మేడల మిద్దెలతో శృంగారము మించు సదనములలో
వేదఘోషలచే నుతియింప జూడ శివుడు కోరు యోగ్యమైన
సుందరమగు పురము దొరికెననుచు .. మురిపెము..
సకల సుగంధ రాజ సుమములు సులలితమగు కోకిల నాదములు
సుఖముగ సనకాదుల నుతమైన సూర తరువులు గలిగి
నికటమందు వాణీ కొలువ సురపతి నీలమణి నిభ శరీర నేడు
ప్రకటమైన నవరత్న ఖచిత హాటక మంటప వాసము కలిగ ననుచు.. మురిపెము ..
ఈ మహిలో సొగసైన చోళ సీమయందు వరమైన పంచనద పుర
ధాముని చెంతను వసియించుటకై నీ మది నెంచగ
కామ జనక త్యాగరాజ సన్నుత రామ పవనతనయ విధ్రుధ శరణ
క్షేమముగ వర్ధిల్లునట్టి పురమున సీతాభామ సౌమిత్రి ప్రక్క కొలిచెదరని .. మురిపెము ..
ఎప్పుడో 2002లో మదరాసు వాసంలో కొన్న కేసెట్టు. శ్రీకృష్ణగానసభ వాళ్ళు ఎప్పుడో తమ ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యక్ష కచేరీలని ఇప్పుడూ కేసెట్లుగా సీడీలుగా వెలువరిస్తున్నారు .. ఇలాకూడా కొంచెం సొమ్ము చేసుకోవచ్చు అని గ్రహించినట్లు. ఇది ఎప్పుడు జరిగిన కచేరీయో తెలీదు. కాస్మిక్ మ్యూజిక్ అనే పేరిట విడుదలైంది. ఆ కచేరీలో నేదునూరి అనితరసాధ్యమైన రీతిలో అద్భుతంగా ముఖారి ఆలపించి పై త్యాగరాజ కృతిని ముఖ్యాంశంగా పాడారు. కేసెట్టుకి రెండు వైపులా విస్తరించింది. చాలా అరుదైన ఆనందకరమైన అనుభవం. మీరూ కొంచెం రుచి చూడండి.
ఇందులో లాల్గూడి జయరామన్ వయొలిన్, ఉమయాల్పురం శివరామన్ మృదంగం వాయించారు. ఆడియో క్వాలిటీ అంత గొప్పగా లేదుగానీ పరవాలేదు.

Nedunuri Mukhari A... |
Nedunuri Mukhari M... |
ఇందులో లాల్గూడి జయరామన్ వయొలిన్, ఉమయాల్పురం శివరామన్ మృదంగం వాయించారు. ఆడియో క్వాలిటీ అంత గొప్పగా లేదుగానీ పరవాలేదు.
Comments
1) సింధుభైరవి, శివరంజని,తోడి --ఉల్లాసంగా సాగే పాటలకు బాగుంటాయా ?
2)అలలుకలలు ఎగసి ఎగసి హిందోళం కాదు.శుద్ధ ధన్యాసి కదా.
నేను మీతో పూర్తిగా ఏకీభవిస్తాను. రాగాలకి రసాలని అంటగట్టడం సరి కాదనే అనిపిస్తుంది నాకు.
యెనానిమస్సుగారూ, అబ్బ నీ తియ్యనీ దెబ్బ అన్న పాట శివరంజనిలోనే కదా ఉంది! భావాన్ని పలికించడం అనేది సంగీత కళాకారుడి సృజనపైన ఆధారపడి ఉంటుందని నేను బాగా నమ్ముతాను.
అబ్బ నీ తియ్యనీ దెబ్బ అంటే గుర్తొచ్చింది, గురూగారూ, ఈ కధ చదివారా?
http://sbmurali2007.wordpress.com/2007/09/06/%e0%b0%b0%e0%b0%be%e0%b0%97-%e0%b0%b8%e0%b1%81%e0%b0%a7%e0%b0%be-%e0%b0%b0%e0%b0%b8-%e0%b0%aa%e0%b0%be%e0%b0%a8%e0%b0%ae%e0%b1%81/
దివిలో వెలసిన సురవరులూ
బ్రహ్మలూ
గురు బ్రహ్మలూ
అని ఓ యస్వీ కృష్ణా రెడ్డి గారి సినిమా పాట్ ఔన్నది (శ్రీకాంత్ హీరో -- ఎగిరే పావురమా)
ఇది ఏ రాగం?
== అజ్ఞాని,
కిరన్
అలలు కలలు .. విషయంలో నాదే పొరబాటు. సవరించినందుకు థాంకులు.
శాస్తీయ సంగీతంలో నాకున్నది మిడిమిడి జ్ఞానమే ఐనా నే చెప్పదలచుకున్నదేమిటంటే, సంగీతం పుట్టించడానికి ఏ వాయిద్యమైనా వాడవచ్చు..కాని కొన్ని రకాల పాటలకి కొన్ని వాయిద్యాలు బావుంటాయి..
రాగాల విషయం కూడా అంతేనేమో..ఏ రసాన్నైనా ప్రతి రాగంలోనూ కల్పించవచ్చు, కానీ కొన్ని రసాలు సరిపడే రాగాలలోనే రక్తి కడతాయి..ఏమంటారు?
ఇక్కడ మీ బ్లాగు టపా ని పెట్టుకుని ఇటువంటి వ్యాసాల కోసం గూగులంత దారితప్పెంటగా కలియదిరుగుతున్నా కొన్నాళ్ళుగా. ఇది కనబడ్డది కదా...ఇది పట్టుకుని మళ్ళీ ఇహ లోకం లో పడ్డాను :) THanks a lot! Iam a total novice to Carnatic. But, then, I am interested in reading about it and listening to the songs as a layman. అంటే.... కాస్త మానవ భాష లో ఉన్న పాటలు :)
కొంచెం తేడాతో అనామకులు, గిరి, పై గార్లు చెప్పింది ఒకటే .. కొన్ని రాగాలు కొన్ని భావాలకే సరి పోతాయి .. అని. నా అనుభవము, అభిప్రాయము వేరు అని టపా సిద్ధాంతంలోనే చెప్పాను కద .. ముఖారికి సంబంధించినంతవరకూ ఋజువు కూడా చూపించటానికి ప్రయత్నించాను. ఇలాంటి ఉదాహరణలే ఒక్కొక్క భావం (mood) తో ముడిపడిఉన్న దర్బారీకానడ, శహన వంటి రాగాలకి కూడా ఉన్నాయి. ఇది ఇక్కడితో వొదిలేస్తాను.
సౌమ్యా .. ఇక్కడ క్రమం తప్పకుండా అప్పుడప్పుడూ సంగీత చర్చ జరుగుతూ ఉంటుంది. ఓ కన్నేసుంచు. సంగీతం మీద శ్రీరాముడు కొన్ని మంచి టపాలు రాశాడు. కిరణ్ అనే అతను ఈ మధ్య బ్లాగుతున్నాడు. దీప్తి, శ్యాం ల బ్లాగులు కేవలం పాటల్ని పరిచయం చేసి, ఆడియో పెట్టి ఊరుకుంటున్నాయి .. వాటిని గురించి తమ మనోభావాల్ని రాయమని ప్రోత్సహించాను గానీ వాళ్ళు రాయట్లేదు. దీప్తి బాగా పాడుతుంది. శ్యాం టపాల్లో సందర్భోచితంగా పెట్టే బొమ్మలు చాలా బావుంటాయి. ఏదన్నా ప్రత్యేకమైన విషయం మీద వివరణ కావాలంటే అడుగు .. ప్రయత్నిస్తాను.
నాగరాజా .. రాగమంటే ఆరోహణ అవరోహణలు మాత్రమే కాదు. ఆ సమాచారం జాలంలో చాలా చోట్ల విరివిగానే లభిస్తుంటుంది. ఐనా సరే పెట్టమంటె పెడతాను, దాన్దేవుంది.
And one thing I envy you for is the time you can afford to spend on this blogosphere. You seem to be just about everywhere. (సర్వాంతర్యామిలా). కానీ నా కంత సమయం ఉండదు. ఉన్న కాస్త సమయం నా బ్లాగోగులు చూడటానికే సరిపోతుంది గాని ఇతరులవి చదవడం కష్టమౌతుంది. Presently, one doubt that cruelly crushing me is - What if everybody thinks I am a snob for not mingling with another bloggers. I hope that's not how it is.
నువ్వన్నట్టు కొంత quid pro quo factor పని చేస్తోంది అనుకుంటా. ఎవరైనా బ్లాగులు రాసేది ఇతరులు చదవడం కోసమే కాబట్టీ, తెలుగు బ్లాగింగ్ ఇంకా శైశవ దశలో ఉన్న ఈ సమయంలో బ్లాగులకి పాఠకులు తోటి బ్లాగరులే కాబట్టీ, అటువంటి ఆశ ఉండటం సహజం. అంతేకానీ, నేను ఫలాని బ్లాగులో వ్యాఖ్య రాశాను కాబట్టి వాళ్ళొచ్చి నా బ్లాగు చదివి వ్యాఖ్య రాయాలి అనే దురాశ ఎవరూ పెట్టుకోరనుకుంటా.
నా బ్లాగుల్లో నీకు ఆసక్తి కలిగించే విషయాలేమీ లేకపోతే దానికి నువ్వేం చేస్తావ్. నువ్వు రాసే విషయాలు శైలి నాకు నచ్చుతాయి - there ends the matter.
వీలున్నప్పుడు ఈ కింది వాటిని ఓ లుక్కెయ్యి.
పూర్వజన్మ వాసన
లోకస్ట్ వాక్
WORDS
ఇప్పుడే 'పూర్వజన్మ వాసన'పై ఒక లుక్కేసాను. ఆసక్తికరమైన రచయిత. తీరిగ్గా మరోమారు చదవాలి. Thank You: పరిచయం చేసినందుకు.