ఇదే మొదటి యత్నమయితే గనక చాలా మంచి శుభారంభమే! వెంటనే ఈ పద్యం సంగతేమిటో తెలుసుకోవాలని శోధించి ఇలా పాఠం సంపాదించి అప్పుడు మళ్ళీ వింటుంటే, దాదాపుగా అన్ని పదాలకు అర్థాలు తెలిసాయి. వీలైతే, సీస పద్యం యొక్క విశేషాలు చెప్పండి. ఉచ్ఛారణలో దోషాలు ఏమీ అనిపించలా ఈ ఒక్కటి తప్ప. అది కూడా నాకు ఖచ్చితంగా తెలియదు. నే సంపాదించిన పాఠంలో "గరపు" అని ఉంది, మీరు "గరుపు" అని పఠించారు. రెంటికీ ఒకటే అర్థమా?
ఆంధ్ర మహా భారతము - ద్రౌపది భీమునితో ధర్మరాజు మహిమ చెప్పుట
నా చిన్నప్పుడు మాయింటికి బిచ్చమెత్తుకునే ఒక సాధువు వచ్చేవాడు, తమాషా పాటలు పాడుతుండేవాడు .. అందులో ఒకటి "సుతి (శృతి) ఉంటే మతి లేదు, మతి ఉంటే సుతి లేదు" అని. నా గాత్రం కూడా ఆ కోవలోకే వస్తుంది. బావుందని అన్నందుకు బహుత్ బహుత్ షుక్రియా. @వికటకవి - ఈ టపా చూడండి. నేను చూసి పాడిన ప్రతిలో కూడా గరపు అనే ఉంది. నేనే ఆవేశంలో గరుపు అని పాడేశాను. సీసపద్యం విశేషాలు ఏంకావాలి? ఛందస్సు వివరాలు కావాలంటే తెవికీలో ఉన్నై. నేను జీవితంలో ఒక్క సీసపద్యమే రాశాను, జ్యోతిగారి బ్లాగులో చీరల విన్యాసం కోసం .. ఇక్కడ చూడొచ్చు. @శ్రీరాం - ఆ పాదంలో ఉన్న అర్థం ఇంకా గూఢమైనదనుకుంటా. రజోరాజి అంటే ధూళి లేదా పుప్పొడి కుప్ప అని అర్థం చెప్పుకోవచ్చు. రాజులందరూ ధర్మజునికి సలాములు చేసినప్పుడు వాళ్ళ ఆభరణాల వజ్ర వైడూర్యాలు ధూళి కుప్పల్లా పడి ఉంటే పట్టపుటేనుగుల మదము వాటి మీద కారి బురదలా అయ్యిందని నాకు తోచింది. ్ఆగరాజా మరియు ప్రసాద్ - పబ్లిగా ఇలాంటివి కోరుకునే ముందు జాగ్రత్త :-)
మీ మొదటి సీసపద్యం నా బ్లాగుకోసం రాసినందుకు ధన్యవాదములు. మీ పద్యం సూపర్. మీరు కాస్త రాయడం తగ్గించి అంటే వారానికి ఒక టపా బదులు ఒక పద్యమో లేక మంచి సినిమా పాటో వినిపించండి. అంతే..
పద్యాలను పాడాలని మీకనిపించిందంటే ఆశ్చర్యం ఎంతమాత్రమూ లేదు. మిమ్మల్ని చూసి ఇక నేనూ విజృంభించవచ్చు. చివర్లో చప్పట్లు వినిపించాయి. ఏదైనా చిన్నపాటి సభలో పాడారేమో? వీలైతే ఈసారి ఏదైనా ఒక శృతివాద్యం తోడుగా పెట్టుకొని పాడండి గురూజీ. ఘంటసాల పాడినా సరే, శృతి తోడుంటే వచ్చే అందమే వేరని మీరు అంగీకరిస్తారనుకుంటా.
చదువరి గారు మరీ ములగచెట్టెక్కిస్తున్నారు. కొమ్మ విరక్కుండా దిగడానికి ప్రయత్నిస్తా. భక్తపోతన సినిమాలో నాగయ్య మధురగానంతో పోతన గారి ప్రఖ్యాత పద్యాలు వినడం అపురూపమైన అనుభవం.
@జ్యోతి - ఇప్పటికే రాయాల్సిన విషయాలు బోలెడు పేరుకుని ఉన్నై. అందులో కొన్నిటికి కాలదోషం పడుతుంది కూడాను. అదీగాక పద్యమో పాటో పాడేందుకు ఒకటి నుంచీ మూడున్నర నిముషాలే పడుతుంది. దాని అప్లోడు చేసి టపా వెయ్యడనికి మహా ఐతే ఒక పావుగంట. దాంతో పోలిస్తే నా బ్లాగులు ప్రతిదీ గంటన్నా తీసుకుంటుంది రాయడానికి.
@రానారె - వచ్చిన బాధ అదే కదయ్యా కాదరయ్య. శృతిపెట్టి పెట్టుకుంటే బానే ఉంటుంది కానీ నా గొంతులోనే శృతి నిలవదు. ఒక్కోసారి నా/మీ అదృష్టం బావుండి ఇదిగో .. ఇలా .. చప్పట్లా? ఎక్కడా? అది బహుశా స్టాటిక్ లాంటిదేమో. నేనది పాడినప్పుడు గదిలో నేనూ, ంప్3 రికార్డరూ తప్ప ఎవరూ లేరు.
Anonymous said…
"నాబ్లాగు మీ పట్టీలో పెట్టినందుకు ధన్యవాదాలు", "ఇంత చెత్త బ్లాగు మీకెలా నచ్చిందసలు, మీకింతకంటే మంచి టేస్టుందనుకున్నానే"
అనగా, ధర్మరాజు సందర్శనానికై తహతహలాడుతూ, రాజులందరూ ఒకళ్లనొకొళ్ళు ఒరుసుకొంటూ, తోసుకొంటూ రావడం వల్ల, రాపిడికి లోనై, వాళ్ళు ధరించిన ఆభరాణాలు నుగ్గునుగ్గై పోతాయిట, ఆ ధూళి, మదపుటేనుగుల మదజలం కారడం వల్ల పుట్టిన బురదని పోగడుతుందట...
కృష్ణశాస్త్రిగారు తిక్కన గురించి రాసిన వ్యాసంలో, ఈ పద్యాన్ని ఉదాహరించారు.
మాస్టారూ - బాగా పాడేరు. మరికొన్ని ఇలాటివే వినిపించండి - వీలున్నప్పుడు. రానారే చెప్పినట్టు శృతి పెట్టె ఉంటే ఇంకా బాగుంటుంది. --నాగరాజు
అయ్య కొత్తపాళి గారు , మీరు టపా వేసినప్పటినుండి ప్రయత్నించాను ఏమిటా ఇది అని, రెండు మూడు సార్లు ప్రయత్నించాను ఫలించలేదు. అప్పుడు అనుకొన్నాను ఇదెదో వర్రి కదా ఇక్కడ ఏమి లేదు, అని వదిలేశాను. కాని ఆ తరువాత కూడా టపాలు వచ్చి పడుతున్నాయి అప్పుడు అనిపించింది ఇక్కడ ఏదో ఉంది నాకు దొరకడం లేదు అని శోధించి చివరికి సాధించాను. నిన్న రాత్రి ఈ స్నిప్స్ సైటు వెళ్ళి ఆ ఫైలు మొత్తం .వేవ్ ఫార్మాటుతో డౌన్ లోడ్ చేసుకొని విన్నాను. చాలా బాగుంది. ఇటువంతవి మళ్లి మళ్ళి వినిపిస్తారని ఆశిస్తున్నాను
ఎనానిమసు మహాశయా, గొంతులు వినిపించే ధైర్యం చేయడమే గొప్పసంగతి. అందులోనూ పద్యాలను పాడటమనేది మరుగున పడుతున్న మన ప్రాచీనకళ. దానికి ప్రోత్సాహం ఇవ్వడం మీ (మన) ధర్మం. మీ వ్యాఖ్యలోని మొదటి రెండు వాక్యాలూ సరే, అది మీ అభిప్రాయం. మూడోవాక్యం రాయడానికి ఇది సరైన వేదిక కదేమోకదా!? నాకంటే ఎవరైనా ఇంకాబాగా పాడినట్లు మీకు అనిపిస్తే నాబ్లాగులోకొచ్చి ఇలాగే చెబుతారేమో కదా. అప్పుడు ఇంకోసారి నేను గొంతెత్తుకొని ప్రజలోకి రావడానికి ఎన్ని శక్తులను కూడదీసుకోవాలోకదా అని భయంగా ఉంది మీ వ్యాఖ్య చూస్తే.
@ Anonymous - thank you for providing that reality check - my head was beginning to swell :-)
@Ranare - compliments are rare .. esply from a discerning audience. So, enjoy them while you get them .. why worry what the critic will say tomorrow? :-))
ఒ అనవసర వ్యాఖ్యానం అవునండి, పొగిడేవారు చాలా మంది ఉంటారు కానీ, బాగా తెలిసిన వారు మిమర్శల వల్లే మనము పురోగమనం చెందగలమన్నది నా అభిప్రాయం కూడాను. కాని ఉత్త బాలేదంటంకంటే, ఎక్కడ నాణ్యత కాస్త తగ్గిందో వివరిస్తే ఇంకా ఉపయోగపడుతుంది. Anon గారూ ఇక్కడందరూ విశాల దృక్పదం గలవారే, కాబట్టి మీ identity ని ధైర్యం గా ఇవ్వవచ్చు, Anon ల అవసరం లేదు తెలుగు బ్లాగర్లలో..
As far as reviewing music and books is concerned, you are what Ian Chappell is to cricket. Masterly. Nonetheless, I felt after listening to your rendition of the poem that singing is not your cup of tea. మీ సంగీతం టపాలు నాకు ఇష్టం. ఇహపోతే రానారె తో పోల్చటం నా ఉద్దేశ్యంకాదు. @రానారె : గురువుగారి బ్లాగులో శిష్యులగురించి చెప్పకూడదా?
@రాకేశ్వర్ : ఎంతైనా కొత్తపాళీ గారు గదా. అందుకే భయంతో అనానిమకుడినయ్యా. @పునీత తెరెసమ్మగారు: అంతకోపం తెచ్చుకోకు చెల్లిమ్మా.నా విమర్శ ఎన్నడూ చెలియలికట్ట దాటదు.
Anonymous said…
ఇంత మంది ఇన్ని విధాల తన్మయులయ్యారంటే, మీ గొంతుకన్నా ఒక క్లిష్టమైన పద్యాన్ని అందరికీ వినిపించాలన్న మీ సంకల్పమే గొప్పది అని అనిపిస్తూవుంది. అంతరించిపోతున్న ఇలాంటి కళకి ’ఎవరో ఒకరు, ఎపుడోకపుడు..’ అన్న పాటలాగా మీలాంటి వాళ్ళే జీవం పోయాలి మరి. మళ్ళీ ఎప్పుడు?
Comments
ఇదే మొదటి యత్నమయితే గనక చాలా మంచి శుభారంభమే! వెంటనే ఈ పద్యం సంగతేమిటో తెలుసుకోవాలని శోధించి ఇలా పాఠం సంపాదించి అప్పుడు మళ్ళీ వింటుంటే, దాదాపుగా అన్ని పదాలకు అర్థాలు తెలిసాయి. వీలైతే, సీస పద్యం యొక్క విశేషాలు చెప్పండి. ఉచ్ఛారణలో దోషాలు ఏమీ అనిపించలా ఈ ఒక్కటి తప్ప. అది కూడా నాకు ఖచ్చితంగా తెలియదు. నే సంపాదించిన పాఠంలో "గరపు" అని ఉంది, మీరు "గరుపు" అని పఠించారు. రెంటికీ ఒకటే అర్థమా?
ఆంధ్ర మహా భారతము - ద్రౌపది భీమునితో ధర్మరాజు మహిమ చెప్పుట
ఎవ్వని వాకిట నిభమదపంకంబు రాజభూషణ రజోరాజి నడగు
నెవ్వని చారిత్ర మెల్ల లోకములకు నొజ్జయై వినయంబు నొరపు గరపు
నెవ్వని కడకంట నివ్వతిల్లెడు చూడ్కి మానిత సంపద లీనుచుండు
నెవ్వని గుణలత లేడు వారాసుల కడపటి కొండపై గలయ బ్రాకు
నతడు భూరి ప్రతాప మహా ప్రదీప
దూర విఘటిత గర్వాంధకార వైరి
వీర కోటీర మణి ఘృణి వేష్టితాంఘ్రి
తలుడు, కేవల మర్త్యుడె ధర్మసుతుడు!
dhanyavaad!
ఈ పద్యం తిక్కన రాసిన రత్నాల్లో ఒకటి అని చెప్పుకోడం తెలుసు కానీ ఎప్పుడూ ప్రత్యేకంగా పరిశీలించలేదు.
ఆ మొదటి పాదంలో కవి భావం ఏంటో పూర్తిగా బోధపడలేదు. మదపుటేనుగులూ, ఇంకా రాజులూ ఈయన వాకిట్లో వేచి ఉంటారనా?
ఇంత బాగా పాడతారని ముందే తెలిస్తే, మా ఇంట్లో రికార్డింగ్ చేసేవాళ్ళం!! నా దగ్గర రికార్డింగ్ సామాను బాగానే ఉంది...
--ప్రసాద్
http://blog.charasala.com
@వికటకవి -
ఈ టపా చూడండి.
నేను చూసి పాడిన ప్రతిలో కూడా గరపు అనే ఉంది. నేనే ఆవేశంలో గరుపు అని పాడేశాను. సీసపద్యం విశేషాలు ఏంకావాలి? ఛందస్సు వివరాలు కావాలంటే తెవికీలో ఉన్నై. నేను జీవితంలో ఒక్క సీసపద్యమే రాశాను, జ్యోతిగారి బ్లాగులో చీరల విన్యాసం కోసం ..
ఇక్కడ చూడొచ్చు.
@శ్రీరాం - ఆ పాదంలో ఉన్న అర్థం ఇంకా గూఢమైనదనుకుంటా. రజోరాజి అంటే ధూళి లేదా పుప్పొడి కుప్ప అని అర్థం చెప్పుకోవచ్చు. రాజులందరూ ధర్మజునికి సలాములు చేసినప్పుడు వాళ్ళ ఆభరణాల వజ్ర వైడూర్యాలు ధూళి కుప్పల్లా పడి ఉంటే పట్టపుటేనుగుల మదము వాటి మీద కారి బురదలా అయ్యిందని నాకు తోచింది.
్ఆగరాజా మరియు ప్రసాద్ - పబ్లిగా ఇలాంటివి కోరుకునే ముందు జాగ్రత్త :-)
మీ మొదటి సీసపద్యం నా బ్లాగుకోసం రాసినందుకు ధన్యవాదములు. మీ పద్యం సూపర్. మీరు కాస్త రాయడం తగ్గించి అంటే వారానికి ఒక టపా బదులు ఒక పద్యమో లేక మంచి సినిమా పాటో వినిపించండి. అంతే..
@జ్యోతి - ఇప్పటికే రాయాల్సిన విషయాలు బోలెడు పేరుకుని ఉన్నై. అందులో కొన్నిటికి కాలదోషం పడుతుంది కూడాను. అదీగాక పద్యమో పాటో పాడేందుకు ఒకటి నుంచీ మూడున్నర నిముషాలే పడుతుంది. దాని అప్లోడు చేసి టపా వెయ్యడనికి మహా ఐతే ఒక పావుగంట. దాంతో పోలిస్తే నా బ్లాగులు ప్రతిదీ గంటన్నా తీసుకుంటుంది రాయడానికి.
@రానారె - వచ్చిన బాధ అదే కదయ్యా కాదరయ్య. శృతిపెట్టి పెట్టుకుంటే బానే ఉంటుంది కానీ నా గొంతులోనే శృతి నిలవదు. ఒక్కోసారి నా/మీ అదృష్టం బావుండి ఇదిగో .. ఇలా .. చప్పట్లా? ఎక్కడా? అది బహుశా స్టాటిక్ లాంటిదేమో. నేనది పాడినప్పుడు గదిలో నేనూ, ంప్3 రికార్డరూ తప్ప ఎవరూ లేరు.
"ఇంత చెత్త బ్లాగు మీకెలా నచ్చిందసలు, మీకింతకంటే మంచి టేస్టుందనుకున్నానే"
ఇభమద పంకంబు = ఏనుగుల మదజలం వలన నేల తడిసి ఏర్పడిన బురద
రాజభూషణ = రాజులయొక్క అలంకారాల రాపిడివలన రాలిన
రజోరాజిన్ = దుమ్ము సముదాయంలో, అడగున్ = అణగుతుందో...
అనగా, ధర్మరాజు సందర్శనానికై తహతహలాడుతూ, రాజులందరూ ఒకళ్లనొకొళ్ళు ఒరుసుకొంటూ, తోసుకొంటూ రావడం వల్ల, రాపిడికి లోనై, వాళ్ళు ధరించిన ఆభరాణాలు నుగ్గునుగ్గై పోతాయిట, ఆ ధూళి, మదపుటేనుగుల మదజలం కారడం వల్ల పుట్టిన బురదని పోగడుతుందట...
కృష్ణశాస్త్రిగారు తిక్కన గురించి రాసిన వ్యాసంలో, ఈ పద్యాన్ని ఉదాహరించారు.
మాస్టారూ - బాగా పాడేరు. మరికొన్ని ఇలాటివే వినిపించండి - వీలున్నప్పుడు. రానారే చెప్పినట్టు శృతి పెట్టె ఉంటే ఇంకా బాగుంటుంది.
--నాగరాజు
ఎవరన్నా ఇలా స్వగొంతుకతో పాడితే నాకు చాలా ఇష్టం. మరిన్ని విసరండి. పట్టుకోడానికి మేం రడీ.
నమస్కారం శ్రీమతి పాళీ గారు,
నా పేరు రాకేశ్వర రావు, ముద్దుగా రాకేశ్ అంటారు సన్నిహితులు చాలా మంది. మీకూ కావాలంటే అలా పిలవొచ్చు.
నా బ్లాగు తప్పక దర్శించగలరు
http://andam.blogspot.com/
ఉంటాను.
నేను ఇంతకు ముందో కమెంటు వదిలా, బహుశా రాలేదనుకుంటా, అందులో మీరు చాలా బాగా పాడారు అని వ్రాసా
:)
Though infrequently, I do wander through KooDali whenever I have time.
అందుకోండి వందనాలు.
may be rakesh isnt aware, i have an inkling you do read blogs and leave a comment or two sometimes :)
"So this is what you do when I go out of town?"
Madam, thats what he wants you to belive may be :)
I am not falling for that Sriram :)
@Ranare - compliments are rare .. esply from a discerning audience. So, enjoy them while you get them .. why worry what the critic will say tomorrow? :-))
అవునండి, పొగిడేవారు చాలా మంది ఉంటారు కానీ, బాగా తెలిసిన వారు మిమర్శల వల్లే మనము పురోగమనం చెందగలమన్నది నా అభిప్రాయం కూడాను.
కాని ఉత్త బాలేదంటంకంటే, ఎక్కడ నాణ్యత కాస్త తగ్గిందో వివరిస్తే ఇంకా ఉపయోగపడుతుంది.
Anon గారూ
ఇక్కడందరూ విశాల దృక్పదం గలవారే, కాబట్టి మీ identity ని ధైర్యం గా ఇవ్వవచ్చు, Anon ల అవసరం లేదు తెలుగు బ్లాగర్లలో..
మీరూ మోడరేషన్ మొదలెట్టాలి. అభిప్రాయం వెలిబుచ్చడం ప్రశంసనీయం కానీ కంపేరిజన్లు గర్హనీయం.
@ anon-It's done in very bad taste and in cowardly manner.
As far as reviewing music and books is concerned, you are what Ian Chappell is to cricket. Masterly. Nonetheless, I felt after listening to your rendition of the poem that singing is not your cup of tea. మీ సంగీతం టపాలు నాకు ఇష్టం. ఇహపోతే రానారె తో పోల్చటం నా ఉద్దేశ్యంకాదు.
@రానారె : గురువుగారి బ్లాగులో శిష్యులగురించి చెప్పకూడదా?
@రాకేశ్వర్ : ఎంతైనా కొత్తపాళీ గారు గదా. అందుకే భయంతో అనానిమకుడినయ్యా.
@పునీత తెరెసమ్మగారు: అంతకోపం తెచ్చుకోకు చెల్లిమ్మా.నా విమర్శ ఎన్నడూ చెలియలికట్ట దాటదు.