ఆచార్య వేమూరి గారి గురించీ కేలిఫోర్నియా బెర్కిలీ విశ్వవిద్యాలయంలో తెలుగు బోధన ప్రారంభించడానికి వారు చేస్తున్న ప్రయత్నాల గురించీ ఇంతకు ముందు ఇక్కడ పరిచయం చేశాను.
ఇప్పుడే వారు పంపిన శుభవార్త చూశా - ఈ సంవత్సరం ఫాల్ సెమిస్టరు నుండీ బెర్కిలీలో తెలుగు క్లాసు మొదలవుతోంది. నాలుగు క్రెడిట్ల క్లాసు, బోధన బుధ, శుక్ర వారాలు మధ్యాహ్నం 12 నించీ రెండు దాకా జరుగుతుందట.
ఈ గమ్యం చేరడానికి అవిశ్రాంతంగా పనిచేసిన వేమూరి వారికీ వారి బృందానికి హార్దికాభినందనలు. విరాళాలిచ్చి బాసటగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు.
ఈ ప్రయత్నం ఆరంభ శూరత్వంగా మిగిలిపోగూడదంటే మనం ఇంకో రెండు పనులు చెయ్యాలి -
1) మూల నిధిని ఇంకా బలోపేతం చెయ్యాలి. ఫండ్స్ లేమి వల్ల ఈ బోధన ఆగిపోకూడదు.
2) ప్రతి సెమిస్టరులోనూ క్లాసు నిండేటట్లు చూడాలి.
సమాజ ప్రేరణతో విశ్వవిద్యాలయంలో తెలుగు బోధించడం మిషిగన్ విశ్వవిద్యాలయంతో మొదలైంది కొన్నేళ్ళ క్రితమే. దీన్ని సాధించడానికి స్థానికి తెలుగు అభిమానులు చాలా కృషి చేశారు - ఐనా ఏం లాభం? గత సెమిస్టర్లలో తగినంత ఎన్రోల్మెంట్ లేక విశ్వవిద్యాలయం వారు ఈ బోధనని నిలిపి వేశారు.
డబ్బంటే తెస్తాం, దాతల గడ్డం పట్టుకుని బతమలాడో, బిచ్చమెత్తో, ఎలాగోలాగ.
విద్యార్ధులకి తెలుగు నేర్చుకోవాలనే ఆసక్తి ఎలా తెప్పిస్తాం?
ఆలోచించాల్సిన ప్రశ్న!

Comments
ఒక తమిళ మిత్రుడు " మా పిల్లలు పెరుతున్నప్పుడు తమిళెందుకు, భాష, యాసతో మేం పడ్డ కష్టాలు చాలదా అని వాళ్లతో అదేపనిగా ఇంగ్లీషులో మాట్లాడే వాళ్లం. వాళ్లనూ అలాగే ఇంగ్లీషులో మాత్రమే మాట్లాడాలని ప్రోత్సహించాం. ఇప్పుడు వాళ్లు మాతో ఎంత పోరినా తమిళ్లో మాట్లాడట్లేదు. సన్ టీవీ పెడితే అక్కడినుండి చేసి పక్కకు వెళతారు. తమిళ్‌లో అడిగిన ప్రశ్నలకు ఇంగ్లీషులో జవాబిస్తారు" అని వాపోయాడు :-(