మా వూళ్ళో పావని, శ్రీకాంత్ అనే యువ దంపతులున్నారు. ఇద్దరూ గాత్ర సంగీతంలోనూ వయొలిన్ వాద్యంలోనూ ఆరి తేరిన వాళ్ళు. మా వూళ్ళో వీరిద్దరూ విడివిడిగానూ, కలివిడిగానూ కచేరీలివ్వడం మామూలే. మాతృదేశం నించి ఎవరైనా విద్వాంసులు పక్కవాద్యం తోడు లేకుండా అమెరికా పర్యటనకి వచ్చిన సందర్భాల్లో మా వూళ్ళోనే కాదు, పక్క వూళ్ళకి కూడా వీరిని పక్కవాద్యం సహాయానికి ఆహ్వానించడం పరిపాటి. స్థానికంగా చాలా మంది పిల్లలకి సంగీత విద్యాభిక్ష పెడుతున్నారు.
ఈ పుణ్య దంపతులకి సుమారు రెండేళ్ళ క్రితం ఒక బాబు పుట్టాడు. సంగీత త్రిమూర్తులలో ఒకరైన శ్యామశాస్త్రులవారి ఆశీర్వచనంగా "శ్యామకృష్ణ" అని పేరు పెట్టుకున్నారు. భలే ముద్దుగా ఉంటాడు. ఊరికే ముద్దుగా ఉంటే వాడి గురించి ఇంత టపా రాయవలసిన అవసరమేముంది - అక్కడే ఉంది అసలు కథ.
మొన్నామధ్యన పావని గారు ఈ విడియోలు చూడండి అంటూ కొన్ని యూట్యూబు లంకెలు పంపారు. చూసి నిర్ఘాంత పోయాము, నేనూ మా ఆవిడా.
ఈ మృదంగ బాలచంద్రుడి అసాధారణ ప్రతిభ మన బ్లాగస్తులతో పంచుకోవాలని వారి అనుమతితో ఈ పరిచయం రాస్తున్నాను.
విఘ్నేశా తవ చరణం భజన
గోవింద గోపాల భజన
సీతమ్మ మాయమ్మ
తెలియలేరు రామ
మొన్న మా ఇంటికి వచ్చారు అందరూ. భోజనాలయ్యాక ఇక సంగీత కార్యక్రమం మొదలైంది. వాళ్ళమ్మ పాడుతుంటే ఈయన ఆ చిన్న డోలు మీదనే మృదంగం వాయింపు. భజనలు, కీర్తనలు, వివిధ తాళాలు మారిపోతున్నా ఏ మాత్రం తొణక్కుండా చిరునవ్వులు నవ్వుకుంటూ హాయిగా వాయించుకు పోతున్నాడు. మధ్య మధ్య పెద్ద విద్వాంసుడిలాగా తల పంకించడం, పాటలో తాళం గతి మారగానే దాన్ని సరిగ్గా అనుసరించడం, పాట ముగింపుని గుర్తించి దానికి తగినట్టు ముక్తాయించడం,
చివరకి కొసమెరుపు ఝళిపించి ఉవ్వెత్తున చెయ్యి పైకి విసరడం - చూసి
ఆనందించాల్సిందే.
ఈ విన్యాసాలకే మేం మురిసిపోతుంటే పావని గారు డోలు తీసి దాచేసి (లేకపోతే వాడు వాయించడం ఆపడు), సన్నగా ఒక రాగం ఆలాపన చేసి "కన్నా, ఇదేంటో చెప్పు" అన్నారు. వెంఠనే "మోజన" అన్నాడు. వాడికింకా మాటలు కూడా సరిగ్గా రాలేదు - చాలా హల్లులు పలకవు, రాగాల పేర్లు చెప్పేస్తున్నాడు! మేము దీనికే హాశ్చర్య పడి కూర్చోగా ఆమె ఒకదాని వెంట ఒకటి చిన్న ఆలాపనలు చెయ్యడం - పది సెకన్లు కూడా పాడి ఉండరు ఒక్కొక్కటీ - చిందోల, తోడి, తుద్ద తావేడి, తాంబోజి .. ఇలా ఒక డజను రాగాల్ని తప్పులేకుండా గుర్తు పట్టాడు. పాతిక దాకా గుర్తు పట్ట గలట్ట! నిండా రెండేళ్ళు లేవు!
అవును మరి .. ఉగ్గుపాలతో నేర్చుకోవడం కాదు, అమ్మ బొజ్జలో ఉన్నప్పుడే రక్తంలో సంగీతాన్ని నింపుకుని పుట్టాడు మా శ్యామ - ఆశ్చర్యమేముంది?
ఈ పిల్ల పిడుగు దినదిన ప్రవర్ధమానంగా ఎదిగి, సంగీతసాగరాన్ని అవుపోసన పట్టి సాక్షాత్తూ ఆ శ్యామశాస్త్రులంత వాడు కావాలని ఆశీర్వదిస్తూ .. ఆ తల్లిదండ్రుల్ని అభినందిస్తూ .. ఇప్పటికి శలవు.

Comments
కృతజ్ఞతలు.
అద్భుతాల మీద వ్యాఖ్యానం చెయ్యడం కష్టం.
చిన్న పిల్ల వాడు కనుక చిరంజీవికి ఆశీస్సులు.
చిన్ని కృష్ణుడికి కూడా యశోదమ్మ ప్రతి adventure తర్వాత ఇంటికి తీసుకొచ్చి దిష్టి తీసేదట, మా అమ్మమ్మ చెప్పేది.
చి. శ్యామకృష్ణకు దిష్టి తియ్యమని వాళ్ళమ్మకు గట్టిగా చెప్పండి.
ఇలాంటి సరస్వతీ పుత్రుడి దర్శనం చేయించినందుకు చాలా థాంకులు.
హాచర్యం వేసింది...
పూర్వజన్మ సుకృతం అంటే ఇదేనేమో.