ప్రాచీన భారతీయ విజ్ఞానం

వేదవిజ్ఞానం గురించి ఈ మధ్య మన బ్లాగుల్లో వాదనలూ , ప్రతివాదనలూ , ఆ రెంటినీ సమన్వయ పరిచే ప్రయత్నాలూ మాంఛి వాడిగా వేడిగా జరిగాయి.

ఈ చర్చల్లో అంతర్లీనంగా "ప్రాచీన భారత దేశంలో విజ్ఞానం కొందరికే పరిమితమైంది" అనే నిర్ధారణ నాకు కనిపించింది. అలా జరిగిందనడానికి చాలా తార్కాణాలు ఉన్నాయి కూడా. ఈ ఆలోచనలు నా బుర్రలో సజీవంగా మెదులుతుండగానే అంతర్జాలంలో ఏదో తీగ లాగితే డొంకంతా కదిలి చివరకి ఈమాటలో ఆచార్య వేమూరి వేంకటేశ్వరరావుగారు రాసిన వ్యాసంలో తేలాను. ఆ వ్యాసం గణితంలో సంఖ్యల గురించి. కానీ వ్యాసం మధ్యలో "వచనాన్ని కంఠస్తం చెయ్యడం కంటే పద్యాన్ని కంఠస్తం చెయ్యడం తేలిక" అన్న వేమూరి మేష్టారి ప్రవచనం నన్ను ఆకట్టుకుంది.

ఈ వాక్యంతో మొదలై సాగిన రెండు పేరాల్లో వేమూరి మేష్టారు ప్రతిపాదించిన ఆలోచనలు ప్రాచీన భారతీయ విజ్ఞానం గురించి ఆసక్తి ఉన్న మనవాళ్ళందరికీ పనికొస్తాయి అనిపించింది.

ఈ సందర్భంగా వేమూరి మేష్టారి గురించి రెండు పరిచయ వాక్యాలు చెప్పటం అసందర్భం కాదనుకుంటా. కేలిఫోర్నియా విశ్వవిద్యాలయం - డేవిస్ ప్రాంగణంలో వీరు కంప్యూటర్ శాస్త్ర విభాగంలో ఆచార్యులు. విజ్ఞాన శాస్త్ర విషయాలని తెలుగులో అందరికీ అర్ధమయ్యేట్టు రాయాలి ఆనే తపనతో విజ్ఞాన, జీవ, వైద్య శాస్త్ర విషయాలని విశదపరుస్తూ అనేక వ్యాసాలూ, కథలూ రాశారు. ఈమాట పత్రికలోనే వీరి రచనలు చాలా ఉన్నయ్యి. ఆంగ్ల-తెలుగు పారిభాషిక పదకోశాన్ని సంకలించారు. ఇది సాహితి.ఆర్గ్ లో లభ్యం. మాతృదేశంలో అభివృద్ధి, పర్యావరణ సంరక్షణ ధ్యేయాలుగా ఒక స్వఛ్ఛంద సంస్థని స్థాపించి నిర్వహిస్తున్నారు. ఇటీవల బెర్కిలీ విశ్వవిద్యాలయంలో తెలుగు బోధన ఏర్పాటు చెయ్యటంలో కీలకపాత్ర వహించారు.

అన్నిటికీ మించి నిరాడంబరులు, మృదుభాషి, సహృదయులు, సరసులు.

Comments

rākeśvara said…
అమెరికా లో UC Davis లో తెలుగు పాఠాలు నేర్పుతారని ఎప్పుడో ౫ సంవత్సరాల క్రితం అంతరాజాలంలో చూస్తూ తెలుసుకున్నాను.
అప్పట్నుండి ఆ విషయం అలా గుర్తుండుకు పోయింది. ఇన్నాళ్ళకు మళ్ళి ఆయని గురించి వింటున్నా..
lalithag said…
సుజనరంజని ద్వారా వేమూరి గారి గురించి తెలుసుకున్నాను. అంతకు ముందే http://sahiti.org/ లోని ద్వారా వారి పేరు నాకు పరిచయమయ్యింది. ఆయన రాసిన వ్యాసాలు కొన్ని ఇంతకు ముందు చదివాను. మళ్ళీ ఇప్పుడు మీరిచ్చిన లంకె ద్వార ఇంకొన్ని ఆసక్తి కరమైన విషయాలను వారి వ్యాసాలు చదివి తెలుసుకోగలుగుతున్నాను. ధన్యవాదాలు.

ఈ సందర్భంగా నాకీ మధ్య తెలిసిన ఆసక్తి కరమైన విషయం ఇంకొకటి రాయాలని ఉంది. Newton scientific exploration అంతా కూడా అతని religion లో భాగమే అని, అంటే దేవుడిని, మతాన్నీ అర్థం చేసుకోవడాం కోసం అతను ఈ మార్గాన్ని ఎన్నుకున్నాడని ఒక కార్యక్రమం లో చూశాను. అందులో వింతైన విషయం ఏమంటే NewTon పరసువేది ప్రయోగాలు చేసే వాడని, అందుకు సూత్రాలను విచిత్రమైన పద్ధతిలో క్రోడికరించే వాడట. పరసువేదిని అభ్యసించే వారు ఇలాగే గ్రీకు పురాణ కథలలోని పాత్రల పేర్లతో, ఇంకొన్ని జుగుప్సా కరమైన పేర్లతో కూడా పరసువేది లో వాడే రసాయనాల పేర్లు క్రోడికరించే వారట.

Newton గురుత్వాకర్షణ శక్తిని calculate చెయ్యటం చెప్ప గలిగాడు కాని, విజ్ఞాన పరంగా తృప్తికరమైన వివరణ ఇవ్వలేకపోయాడట.

వారసత్వంగా వస్తున్న వేదాల వంటివి ఇప్పటికి మనకు తెలిసిన విజ్ఞానంతో, ఆ విజ్ఞానం ఇచ్చిన పరిమితమైన చూపుతో, పోల్చి చూడడమూ, అలాగే ఇప్పటికి మనకు విజ్ఞాన రూపంలో తెలిసి ఉన్నదే మొత్తం అంతా అనుకోవడామూ రెండు అతి శయోక్తులే అనిపిస్తుంది.

ఏది ఏమైనా, జిజ్ఞాస ఉన్నవారు ప్రయత్నించి తెలుసుకోవాలి కానే ఆక్షేపించి ఊరుకోరాదన్నది నా అభిప్రాయం.
spandana said…
వ్యాసం బాగుంది. ఇంతకు ముందు వికీలో ఇలాగే ఓ శ్లోకం చూశాను. చందోబద్దంగా, శ్లోకాల్లో ఎందుకు ఇలా విజ్ఞనాన్ని ఇరికించవలసి వచ్చింది అన్నదానికి సహేతుకంగా సమాధానం చెప్పిన తీరు బాగా వుంది.
ఈయన వ్యాసాలు ఇంకా చదవాలి.

--ప్రసాద్
http://blog.charasala.com
Anonymous said…
vemuri lanti vaaru, alaanti vaari gurinchi maaku teliyacheppe meelanti vaaru lekapote mememaipodumo?
venkat
www.24fps.co.in
pi said…
Nenu eeyanani chaalaa saarlu kalisaanu. Kaani eeyanana raasthaarani naaku appudu teliyadu. Appudappudu UC Berkeley lo telugu effort ki kaastha help chestnaanu. Annattlu eeyanadi Tuni, maadi Hamsavaram.
vrdarla said…
నిజంగా వేమూరి గారు తెలుగు కి చాలా కృషి చేస్తున్నారు. ఆయన వ్యాసాలు విశ్లేషణాత్మకంగా, ఎవ్వరినీ నొప్పించకుండా ఉంటాయి. ఇది అందరికీ సాధ్యం కాదేమో. ఇలాంటి వారిని పరిచయం చేయండి. అలాగే మీరు సంబధిత హైపర్ లింక్ ఇవ్వడం వల్ల కూడా చాలా విషయాలను తెలుసుకోవలిగే వీలు కలుగుతుంది.