భద్రుడి నూతన యుగావిష్కరణ

చెట్టు ఇస్మాయిల్ గారి తవ్వకం పద్యానికి కిరణ్ ఆంగ్లానువాదం చదివినప్పుడు ఏదో జ్ఞాపకపు తెర కదిలింది.
వాడ్రేవు చిన్నవీరభద్రుడి పద్యానికి నా ఈ ఆంగ్లసేత ఎప్పుడో ఆరేడేళ్ళ క్రితం సులేఖ డాట్ కాం లో రాశాను.
మొత్తానికి ఆయన స్వయంగా తవ్వినా, నాతో తవ్వించినా కిరణ్ నా పాలిట పురావస్తు పరిశోధకునిగా పరిణమించారు. ధన్యవాదాలు కిరణ్!
తెలుగు మూలం, కవి పరిచయం టపా చివర.
అనువాదంలో ఏదన్నా అందముంటే అది మూలకవిది.
అవకతవకలన్నీ నావి.

For the Dawn of a New Era

- V. Chinnaveerabhadrudu

Today, I must explode myself with dynamite.

Without that, the rocky blockades of my heart won’t yield.


I must dig into myself, and draw from deep within

Just one drop of pure water, for just one kind word.


Unless it endures much agony

Under the oppressive typhoons, and upon the licking flames of wildfires,

This branch of life won’t give birth to even a tender shoot.


For one smile, today I must wage a great battle against myself.

So that a bud may blossom, I must shed blood, shed tears.


Until my mortal world gets crushed and burnt in the scorching unbearable suffering,

The pearl of compassion won’t twinkle in the corner of The Prophet’s eye.

A poem won’t shine forth.


Until then, the curtain won’t rise on the dawn of a new era.



ఒక నూతన యుగావిష్కరణ కోసం
- వాడ్రేవు చిన్నవీరభద్రుడు

ఇవాళ నన్ను నేను డైనమైట్లతో పేల్చుకోవాలి
అప్పుడు గానీ నా హృదయ పాషాణాభ్యంతరాలు తొలగవు.

నన్ను నేను తవ్వుకోవాలి నాలోకి, తోడుకోవాలి నాలోంచి
ఒక్క చుక్క మంచి నీటి కోసం, ఒక్క మంచి మాట కోసం.

తుపానుల ఒత్తిడుల మీద, దావాగ్ని కీలల రాపిడుల మీద
ఎంతో వ్యధ చెందితేనే గాని
ఈ జీవిత శాఖ ఒక్క లేత చిగుర్ని కూడా ప్రసవించదు.

ఒక్క నవ్వు నవ్వటానికి, ఈరోజు నాతో నేను ఒక మహా సంగ్రామమే కానివ్వాలి.
ఒక్క పువ్వు పుయ్యటానికి ముందు నే నెత్తురొలికించి కన్నీరు చిందించాలి.

నా మానవ ప్రపంచమంతా దుర్భర వేదనల సెగలో నలిగి రగిలినప్పుడు గానీ
ఒక ప్రవక్త కన్నీటి కొలకులో కారుణ్యపు ముత్యం తొణకాడదు,
ఒక కవిత ప్రభవించదు.

ఒక నూతన యుగావిష్కరణకై తెర తొలగదు.
********************************

వేదాంత శాస్త్రంలో ఎమ్మే పట్టం పుచ్చుకున్న వాడ్రేవు చిన్నవీరభద్రుడు కవిగా కథారచయితగా విమర్శకునిగా ప్రసిద్ధులు. నిర్వికల్ప సంగీతం, అరణ్యం, ప్రశ్నభూమి, ఒంటరి చేల మధ్య ఒక్కత్తే మన అమ్మ వీరు ప్రచురించిన పద్య సంకలనాలు. ఆంప్ర ప్రభుత్వ గిరిజన అభివృద్ధి శాఖలో వివిధ పదవులు నిర్వహించి ప్రస్తుతం డిప్యుటీ డైరెక్టరుగా పనిచేస్తున్నారు. చిత్తశుద్ధితో తాను పని చేసిన ప్రాంతాలలో గిరిజనుల అభివృద్ధికి పాటుపడ్డారు. అంతర్ముఖమైన తాత్త్విక చింతన వీరి కవిత్వంలో ప్రముఖ భూమిక వహిస్తుంది. ఈ మధ్య కాలంలో వేదాంత శాస్త్రం పై తెలుగులో అనేక పుస్తకాలు ప్రచురించారు. ఆ విషయాలు మరోమాటు.

Comments

Sriram said…
aaahaa manci kavitani parichayam chesaaru. eeyana gurimci marinni vivaraalu telapamDi.

you have done an excellent job in translation. congrats!
కొత్తపాళిగారు, పద్యమన్నారు, ఇది ఏ రకం పద్యమో సెలవివ్వమని మనవి. ఇది ఏదైనా ఛందస్సుకు లోబడి ఉందా?
poem కీ poetry కి భేదం తెలిపే ప్రయత్నమది. సాంప్రదాయకమైన ఛందస్సు లేకుండా రాసే వాటిని వచన కవిత, లేక పొట్టిగా "కవిత" అనడం అలవాటై పోయింది. జాషువా కృష్ణశాస్త్రుల కాలంలో ఇలాంటి వాటిని ఖండికలు అనేవారు. అది కొంచెం కఠినంగా ఉంటుంది. నా ఉద్దేశంలో కవిత అంటే కవిత్వమే (పొయెట్రీ, పోయెం కాదు). జయప్రభ తన సంకలనాల మీద "జయప్రభ పద్యాలు" అని వేసుకోవడం చూశాక నేనూ అదే పద్ధతి అవలంబిస్తున్నాను. సాధ్యమైనంత వరకూ "కవిత"ని పోయెం అనే అర్థంలో ఉపయోగించను. భద్రుడి ఈ పద్యంలో మాటల పొందిక వల్ల ఏర్పడ్డ నడక, కొద్ది అంత్యప్రాసలు తప్ప సాంప్రదాయకమైన ఛందస్సు లేదనుకుంటాను.
అలాగన్నమాట.థాంకులు.