ప్రముఖ అమెరికన్ వ్యంగ్య నవలా రచయిత కర్ట్ వానగట్ మరణించారని యాహూమెయిల్లో లాగిన్ అవగానే కనిపించింది. ఆయనకి 84 ఏళ్ళు.
అమెరికన్ సృజన సాహిత్య ప్రపంచంలో మార్క్ ట్వైన్ తరవాత అటువంటి సెటైర్ అంత కన్సిస్టెంట్ గా రాసిన రచయిత మరొకరు కనబడరు. సమకాలీన ప్రపంచాన్ని, జీవితాన్ని, ఎక్స్ రే తీసి, లోపల కుళ్ళి కంపుగొడుతున్న రుగ్మతల్ని ఎండేసిన పదునైన కత్తి ఆయన కలం. దేవుణ్ణి నమ్మక, మనిషి ఎంత కౄరుడైనా, ఎన్ని రాక్షస చర్యలు చేసినా మానవత్వాన్నే నమ్మి, ఎప్పటికైనా మానవత్వం గెలుస్తుందనే ఆశతో రచనలు చేసిన మానవతా వాది.

ఇంచుమించు ఇరవై నవలలు రాశారు. స్లాటర్ హౌస్ ఫైవ్ (Slaughterhouse Five) బాగా పేరు తెచ్చుకున్న నవల, ఇప్పటికీ ఇక్కడ హైస్కూళ్ళ ఇంగ్లీషు లిటరేచర్ క్లాసుల్లో చదువుతుంటారు. నాకు తెలిసి ఆయన నవలలన్నీ చిన్నవే - రెండొందల పేజీలకంటే ఉండవు.
సుమారు 2000 సంవత్సరం ప్రాంతాల్లో సులేఖ డాట్ కాం లో సరదాగా పాల్గొంటున్న రోజుల్లో అక్కడి సంభాషణల వల్ల వానగట్ గురించి తెలిసింది. అప్పుడు కుతూహలంతో స్థానిక గ్రంధాలయం నించి కొన్ని నవలలు తెచ్చి చదివాను. బుర్ర తిరిగింది ఒక్క సారి ఆ పదునుకి, ఆ సృజన శక్తికి, ఆ భాషకి. ఆపై, కనబడిన ప్రతి పాత పుస్తకాల కొట్టులో ఆయన పుస్తకాల కోసం వెదికే వాణ్ణి. ఎక్కువ దొరక లేదు. నా దగ్గర ఐదో ఆరో ఉండాలి. ఆయన్ని స్మరించుకుంటూ మళ్ళీ ఇంకో సారి చదవాలి అవన్నీ.
Comments
మీరు నా తెలుగు పురోగమనం(:-) చెందుతుంది అని తెలిపినందుకు ధన్యవాదాలు. It means a lot to me.
"... దుర్మానవ ప్రపంచంలో దైవికమైనవి ..." లాంటి వాఖ్యాలు వ్రాయగలిగినప్పుడు నిజంగా ఆనందిస్తా.
అవును నాకు జాజ్ సంగీతం అంటే చాలా ఇష్టం. అలానే రాక్ అండ్ రోల్, సున్నిత రాక్, కూడా చాలా ఇష్టం. ఎంతో వ్యక్తిత్వం ఉన్నా ఏ తరహా సంగీతమన్నా చాలా ఇష్టమే.
ఈ కాలపు తెలుగు సినిమా పాటలు అందుకే నచ్చవు.
Naa kadha meeda mee abhiprayam raasinanduku dhanyavadalu.
meeku mail cheddamante email ID ledu anduke ikkada mail chesanu.
satyavati.