Sunday, December 9, 2012

కర్నాటక సంగీతాన్నిఆస్వాదించడం ఎలా - 4

వినడానికి మరికొన్ని సూచనలు

వినడం మొదలు పెట్టిన తొలిదశలో వాద్య సంగీతం కంటే గాత్రం వినడం శ్రోతకి బాగా ఉపయోగపడుతుందని నా అనుభవం. అందులోనూ వాసికెక్కిన మహానుభావుల గాత్రం వినడం మరీ మంచిది. సంగీత త్రిమూర్తుల (త్యాగరాజస్వామి, శ్యామశాస్త్రులు, ముత్తుస్వామి దీక్షితులు) తరువాత కృతి (లేక కీర్తన) అనే పాట రూపం కర్నాటక సంగీతానికి మూలస్తంభంగా ఏర్పడింది. కృతిలో సాహిత్యం ఉంటుంది గనక, పాట వినేప్పుడు గాత్ర రూపంలో ఉంటే, ముందు ఆ సాహిత్యం మనసుకి పట్టి తద్వారా సంగీత రసాస్వాదనలో పైకి వెళ్ళేందుకు మార్గం సుగమం అవుతుంది. అదే వాద్య సంగీతం వింటున్నట్లయితే, అక్కడకూడా వారు ఆ కృతినే వాయిస్తున్నా ఆ సాహిత్యం మన చెవిని పడకపోవడంతో నేరుగా సంగీతాన్ని అవగాహన చేసుకోవడం కొంత కష్టం అవుతుందని నా అనుభవం.  ముందుగా గాత్రం వింటూ కొన్ని రాగాలనూ కొన్ని కృతులనూ మనసులో నిలుపుకోవడం అలవాటయితే అప్పుడు వాద్య సంగీతంలోని లోతులు కూడా సులభంగా తరచి చూడవచ్చు. కానీ కొందరు శ్రోతలకి వాద్య సంగీతం వినడమే హాయిగా ఉండవచ్చు. అయినా ఇదే వినాలి, ఇది వినకూడదు అని రూలేం లేదు, ఇదొక సూచన మాత్రమే.

మన తెలుగువారి దురదృష్టం, తెలుగు విద్వాంసుల రికార్డింగులు చాలా తక్కువే, ఒక్క బాలమురళీని మినహాయించి. నాకు గుర్తున్న గొప్ప గాయకుల పేర్లు కొన్ని కింద ఇస్తున్నాను. ఈ జాబితాలో ఎక్కువ తమిళ పేర్లే ఉంటాయి. అంతేకాక భారతీయ పేర్లను ఆంగ్ల లిపిలో రాయడంలో వచ్చే వేర్వేరు రూపాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి జాలంలో వెతికేప్పుడు. పాతతరం, మధ్యతరాలకి చెందిన గాయకుల రికార్డింగులలో ఆడియో క్వాలిటీ అంత బాగా ఉండకపోవచ్చు. ముఖ్యంగా యూట్యూబులో ఉండేవి చాలా మట్టుకి ఎవరెవరో ప్రైవేటుగా రికార్డు చేసుకున్న కచేరీలు. అలాగే తమిళ గాయకుల తెలుగు ఉచ్చారణ కొంత ఇబ్బంది పెడుతుంది. ఏదైనా ఒక రికార్డింగు, ఒక అంశం నచ్చకపోతే, మరేం పరవాలేదు. మరొకదాన్ని వినండి. మంచి క్వాలిటీ ఉన్న రికార్డింగులు కూడా చాలానే ఉన్నాయి.

పాతతరం మహామహులు
అరియక్కూడి రామానుజ అయ్యంగార్ Ariyakudi Ramanuja Iyengar పాలించు కామాక్షి, శ్యామశాస్త్రులకృతి, మధ్యమావతి రాగం, ఆదితాళం
టైగర్ వరదాచారి Tiger Varadachari సభాపతిక్కు, గోపాలకృష్ణభారతి కృతి, ఆభోగిరాగం, రూపకతాళం
మహారాజపురం విశ్వనాథయ్యర్ Maharajapuram Visvanatha Iyer భక్తి భిక్షమియ్యవే, త్యాగరాజకృతి, శంకరాభరణ రాగం (audio quality quite bad)
జి. ఎన్. బాలసుబ్రమణ్యం G.N. Balasubramaniam (GNB) బ్రోచేవారెవరురా, మైసూరు వాసుదేవాచార్యుల కృతి, ఖమాస్ రాగం, ఆదితాళం
చెంబై వైద్యనాథ భాగవతార్ Chembai Vaidyanatha Bhagavathar An actual video, probably from a film, షణ్ముఖప్రియ రాగం
ముసిరి సుబ్రమణ్య అయ్యర్ Musiri Subramanya Iyer నీరజాక్షి కామాక్షి, దీక్షితుల కృతి, హిందోళ రాగం, రూపకతాళం
ఆలత్తూర్ సోదరులు Alathur Borthers (Sambasiva Iyer, Srinivasa Iyer) Actual video of Srinivasa Iyer only (Sambasiva Iyer passed away) with Lalgudi Jayaraman and Palghat Mani Iyer, కద్దనువారికి, త్యాగరాజకృతి, తోడి రాగం, ఆదితాళం

మధ్యతరం మహానుభావులు
మదురై మణి అయ్యర్ Madurai Mani Iyer సరససామదాన, త్యాగరాజకృతి, కాపినారాయణి రాగం, ఆదితాళం
శెమ్మంగూడి శ్రీనివాసయ్యర్ Semmangudi Srinivasa Iyer ద్వైతము సుఖమా, త్యాగరాజకృతి, రీతిగౌళ రాగం, ఆదితాళం
ఎం. డి. రామనాథన్ M.D. Ramanathan ఓ జగదంబా, శ్యామశాస్త్రుల కృతి, ఆనందభైరవి రాగం, ఆదితాళం
ఎమ్మెస్ సుబ్బలక్ష్మి M.S. Subbulakshmi రంగపురవిహార, దీక్షితుల కృతి, బృందావనసారంగ రాగం
ఎమ్మెల్ వసంతకుమారి M.L. Vasantakumari జయజయ, పురందరదాసుల కృతి, నాట రాగం
డి.కె. పట్టమ్మాళ్ D.K. Pattammal, డి. కె. జయరామన్ D.K. Jayaraman జానకీ రమణ, త్యాగరాజకృతి, శుద్ధసీమంతిని రాగం
మంగళంపల్లి బాలమురళీకృష్ణ M. Balamuralikrishna (MBK or BMK) నగుమోము, త్యాగరాజ్కృతి, ఆభేరి రాగం
నూకల చినసత్యనారాయణ Nookala Chinna Satyanarayana బృహదీశ్వర, బాలమురళికృతి కానడ రాగం
నేదునూరి కృష్ణమూర్తి Nedunuri Krishnamurty ఆరగింపవే, త్యాగరాజకృతి, తోడి రాగం
వోలేటి వెంకటేశ్వర్లు Voleti Venkatesvarlu పట్టి విడువరాదు, త్యాగరాజకృతి, మంజరి రాగం
శ్రీరంగం గోపాలరత్నం Srirangam Gopalarathnam అలమేలుమంగ నీ, అన్నమయ్య పదం, భైరవి రాగం
కె. వి. నారాయణస్వామి K.V. Narayanaswamy ఇంత సౌఖ్యమని, త్యాగరాజకృతి, కాపిరాగం
మణి కృష్ణస్వామి Mani Krishnaswamy కంటజూడుమీ, త్యాగరాజకృతి, వాచస్పతిరాగం
ఆర్. వేదవల్లి R. Vedavalli ముచ్చట బ్రహ్మాదులకు, త్యాగరాజకృతి, మధ్యమావతి రాగం
మహారాజపురం సంతానం Maharajapuram Santhanam శ్రీచక్రరాజ సింహాసనేశ్వరి, రాగమాలిక

ఈనాటి తారలు
కె. జె. యేసుదాస్ K.J. Yesudas క్షీరసాగరశయన, త్యాగరాజకృతి, దేవగాంధారి రాగం
టి.వి. శంకరనారాయణన్ T.V. Sankaranarayanan వల్లభ నాయకస్య, దీక్షితుల కృతి, బేగడరాగం
టి. ఎన్. శేషగోపాలన్ T.N. Seshagopalan బంటురీతి, త్యాగరాజకృతి, హంసనాదం రాగం
హైదరాబాద్ సోదరులు Hyderabad Brothers (D. Raghavachari, D. Seshachari) రఘునాయక, పట్నం సుబ్రమణ్య అయ్యరు కృతి, హంసధ్వని రాగం
మల్లాది సోదరులు Malladi Brothers బాల కనకమయచేల, త్యాగరాజకృతి, అఠాణారాగం
ఉన్నికృష్ణన్ P. Unnikrishnan వెంకటాచల, పురందరదాసుల కృతి, సింధుభైరవి రాగం
టి. ఎం. కృష్ణ T. M. Krishna జగదోద్ధారణ, పురందరదాసుల కృతి, కాపిరాగం
సుధ రఘునాథన్ Sudha Raghunathan రమారమణ, త్యాగరాజకృతి, వసంతభైరవి రాగం
బాంబే జయశ్రీ Bombay Jayashree సుధామయీ, ముత్తయ్యభాగవతుల కృతి, అమృతవర్షిణి రాగం విడియోలో కీరవాణి అని తప్పురాశారు.
ఎస్. సౌమ్య S. Sowmya కనకశైల విహారిణీ, శ్యామశాస్త్రుల కృతి, పున్నాగవరాళిరాగం
నిత్యశ్రీ మహాదేవన్ Nityasree Mahadevan పరాత్పర, పాపనాశం శివన్ కృతి, వాచస్పతి రాగం
సంజయ్ సుబ్రమణ్యం Sanjay Subramanyam పెట్రతాయ్, వల్లలార్ తిరుమురై, రాగమాలిక
ప్రియ సోదరీమణులు Priya Sisters సరసిజనాభ సోదరి, దీక్షితుల కృతి, నాగగాంధారి రాగం
పంతుల రమ Pantula Rama శేషాచలనాయకం, దీక్షితుల కృతి, వరాళి రాగం
మండా సుధారాణి Manda Sudharani ఎంతభాగ్యము, త్యాగరాజకృతి, సారంగరాగం