ఇల్ పొస్టీనో (తపాలా బంట్రోతు)

కాల్పనిక కథతో రూపొందిన సినిమాలో ఇటీవల జీవించిన నిజం మనుషులు పాత్రలుగా కనపడ్డం అరుదుగా జరుగుతూ ఉంటుంది. గాంధీ, ఛాప్లిన్ లాంటి జీవిత కథల సినిమాల సంగతి వేరు, వాటిని గురించి కాదు నేను మాట్లాడుతోంది. సరే, మధ్యలో ఒక చిన్న పిడకల వేట. అతి ఎక్కువసార్లు సినిమా కథల్లో పాత్రగా తెర మీద చూపించబడిన నిజం మనిషి ఎవరో తెలుసా? తెలిస్తే చెప్పండి చూద్దాం. పిడకలవేట ముగిసింది.

94లో మెగ్ రయన్, టిం రాబిన్సులతో ఐక్యూ అని సినిమా వచ్చింది .. అందులో మెగ్ ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ గ్రహీత ఆల్బెర్ట్ ఐన్స్టీన్ గారి మేనకోడలు. ఒక కారు మెకానిక్ ఐన టిం, మెగ్ ని పిచ్చగా ప్రేమించేసి, అంత తెలివైన అమ్మాయితో తనకి ఛాన్సులేదని నిరాశపడుతుంటే, ఆయనా, ఆయన తోటి ప్రొఫెసర్లూ కలిసి టిం ప్రేమ పురాణానికి శ్రీకారం చుడతారు. తమ తెలివినంతా ఉపయోగించి శుభం అని భరతవాక్యం కూడా పాడిస్తారు. చాలా సరదాగా ఉంటుంది సినిమా, కాస్త హై లెవెలు ఫిజిక్సూ లెక్కలూ పరిచయం ఉన్నవాళ్ళైతే అందులో జోకులు ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు.

అదే సంవత్సరం ఒక ఇటాలియను సినిమా వచ్చింది ఇంకో నోబెల్ గ్రహీత పాత్రతో. అద్భుతమైన ప్రేమ కవిత్వానికి పెట్టింది పేరుగా ప్రసిద్ధి కెక్కిన స్పానిష్ భాషా కవి, చిలీ దేశవాసి పాబ్లో నెరుడా తన మాతృదేశంలో ఉన్న రాజకీయ అల్లకల్లోలం వల్ల కొంత కాలం ఇటలీలో ఒక చిన్న బెస్తవాళ్ళ ద్వీపంలో ప్రవాసముంటాడు. ఆయన ఉన్న ఇల్లు ఒక గుట్ట మీద ఉంటుంది. ఆయనకోసం ప్రపంచం నలుమూలల్నించీ వచ్చే ఉత్తరాలని రోజూ ఆ గుట్ట ఎక్కి ఆయనకి చేర్చలేక ఆ ద్వీపపు పోస్టుమాస్టరు ఒక కుర్ర అసిస్టెంటుని పెట్టుకుంటాడు. ఆ అసిస్టెంటే మన హీరో.

కవిత్వానికీ జీవితానికీ కూడా కొన్ని మంచి అర్థాలున్నై ఈ సినిమాలో. ఏ మాత్రం హడావుడీ, కంగాళీ లేకుండా హాయిగా నింపాదిగా సాగిపోతుంది సినిమా. అలాగని బోరుకొడుతుందనుకుంటే పొరబడ్డారు.
ఈ సినిమా గురించి చాలా చెప్పాలనుంది గానీ ..ఇది చూసి తీరాల్సిన సినిమా .. అందుకని కథ చెప్పి మీ అనుభవాన్ని పాడు చెయ్యను. తప్పక చూడండి .. నచ్చకపోతే నాదీ హామీ.

మగవారికి ఒక సలహా .. మీకు ఒక లడకీ దోస్తో, ఉత్తమార్ధమో ఉంటే ఆమెతో కలిసి చూడండి. ఆమె మీ సినిమా టేస్టుని మెచ్చుకుంటుంది. క్రెడిటంతా మీరే పుచ్చుకోవచ్చు నిరభ్యంతరంగా! :-)

Comments

కొత్తపాళీ గారూ దీపావళి శుభాకాంక్షలు
Giri said…
ఇటాలియను సినిమా చూడలేదు కాని, ఐక్యూ చూసాను ఐదారేళ్ళ క్రితం - అప్పుడది ఫర్వాలేదనిపించింది..ఇల్పోస్టినో మా శాఖాగ్రంధాలయంలో ఉండే ఉంటుంది,చూస్తాను..సినిమాలలో మాంఛి టేస్టు చూపించి ఇతరసగాన్ని పడగొట్టడం ఎప్పుడో జరిగిపోయింది :)
కొత్తపాళి గారు ఐక్యూ సినిమా నేను సగం సగం చూశాను. చాలా హాస్యభరిత సన్నివేశాలతో కూడి ఉంటుంది. కాని భౌతిక శాస్త్ర పండిత పుత్రః , భౌతికశాస్త్ర పామర శుంఠ కి ఆలెక్కలు అర్థం కాలేదు. సినిమా లొ సమీకరణాలు సంజ్ఞలు కూడా మైమింగ్ చేస్తారు.
pi said…
Ivent heard of IQ. I heard of Il Postino. It is in my netflix queue. Will check out IQ also.
ramya said…
ఈ ఇటాలియన్ సినిమా ఎక్కడ దొరుకుతుందో చెప్పండి.
naku choodalanivundi
@ Visvanath - hope you had a nice one.
@ Giri - :-) Postino is certainly worth it.
@Blagesvara - I'm a botany "paMDita putra":-))
@pi - IQ is not great, but enjoyable. Postino is not great but very good .. some nice sublte things.
@Ramya - if you live in the US you can get it in a local public library, any video library that stores good foreign collection or Netflix.
venkat said…
ఈ సినిమా మీరు చూడకపోయినట్టయితే, ఈ వ్యాఖ్య చదవకండి. చూసాక చదివితే మంచిది. ఎందుకంటే ఈ సినిమాలో పోస్ట్‌మేన్ పాత్రలో నటించిన Massimo Troisi తీవ్ర అస్థవ్యస్థత తో వున్నప్పటికీ ఆ ఛాయలేవీ కనిపించకుండా ఈ సినిమాలో నటించాడు. అంతే కాదు ఈ సినిమా షూటింగ్ అయిపోయిన 12 గంటలలోపే ఆయన ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయారు. ఈ విషయం తెలియకుండా ఆ సినిమా చూస్తే Massimo Troisi ఆ విషయం మనకెక్కడా తెలియరాదు. అందుకే నియమాలకు వ్యతిరేకంగా మొదటిసారిగా ఒక ఫారిన్ లాంగ్వేజ్ సినిమాలో నటించిన నటుడికి ఉత్తమ నటుడి గా అస్కార్ వాళ్ళు పురస్కారం అందచేసారు. కొత్తపాళీ గారు చెప్పినట్టు ఇది అందరూ తప్పక చూడవలసిన సినిమా, ఒక్క సారి కాదు కనీసం రెండు సార్లు.

వెంకట్
www.24fps.co.in
@వెంకట్ .. మీ ఉద్దేశం అస్వస్థత అయ్యుంటుంది.
venkat said…
అవునండీ. నా తెలుగు ఏడ్చినట్టే వుంది. ప్చ్ :-(
కథాంశం వింటుంటేనే చాలా బాగుంది.
సినిమా ఇంకెంత బాగుంటుందో..
Anonymous said…
కొత్తపాళీ గారూ,
టపా వేసిన ఇన్నాళ్లకి కామెంటు పెట్టినందుకు ఏమీ అనుకోకండి.(పైగా పోస్ట్ మేన్ చిత్రమ్మీద పోస్టు..)
ఆ సినిమాల సంగతి సరేగానీ, ఇంతకీ అతి ఎక్కువసార్లు సినిమా కథల్లో పాత్రగా తెర మీద చూపించబడిన నిజం మనిషి ఎవరు?
--సూరంపూడి పవన్ సంతోష్.
@పవన్, ఇన్నాళ్ళకి ఆ ప్రశ్న బలే గుర్తు చేశారే. హిట్లర్ అని ఎక్కడో చదివాను.30కి పైగా సినిమాల్లో హిట్లర్ ఒక పాత్రగా కనిపిస్తాట్ట.