మరొక ప్రపంచ కప్ సన్నివేశం

ఇరవయ్యేళ్ళ క్రితం ..

బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరరుగా పని చేస్తున్నా. ఇద్దరు బ్రహ్మచారి సహోద్యోగులతో కలిసి ఒక పోర్షను అద్దెకి తీసుకుని ఉంటున్నాం "మాయాబజార్" అనే పేటలో. ఇది ఏజీ కాలేజీ వెనకగేటు (ఆడపిల్లల హాస్టలు గేటు) దగ్గర్లో ఉంటుంది. మేముంటూన్నది ఒక పాత కట్టడం. రెండు గదులు, ముందొక వసారా. మా పక్క పోర్షనులో ముగ్గురో నలుగురో మాకాలేజి పిల్లలే ఉండేవాళ్ళు.

ఇంటి ఓనరు వాళ్ళు చదువుకున్న వాళ్ళు కాదు. ఊళ్ళో ఏదో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. మేమున్న ఇంటిపక్కనే తాటాకుల ఇళ్ళ కాంపౌండులో ఉమ్మడి కుటూంబంగా ఉండేవాళ్ళు. పెద్దాయనకి ఇద్దరు మగ పిల్లలు. అండులో పెద్దాడు అప్పటీకి బహుశా ఏ ఎనిమిదో చదువుతుండాలి. మాకు పొద్దుటే కూజాలో మంచినీళ్ళు తెచ్చి పెడుతుండేవాడు (దీని కథ ఇంకోసారి చెబుతాను). వాడికి మహా క్రికెట్ పిచ్చి. ఒక కొబ్బరి మట్ట బేటుగా, రబ్బరు బాలుతో అస్తమానం క్రికెట్టాడుతుంటే వాళ్ళమ్మ కేకలేసేది, "మేస్టారి దగ్గిరకెళ్ళి కాస్త చదువుకోరా" అని. వాడికి చాలా అనుమానం మా మీద, ఎక్కడ గబుక్కుని వాణ్ణి పట్టుకుని చదువు చెప్పేస్తామో అని .. ఎప్పుడూ అంతంత దూరంగా ఉంటూ ఉండేవాడు.

ఇంతలో వరల్డ్ కప్ హడావుడి మొదలైంది. భారత్ పాకిస్తాన్ లు కలిపి జాయింటుగా నిర్వహించారు. కాలేజిలో ఇంట్లో ఎక్కడ చూసినా క్రికెట్ గోలే. నాకు మహా విసుగు. మా దగ్గిర టీవీ లేదుగా, నా రూమ్మేట్లు కాలేజీ ఐపోయాక కాలేజిలో హాస్టల్లో ఉండిపోయేవాళ్ళు టీవీకోసం. నేనొక్కణ్ణే ఉసూరుమంటూ ఇంటికొచ్చేవాణ్ణి.

ఒకరోజు మా సందులోకి తిరిగేప్పటికి అక్కడ మా ఓనరు కొడుకు ఇంకొందరు పిల్లకాయల్నేసుకుని కొబ్బరి మట్ట క్రికెట్టాడుతున్నాడు. నన్ను చూడగానే "@%$@ వస్తున్నాడ్రా!" అని అరిచాడు. వాడేవన్నాడో నాకు సరిగ్గా వినబళ్ళా. పిలిచాను, ఏవన్నాడో కనుక్కుందామని. చెప్పానుగా వాడికి మేమంటే చాలా అనుమానమని - ఇందాకన్న మాటే మళ్ళీ అరుస్తూ సందు అవతలకి పరిగెత్తాడు. ఈ సారి క్లియర్ గానే వినబడింది .. ఏదో పాశ్చాత్యుల పేరు. వీడు మనల్ని పొగుడుతున్నాడో తిడుతున్నాడో అర్ధం కావట్లేదు. ఎవరో క్రికటర్ పేరై ఉంటుందని ఊహించాను.

ఆ సాయంత్రం మా రూమ్మేట్ ని అడిగాను. అతను ఆస్ట్రేలియన్ ఆటగాడనీ, బేటింగ్ తో ఎదుటి టీముల్ని చావబాదుతున్నాడనీ చెప్పాడు. ఓహో, ఎవడో హీరో మెటీరయలే అన్న మాట. పర్లేదు. కానీ మళ్ళీ ఒక డౌటొచ్చింది. అతను చూడ్డానికెలాగుంటాడు? మా రూమ్మేట్ ఎగాదిగా చూసి, "హమ్మ్ కొంచెం నీలాగానే ఉంటాడు" అన్నాడు. ఇంక నాకు కుతూహలం ఆప శక్యం కావట్లేదు. ఆ రోజు రాత్రి భోజనానికి మెస్సు కెళ్ళినప్పుడు పేపర్లో ఆటల విభాగాన్ని ఆత్రంగా గాలించాను. ఎదురుగానే కనబడింది డేవిడ్ బూన్ ఫొటో.

Comments

spandana said…
బాగున్నాయి మీ సరదా జ్ఞాపకాలు.

--ప్రసాద్
http://blog.charasala.com
Anonymous said…
బూన్ లాగా బొద్దుగా, ముద్దుగా వుండేవారన్నమాట. ఇప్పడు కూడా అలాగే ఉన్నారా? :)
-నేనుసైతం
Naga said…
అప్పుడు మీసాలు గానీ పొడుగ్గా ఉన్నాయా ఏమిటీ? కొంత 'మేచ్' అయినట్టే అనిపిస్తుంది :)
హహ్హహ్హహ్హ..తగ్గ పేరే పెట్టాడన్నమాట! ప్రైవేటు చెప్పకుండానే శత్రువైపోయారన్నమాట వాడికి.
Naga Pochiraju said…
హహహ్హ.........భలే పేరు పెట్టారు మీకు....
ఆయనలాగా మీరు అందరి మీద మీ టీచింగుతో విరుచుకు పడతారా??
Anonymous said…
నాకు తెలిసి డేవిడ్ బూన్ మీసాల్తో గంభీరంగా కనిపిస్తాడు గానీ, మెత్తని వాడే. ఆ కిటుకు తెలిసినట్లేదు ఆ పిల్లాడికి. :-)
Let me just say - I've never been slim.
ఇంకా అంతకంటే డీటెయిల్సడగటం సభా మర్యాద కాదు :-))
నాగరాజా - అవును, అప్పుడు మీసాలు ప్పొడుగ్గా పెంచాను కొంతకాలం.
లలితాస్రవంతి - అబ్బే లేదండీ, కాలేజిలో పిల్లలు చాలా ఇష్టపడేవాళ్ళు.
వికటకవి - నేనూ అంతేనండీ, మీకు తెలియలా ఇప్పటికి? :-)
Anonymous said…
Are you being humble? you look much much better than this picture!
pi said…
rofl! Funny story.
ఐతే... బాపట్లలో మాయాబజారులో ఒక సుందరప్రాంతంలో ఇల్లు అద్దెకు తీసుకొని ఉండేవారన్నమాట ;)
Sriram said…
కొబ్బరిమట్ట క్రికెట్ ని గుర్తు చేసి చాలా జ్ఞాపకాలనే కదిపారు.

అన్నట్టు, డేవిడ్ బూన్ భరతనాట్యం చెయ్యడం ఎవరైనా చూసారా? :)
నేను ఫ్లికర్ లో చూసాను కానీ సభామర్యాదకాదేమో అని ఇక్కడ లంకె ఇవ్వటంలేదు.
Unknown said…
కొత్త పాళీ గారూ చాలా బాగున్నాయి మీ జ్ఞాపకాలు. చిన్నప్పుడు మేమూ కొబ్బరి మట్టలతో క్రికెట్ ఆడిన సందర్భాలు ఉన్నాయండీ! మరో విషయం మాది బాపట్ల ప్రక్కన చెరువు జమ్ములపాలెం అనే గ్రామం. మీ జ్ఞాపకాలతో నా చిన్నప్పటి స్మృతులూ గుర్తొచ్చాయి.
-నల్లమోతు శ్రీధర్
Ramani Rao said…
కొత్తపాళి గారు ఇలా వుంటారు అని చెప్పకనే చెప్పారు.. బాగున్నాయండీ మీ సరదా జ్ఞాపకాలు..
Unknown said…
బూన్లా క్రికెట్టాడేవారు కూడానా ?

రానారె: సుందరప్రాంతంలో కాదు, సుందరిప్రాంతంలో ఉండేవారు కొత్త పాళీ గారు ;)
బూన్లా క్రికెట్టు? హహహ్హ!! నాకసలు క్రికెట్టంటే పడదని టపాలోనే చెప్పాను కదా! ఐనా బాపట్లలో క్రికెట్ వ్యాసంగం కొంత జరిగింది. విశేషాలు ఈ జ్ఞాపకాల తరువాయి భాగాల్లో. :-)
సుందరీ ప్రాంతమేవిటి, పిండాకూడు!! ఏజీ కాలేజి హాస్టలు అమ్మాయిలు కూడా మేము పోషించిన మిరపకాయబజ్జీల బండినే పోషించేవారని సిసిము గారు చెప్పారు కానీ మాకెప్పుడూ దర్శనాలు కాలేదు. బహుశా టైమింగ్ తేడా ఏమో :-(
శ్రీధర్ గారూ, జమ్ముల పాలెం అంటే సముద్రం వేపుకి ఉంటుందా? ఐనా బాపట్ల రోజుల్లో మొబిలిటీ సమస్య .. అందుకని చుట్టుపక్కల ఎక్కువ తిరగలా.
మొత్తానికి ఊరించి ఊరించి బాపట్ల కబుర్లు మొదలు పెట్టారన్నమాట. ఇక ఆపకండి.

నిన్నటినుండి మీ బ్లాగులో వ్యాఖ్య రాద్దామంటే పోస్టు అవటంలేదు.
మిరపకాయ బజ్జీల వాడి దగ్గరికి మేమెక్కడ వచ్చేవాళ్ళమండి, వాచుమానే గతి, వాడు తెచ్చిచ్చేదాకా ఎదురుచూపులే, మేము గేటులోపల బందీలం!!. ఇంతకీ మీరు అక్కడ ఏ సంవత్సరాలలో ఉన్నారో?
Unknown said…
ఏంటో ఈ మధ్య నేను గెస్ చేసిన రూపాలన్నీ తప్పగా తేలుతున్నాయి :-(. మొత్తానికి మాస్టారు గారు మృదు స్వభావులు..గంభీరాకారులన్నమాట
సిసిము గారూ, మీ ఏజీ కాలేజి అమ్మాయిలు మరీ అంత అసూర్యంపశ్య లనుకోలేదు :-) నేను బాపట్లలో పని చేసింది ఒక్క విద్యా సంవత్సరం మాత్రమే. పని చేసిన కాలం డైరెక్టుగా చెప్పేస్తే నేను నేనెందుకవుతానూ? కాలమానానికి సూచనలు టపాలోనే ఉన్నాయి.

తెలుగు వీరా .. ఏ రూపము ఊహించుకున్నారేవిటి? ఇప్పుడు నాకు కుతూహలం మొదలైంది :-)
ఇండియా పాకిస్తాను కలిసి నిర్వహించిన కప్లు రెండు, రెండవదాంట్లో శ్రీలంక కూడా జత చేరింది. మీరు శ్రీలంక ప్రసక్తి తీసుకురాలేదు కాబట్టి, 1996లో బూన్ తెరమరుగైయ్యడు కాబట్టి, మీరు చెప్పిన సంఘటనలు 1986-87 లో జరిగి ఉండాలి..
asha said…
మిమ్మల్ని డేవిడ్ బూన్ తో పోల్చాడా?
హ...హ..హ
మా యూనివర్సిటీలో ఒకతను అనిల్ కూంబ్లే లా ఉండేవాడు. అతనికి చాలా ఫాలోయింగ్ ఉండేది.