Friday, February 25, 2011

గుండె ఊసులాడింది

ఇది మాఘమాస మనుకున్నాను, ఏదో పత్రిక చదువుతుంటే గుండె మాసమట!

మొత్తమ్మీద ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, ముఖ్యంగా గుండెని రక్షించుకోవడానికి ఆరోగ్యకరమైన జీవనశైలిని మించిన ఉపకరణం మరొకటి లేదు. మన దైనందిన అలవాట్లలో చిన్న మార్పులద్వారా గుండె అనారోగ్యం పాలయ్యే అవకాశాన్ని బాగా తగ్గించవచ్చని వైద్యులు ఘోషిస్తున్నారు.

హృదయారోగ్యానికి నేను పాటిస్తున్న పంచశీల సూత్రాలు:
    అర్జంటుగా పొగతాగడం మానెయ్యాలి, ఒకేళ అలవాటుంటే. మీ గుండెతోపాటు మీ జీవిత భాగస్వామి కూడా మిమ్మల్ని మెచ్చుతారు.

    రోజంతా సాధ్యమైనంత చలాకీగా గడపాలి. చలాకీ అంటే నవ్వుతూ తుళ్ళుతూ అని కాదు - అదికూడా ఓకే గాని, శరీరం కదులుతూ ఉండాలన్నది ఇక్కడ గమనించాల్సిన పాయింటు. పై అంతస్తుకి వెళ్ళాల్సి వచ్చినప్పుడూ లిఫ్టుకి బదులు మెట్లెక్కి వెళ్ళడం, వీధి చివర షాపుకి వెళ్ళాలంటే బండి తియ్యకుండా నడీచి వెళ్ళడం. ప్రతిరోజూ అరగంట నించీ గంట వరకూ చెమటపట్టే వ్యాయామం కూడ చెయ్యగలిగితే మరీ మంచిది.

    నోరు కోరే తిండి గుండెకి చేటు. ఏమి తింటున్నామో గమనించుకోవడం అత్యంత అవసరం. అలాగని కడుపు కట్టేసుకోమని కాదు, జిహ్వ చంపుకోమని కాదు. కొన్ని రకాల కొవ్వులు - Saturated fat and Trans fat గుండె జబ్బుల అవకాశాన్ని పెంచుతాయి. మన కళ్ళెదుట తయారు కాని పదార్ధాలు - packaged foods, restaurant meals - తగ్గించడం మంచిది. packaged foods విషయంలో వాళ్ళు కవర్ల మీద రాసేవన్నీ నమ్మలేం. అంతే కాక, ఒక వారం రోజులు డయట్ అనీ, మళ్ళీ తరువాతి వారం యధావిధి, ఇంకో వారం డయట్ - ఇలాంటి ఊగిసలాట కాకుండా, ఎక్కువగా తాజా కూరలు పళ్ళతో నిండి ఉన్న భోజన పద్ధతులని అలవాటు చేసుకుని జీవితమంతా పాటించేలా చూసుకోవాలి. మద్యానికి దూరంగా ఉంటే మంచిది. ఉద్యోగ రీత్యా ప్రయాణాలు చెయ్యాల్సిన వారు, లేదా వ్యాపార సమావేశాల వల్ల చాలా సార్లు బయట తినవలసిన వారు - కొద్దిగా శ్రద్ధ పెడితే గుండెకి నచ్చే భోజన పద్ధతుల్ని వెతుక్కోవడం అంత కష్టం కాదు.

    బరువు కంట్రోల్లో ఉండాలి. అతిబరువు ఉన్నవారు పదిశాతం బరువుతగ్గినా అది గుండె ఆరోగ్యం మీద గొప్ప ప్రభావం చూపిస్తుంది.

    క్రమం తప్పకుండా గుండె ఆరోగ్యాన్ని గమనించుకుంటూ ఉండాలి. వయసు పెరిగే కొద్దీ ఇది తప్పనిసరి.


గుండె పదిలం మరి!

Thursday, February 24, 2011

కొన్ని ప్రకటనలు

కోయంబత్తూరు దగ్గర ఉన్న ఈశ యోగ కేంద్రంలో ఇవ్వాళ్టినించీ వారం రోజులపాటు అద్భుతమైన సాంస్కృతికోత్సవం జరుగుతున్నది.
ప్రతిరోజు, సాయంత్రం 6.30 గంటలనించీ ప్రసిద్ధ కళాకారుల కచేరీ ఉంటున్నది. ఈ సంవత్సరం పాల్గొంటున్న వారు - షాహిద్ పర్వేజ్ (సితార్) సోనాల్ మాణ్‌సింగ్ (ఒడిస్సీ), టి.వి. శంకరనారాయణన్ (కర్నాటక గాత్రం), పర్వీన్ సుల్తానా (హిందుస్తానీ గాత్రం), అనిల్ & గురుచరణ్ (పియానో + గాత్రం), రోను మజుందార్ (హిందుస్తానీ వేణువు), పండిత్ జస్రాజ్ (హిందుస్తానీ గాత్రం)
ప్రవేశం ఉచితమే, కానీ పాస్ ఉండాలి. పాస్ లు అన్ని ఈశ కేంద్రాల్లోను లభిస్తున్నాయి.
వివరాలకు యక్ష ఉత్సవం.

రాబోయే బుధవారం, మార్చి 2న శివరాత్రి. భారత్‌లో మార్చి 3న చేస్తున్నట్లు ఉన్నారు కాని ఉత్తర అమెరికాలో మార్చి 2.

మే 13 - 15 తేదీల్లో సీడార్ రేపిడ్స్ (అయోవా)లో హిందూ దేవాలయ కుంభాభిషేకం, మహారుద్ర యాగం హోమం నిర్వహిస్తున్నారు. వివరాలకు అయోవా హిందూ దేవాలయం.

మే 20 - 30 తేదీల్లో లాస్ ఏంజిలస్ నగర శివార్లలో అతి రుద్ర (111 ఋత్విక్కులు 11 రోజుల పాటు రోజుకి 11సార్లు రుద్ర జపం) మహాయాగం, హోమం నిర్వహిస్తున్నారు. వివరాలకు అతిరుద్ర మహాయాగం.

Thursday, February 17, 2011

60 Degrees (of pure bliss) in Detroit

ఏక్ దిన్ కా సుల్తాన్
One day wonder
But who cares?
Today is going to be 60 Degrees!
In February!!
WOW

Tomorrow - that's another day, another story.

Sunday, February 13, 2011

ఇటీవల చూసిన సినిమాలు - రాజుగారి ఉపన్యాసం

The King's Speech

చాలా వారాలుగా ఆడుతున్నా నిన్ననే చూశాను ఎట్టకేలకు.
ఒకే ఒక్క మాట. అద్భుతం!

పతాకసన్నివేశానికి ముందు, రాజుగారి స్పీచి ఆరుగంటలకి అని చెబుతారు. లయొనెల్ (జెఫ్రీ రష్) రాజభవనానికి చేరేసరికి అతనికి ఎదురొచ్చిన రాజుగారి కార్యదర్శి "మీకింకా నలభై నిమిషాలు వ్యవధి ఉన్నది" అని చెబుతాడు. అక్కణ్ణించి లయొనెల్ రాజు గారిని కలిసి కొంత సేపు గడిచిన తరవాత ఒక దృశ్యశకలంలో పాత్రల వెనక నేపథ్యంలో ఒక చిన్న గోడగడియారం కనిపిస్తుంది. అందులో అప్పుడు సమయం పది నిమిషాల తక్కువ ఆరు.
Now, THAT is attention to detail!